- Home
- Entertainment
- `సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్, రిలీజ్ డేట్ ఫిక్స్.. స్టోరీ స్టార్ట్ అయ్యేది అక్కడే?
`సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్, రిలీజ్ డేట్ ఫిక్స్.. స్టోరీ స్టార్ట్ అయ్యేది అక్కడే?
వెంకటేష్, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోహీరోయిన్లుగా రూపొందిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ఈ సంక్రాంతికి వచ్చి పెద్ద హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్‌ని ప్రకటించారు అనిల్ రావిపూడి.

విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత బిగ్ బ్లాక్ బస్టర్‌ని అందుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు యావరేజ్‌గా ఆడుతున్నా, హిట్ అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. తన కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్లని సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు వంద, 150కోట్లు దాటి, రెండు వందల కోట్ల దిశగా వెళ్తుంది.
`సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ఐదు రోజుల్లోనే రూ.161కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. రూ.45కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటుకుని, లాభాల బాట పడుతుంది. ఈ మూవీతో అటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడికి భారీ లాభాలను తీసుకురాబోతుంది. ఈ మూవీ నిర్మాణంలో అనిల్ రావిపూడి కూడా భాగం అయినట్టు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందట. గతంలోనూ సీక్వెల్ ఉంటుందనే హింట్స్ ఇస్తూ వచ్చారు మేకర్స్. తాజాగా అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించారు. `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాకి సీక్వెల్ ఉంటుందన్నారు. `మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం` అనే టైటిల్‌ని కూడా చెప్పారు. వచ్చే సంక్రాంతికి ఈ సీక్వెల్‌ని తీసుకురాబోతున్నామని తెలిపారు అనిల్ రావిపూడి.
ఈ మూవీలో చివర్లో మీనాక్షి చౌదరీ.. వెంకీ, ఐశ్వర్యల ఇంటి ముందుకు అద్దెకు దిగుతుంది. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది మరింత ఫన్నీగా సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. సినిమా ఎక్కడెక్కడో తిరిగి రాజమండ్రిలో వచ్చి ఆగింది, అక్కడి నుంచి మరో కథని చేయనున్నట్టు తెలిపారు.
నిజానికి ఈ కథకి సీక్వెల్ చేయడానికి చాలా స్కోప్ ఉందని, మళ్లీ మరో మ్యాజిక్ చేయడానికి రెడీ అని వెల్లడించారు. మొత్తంగా `సంక్రాంతికి వస్తున్నాం` మూవీకి సీక్వెల్ ని తీయబోతున్నారు. మరి ఇప్పటి మ్యాజిక్ మళ్లీ వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే `ఎఫ్ 2` మూవీ విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన `ఎఫ్ 3` ఆడలేదు. మరి ఈ సీక్వెల్ వర్కౌట్ అవుతుందా? అనేది సస్పెన్స్.
వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరీ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన విషయం తెలిసిందే. ఫన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొంది ఆడియెన్స్ ని విశేషంగా అలరించింది. ఇందులో నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
also read: తన డ్రీమ్ రోల్ చెప్పి షాకిచ్చిన నరేష్.. పద్మ అవార్డు కోసం పోరాడతా అంటూ కామెంట్స్