పుష్ప-2 : కేరళలో డిజాస్టర్ కు అసలు కారణం ?
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించినప్పటికీ, కేరళలో మాత్రం దారుణంగా విఫలమైంది. ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పాత్రను అవమానించడం వల్ల కేరళ ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారని భావిస్తున్నారు.

అల్లు అర్జున్ ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నార్త్ తో దాదాపు అన్ని బాక్సాఫీస్ రికార్డులనూ ఈ సినిమా బద్దలు కొట్టేసింది. ఓవరాల్‌గా కూడా ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేసింది.
విడుదలై 40 రోజులకు పైగా దాటినా సరే.. హిందీలో ఈ సినిమా ఇప్పటికీ చెప్పుకోదగ్గ షేర్‌తో సాగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై బయ్యర్లు భారీ పెట్టుబడులు పెట్టగా.. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. అయితే కేరళలో మాత్రం ఈ సినిమా వర్కవుట్ కాలేదు.
మొదటి నుంచి అందరి దృష్టి పుష్ప 2 సినిమా మలయాళ కలెక్షన్స్ పైనే ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ కు మలయాళ భాషలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో 'పుష్ప 2' మూవీ అక్కడ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఖాయమని అంతా లెక్కలేసుకున్నారు.
దానికి తోడు అక్కడ జరిగిన 'పుష్ప 2' మూవీ ఈవెంట్ కి జనాలు భారీ సంఖ్యలో తరలి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఊహించని విధంగా ఈ సినిమా మలయాళ భాషలో దారుణమైన కలెక్షన్స్ ను చూస్తోంది.
దాంతో మరి అన్ని చోట్ల అదరగొడుతున్న 'పుష్ప 2' కేవలం కేరళలో మాత్రం ఎందుకు అంత దారుణంగా వెనుకబడింది? అనేది అల్లు అర్జున్ కు సైతం సస్పెన్స్ గా మారిపోయింది. వీకెండ్లో కూడా పెద్దగా పుంజుకోని 'పుష్ప-2' కేరళలో డిజాస్టర్‌గా తేలింది. పెట్టుబడిలో సగం కూడా వసూలు చేయలేదు.
అయితే ఇలా మళయాళంలో డిజాస్టర్ అవ్వటానికి కారణం సోషల్ మీడియాలతో ఒకటి వైరల్ అవుతోంది. అదేమిటంటే...ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన పాత్రను పుష్ప రాజ్ ఎంత దారుణంగా అవమానిస్తాడో ఇప్పటికే మూవీని చూసిన ప్రేక్షకులకి బాగా తెలుసు.
ఇలా తమ హీరోలను తక్కువ చేసి చూపిస్తే, మలయాళ ప్రేక్షకులు ఏమాత్రం సహించరు. అక్కడ ఉన్నది అల్లు అర్జున్ అయినా సరే పక్కన పెట్టేస్తామని ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ద్వారా ఖరాకండిగా చెప్పేశారు కేరళ ఆడియన్స్ అని అంటున్నారు.
మొత్తానికి 'పుష్ప 2' మూవీకి కేరళలో దారుణమైన రెస్పాన్స్ రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'పుష్ప-2' పరిస్థితి ఏమంత అద్బుతంగా అయితే లేదు. చాలా ఏరియాల్లో రికవరీ 60-70 శాతం మధ్యే ఉంది.
'పుష్ప-1' సైతం తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఆడలేదు. హిందీ వెర్షన్ అనూహ్యంగా పెద్ద హిట్టయిపోవడంతో ఓవరాల్‌గా ఇది సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకుంది. పుష్ప-2 విషయంలోనూ దాదాపు ఇదే జరుగుతోంది అని అంటోంది ట్రేడ్.
తమిళనాట 'పుష్ప-2' ఫస్ట్, సెకండ్ వీకెండ్స్‌లో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు అక్కడ కూడా సినిమా చల్లబడిపోయింది. కర్ణాటకలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'పుష్ప-2' పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. చాలా ఏరియాల్లో రికవరీ 60-70 శాతం మధ్యే ఉంది. 'పుష్ప-1' సైతం తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఆడలేదు. హిందీ వెర్షన్ అనూహ్యంగా పెద్ద హిట్టయిపోవడంతో ఓవరాల్‌గా ఇది సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకుంది. పుష్ప-2 విషయంలోనూ దాదాపు ఇదే జరుగుతోంది.
read more: `సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్, వచ్చే సంక్రాంతికి ఫిక్స్.. స్టోరీ స్టార్ట్ అయ్యేది అక్కడే?