#Salaar:‘సలార్’2 స్పీడుకి ఎన్టీఆర్ డెసిషన్ కారణం ? అందుకే సెటిల్మెంట్స్ ?
‘కేజీయఫ్’లో నరాచీ ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్ నీల్.. ‘సలార్’తో ఖాన్సార్ వరల్డ్‌ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ఇండస్ట్రీలో కొన్ని లెక్కలు ఎప్పటికప్పుడు మారిపోతూంటాయి. ఊహించనవి జరిగిపోతూంటాయి. అలా మొన్నటిదాకా సలార్ 2 చిత్రం లేటు అవుతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఫుల్ బిజీ. అలాగే ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్ తో సినిమా చేసి బయిటకు రావాలి. ఈ రెండు జరిగాకే సలార్ 2 వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు ప్లాన్ మొత్తం మారిపోయింది. సలార్ 2 షూటింగ్ కు రంగం సిద్దమవుతోంది. హఠాత్తుగా ఈ పరిణామానికి కారణం ఏమిటి అంటే ఎన్టీఆర్ తీసుకున్న డెసిషన్ అంటున్నారు. ఈ మేరకు రీసెంట్ గా మీటింగ్ జరిగింది అని తెలుస్తోంది. అదేమిటి
ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్’ (Salaar: Ceasefire). గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో దీని సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్టు లేటు అవుతుందనే అందరూ భావించారు. అందుకు కారణం ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు. కానీ ఎన్టీఆర్ తన డేట్స్ ఇప్పటికిప్పుడు ఇవ్వలేని పరిస్దితి. దీన్నే ప్రశాంత్ నీల్ ని కలిసి చెప్పారని వినికిడి.
ఎన్టీఆర్ ఇప్పుడు దేవరతో ఫుల్ గా ఆక్యుపై అయ్యిపోయి ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజికి వచ్చేసింది. అలాగే ఊహించని విధంగా తన బాలీవుడ్ ప్రాజెక్టు వార్ 2 ముందుకు వచ్చింది. ఆ సినిమాకు ఏప్రియల్ నుంచి డేట్స్ ఇచ్చారు. దాంతో ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన ప్రాజెక్టు ఖచ్చితంగా లేటు అవుతుంది. ఇదే విషయం ప్రశాంత్ నీల్ ని కలిసి ఎన్టీఆర్ వివరించినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం వీరిద్దిరి మధ్య మీటింగ్ జరిగింది. ప్రశాంత్ నీల్ హైదరాబాద్ వచ్చి వెళ్లారు.
ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ మరో సినిమా పట్టాలు ఎక్కించాలి. వేరే సినిమా హటాత్తుగా మొదలెట్టాలంటే ఆయన స్దాయి హీరోలు ఎవరూ వెంటనే దొరకరు. అందుకే సలార్ 2 ను పట్టాలు ఎక్కించాలని నిర్ణయించుకుని ఆ షూటింగ్ కు రంగం రెడీ చేసుకున్నారు. అలా లేటు అవుతుందనుకున్న సలార్ 2 ముందే మొదలైపోతోంది. ఎందుకంటే సలార్ 2 షూట్ కొంత ఆల్రెడీ జరిగింది. ప్రత్యేకంగా స్క్రిప్టు రెడీ చేయనక్కర్లేదు. మొత్తం రెడీ చేసి ఉంచారు. కాబట్టి ప్రశాంత్ నీల్ కు ఈజీ అవుతుంది. దాంతో సలార్ 2 ని ప్రభాస్ తో మాట్లాడి డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుంటూ చేద్దామని ఒప్పించినట్లు సమాచారం.
పార్ట్ 2ను ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రూపొందించనున్నారు. ఎన్నో ప్రశ్నలతో మొదటి భాగాన్ని ముగించిన ప్రశాంత్ నీల్.. రెండో పార్ట్‌లో వాటికి ఎలాంటి సమాధానాలు చెబుతారో అని ప్రేక్షకులు ఈ సీక్వెల్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సలార్ 2 మధ్య గ్యాప్ లో డేట్స్ ఇస్తారు. సలార్ ఆల్రెడీ మంచి హిట్ కాబట్టి అది సేఫ్ బెట్ గా భావిస్తారు. ఈలోగా ప్రశాంత్ నీల్ షూటింగ్ ప్రారంభించి మిగతా నటులు మీద సీన్స్ తీస్తారు. ప్రభాస్ డేట్స్ ని బట్టి కాంబినేషన్ ప్లాన్ చేసుకుంటారు.
ఇక సలార్ 2 ముందుకు వచ్చిందనే విషయాన్ని నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దీనిపై అప్‌డేట్ తో అఫీషియల్ గా బయిటకు వచ్చింది. ‘నేను ప్రభాస్ మంచి స్నేహితులం. ఎప్పుడూ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ టచ్‌లో ఉంటాం. సలార్ రెండో భాగం షూటింగ్ అతి త్వరలోనే ప్రారభం కానుంది’ అని చెప్పారు. ఇటీవల నటుడు బాబీసింహా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ పార్ట్2 కథ సిద్ధంగా ఉందని.. ఏప్రిల్‌లో చిత్రీకరణను ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది దీని విడుదలకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. దీంతో వచ్చే నెలలో సలార్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయమనేది కన్ఫర్మ్ అయ్యింది.
అంతేకాదు సలార్ 2 వచ్చే నెలలో ప్రారంభం కాబట్టే వెంటనే నష్టపోయిన ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్స్ ని పిలిచి నిర్మాత సెటిల్మెంట్ చేసారనే వాదన సైతం వినపడుతోంది. వాస్తవానికి సలార్ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుని మాగ్జిమం కలెక్షన్స్ రాబట్టింది. అయితే అన్ని చోట్లా కాదు. నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ కు ఈ సినిమా అదిరిపోయే లాభాలు తెచ్చిపెడితే ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టం తెచ్చిపెట్టింది. అందుకు కారణం ఎక్కువ రేట్లు పెట్టి ఈ సినిమాని తీసుకోవటమే.
దాంతో ఆంధ్రాలోని కొంతమంది ఇండిడ్యువల్ డిస్ట్రిబ్యూటర్స్ డబ్బు నష్టపోవటంతో వారికి కాంపన్షేషన్ గా పే చేసినట్లు తెలుస్తోంది. నిర్మాత ప్రతీది లెక్క వేసి ఎక్కడ ఏ ఏరియావారు ఎంత నష్టపోయారో తెలుసుకుని ఫైనాన్సియల్ లాస్ ని సెట్ చేసినట్లు వినిపిస్తోంది. ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ కూడా పర్శనల్ రిక్వెస్ట్ లు చేయలేదు. అయినా సరే నిర్మాత పర్శనల్ గా వారిని పిలిచి నష్టపోయిన సొమ్మును ఇవ్వటంతో ఆనందంగా ఉన్నారని తెలుస్తోంది.
మరో ప్రక్క ప్రభాస్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. 24 గంటలు వర్క్ చేస్తున్నారు.ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’లో నటిస్తున్నారు. దీని షూటింగ్ తుది భాగానికి చేరుకుంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం వేసవి కానుకగా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ (Raja Saab)లోనూ ప్రభాస్ నటిస్తోన్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోంది.
ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషించిన సలార్ సినిమా తొలి భాగం ‘సలార్- సీజ్ ఫైర్’తెలుగు భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ చూసి రెండో భాగం ‘శౌర్యాంగ పర్వం’ఎప్పుడూ అని అడుగుతున్నారు. అయితే ఇది ప్యాన్ ఇండియా సినిమా. కేవలం తెలుగు మార్కెట్ మాత్రమే కాదు ...హిందీ, కన్నడ, మళయాళ,తమిళ మార్కెట్ లలో కూడా అక్కడ భాషల్లోకి డబ్బింగ్ అయ్యి భారీగా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య సలార్ సినిమా గత డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్.
salaar
‘సలార్- సీజ్ ఫైర్’ మూవీకి రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంతో ప్రభాస్ మళ్లీ హిట్ బాటపట్టారు. సలార్‌లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు విపరీతంగా మెప్పించాయి. సలార్ చిత్రాన్ని హెంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ చేశారు.
Prabhas
‘కేజీయఫ్’లో నరాచీ ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్ నీల్.. ‘సలార్’తో ఖాన్సార్ వరల్డ్‌ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం. దేవ- వరదరాజ మన్నార్ శత్రువులుగా మారడానికి కారణమేంటి? అనేది రెండో పార్ట్ లో చూపించబోతున్నారు. దానికోసమే ఇప్పుడు ప్రభాస్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుున్నారు.