MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mahesh Babu: నమ్రత చంపి సమాధి చేస్తుంది.. మహేష్ బాబుతో పెళ్లి పై హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

Mahesh Babu: నమ్రత చంపి సమాధి చేస్తుంది.. మహేష్ బాబుతో పెళ్లి పై హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబును పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ.. నమ్రతను చూస్తే భయమేస్తోందని అంటోంది ఓ హీరోయిన్. తేడా వస్తే తనకు సమాధి కడుతుందని భయపడుతున్న తార ఎవరో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 01 2026, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
50 ఏళ్ళు వచ్చినా తగ్గని మహేష్ బాబు క్రేజ్
Image Credit : Asianet News

50 ఏళ్ళు వచ్చినా తగ్గని మహేష్ బాబు క్రేజ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును ఇష్టపడని వారు ఎవరుంటారు. ముఖ్యంగా మహేష్ లాంటి భర్త కావాలని చాలామంది లేడీస్ కోరుకుంటుంటారు. కొంత మంది ఈ విషయాన్ని భహిరంగంగానే వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. హీరోయిన్లలో కూడా ఎంతో మంది మహేష్ బాబు గ్లామర్ కు పడిపోయిన వారు ఉన్నారు. 50 ఏళ్లు వచ్చినా.. ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా కాపాడుకుంటున్నాడు మహేష్. 

ఇక బాలీవుడ్ హీరోయిన్లు కూడా మీకు టాలీవుడ్ లో ఎవరంటే ఇష్టం అంటే టక్కున మహేష్ బాబు పేరు చెపుతుంటారు. సూపర్ స్టార్ గ్లామర్ లోనే కాదు క్వాలిటీస్ లో కూడా నెంబర్ వన్ అని నిరూపించాడు. పక్కా ఫ్యామిలీ మెన్ కావడంతో.. ఆయనకు హస్పెండ్ మెటీరియల్ అన్న పేరు కూడా వచ్చింది. హీరోయిన్లు చాలామంది మీకు ఎటువంటి భర్త కావాలి అని అడిగితే.. మహేష్ బాబు లాంటి భర్త కావాలని చెప్పిన సదర్భాలు కూడా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నెంబర్ వన్ కపుల్ గా మహేష్ - నమ్రత
Image Credit : instagram / namrata shirodkar

నెంబర్ వన్ కపుల్ గా మహేష్ - నమ్రత

అయితే ఆ లక్కీ ఛాన్స్ సూపర్ స్టార్ తో ఒకే ఒక్క సినిమా చేసిన నమ్రత కొట్టేసింది. మహేష్ బాబును పెళ్లాడి హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఈ ఇద్దరు టాలీవుడ్ లోనే కాదు.. ఇండియాలోనే నెంబర్ వన్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక మహేష్ బాబును పెళ్లాడాలని చాలామంది హీరోయిన్లకు ఉంటుంది. ఒక టాలీవుడ్ హీరోయిన్ అయితే ఈ విషయాన్ని డైరెక్ట్ గానే ఒప్పుకుంది. కానీ నమ్రత విషయంలోనే తనకు భయమేస్తుందని ఆమె వెల్లడించింది. మహేష్ ను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన చేస్తేనే నమ్రత నాకు సమాధి కట్టేస్తుందంటూ భయపడుతోంది. ఇంతకీ ఆహీరోయిన్ ఎవరో కాదు ఛార్మీ కౌర్.

Related Articles

Related image1
Ram Charan: సురేఖ, అంజనమ్మ.. ఇద్దరిలో రామ్ చరణ్ ఎవరి వంట ఇష్టంగా తింటాడో తెలుసా? ఉపాసన వంట చేస్తుందా?
Related image2
Mahesh Babu: 3500 మంది ఆర్టిస్ట్ లతో రాజమౌళి భారీ ప్లాన్, మహేష్ బాబు కోసం జక్కన్న చేయబోతున్న అతిపెద్ద రికార్డు..
36
మహేష్ ను పెళ్లి చేసుకుంటావా అని ఆఫర్..
Image Credit : Asianet News

మహేష్ ను పెళ్లి చేసుకుంటావా అని ఆఫర్..

గతంలో జరిగిన ఓ ఈవెంట్ లో ఛార్మీకి ఈ ప్రశ్న ఎదురయ్యింది. మహేష్ బాబును సూపర్ స్టార్ చేయడంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ పాత్ర చాలా ఉంది. ఆయన చేసిన పోకిరి సినిమా వల్లే ఇండస్ట్రీ హిట్ కొట్టి మహేష్ బాబు మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ క్రమంలోనే బిజినెస్ మెన్ సినిమాతో మరోసారి మహేష్ ఇమేజ్ ను మరో మెట్టు ఎక్కించాడు పూరి.

46
నమ్రత ముందే అడిగేసిన పూరీ జగన్నాథ్
Image Credit : instagram

నమ్రత ముందే అడిగేసిన పూరీ జగన్నాథ్

ఈ సినిమాకు సబంధించిన ఈవెంట్ లో సూపర్ స్టార్ , ఆయన భార్య నమ్రత, డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మీ కౌర్ కూడా పాల్గొంది. అప్పుడే సరదాగా ఛార్మీని పూరి ఈ ప్రశ్న వేశాడు. ఇప్పటికిప్పుడు మహేష్ బాబును పెళ్లి చేసుకునే ఛాన్స్ వస్తే ఏం చేస్తావ్ .. ముంబయ్ లో చేసుకుంటావా, హైదరాబాద్ లో చేసుకుంటావా అని ఛార్మీని అడిగాడు.

56
నమ్రత చంపేస్తుందని వణికిపోయిన హీరోయిన్..
Image Credit : Social Media

నమ్రత చంపేస్తుందని వణికిపోయిన హీరోయిన్..

పూరీ జగన్నాథ్ అడిగి ప్రశ్నకు దిల్ ఖుష్ అయ్యింది ఛార్మీ. ఆమె మాట్లాడుతూ..'' మహేష్ బాబును పెళ్లి చేసుకోవాలని అని ఎవరికి ఉండదు. కానీ మహేష్ ను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన నాలో ఉందని తెలిస్తే చాలు.. నమ్రత నన్ను చంపి సమాధి కడుతుంది. అప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే.. నా సమాధిని నమ్రత హైదరాబాద్ లో కడుతుందా.. లేక ముంబయ్ లో కడుతుందా అని అడగాలి'' అని ఛార్మీ నవ్వుతు బదులిచ్చారు. ఛార్మీ కామెంట్స్ కు మహేష్, నమ్రతతో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

66
నిర్మాతగా రాణిస్తోన్న ఛార్మీ కౌర్..
Image Credit : our own

నిర్మాతగా రాణిస్తోన్న ఛార్మీ కౌర్..

హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తర్వాత నిర్మాతగా అవతారం ఎత్తింది ఛార్మీ కౌర్. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి.. సినిమాలు నిర్మిస్తోంది. వీరి కాంబోలో వచ్చిన లైగర్ లాంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. సినిమాలు ప్లాప్ అవుతున్నా.. ప్రయత్నం మాత్రం మానడం లేదు ఛార్మీ. ప్రస్తుతం పూరీతో కలిసి తమిళ హీరో విజయ్ సేతుపతితో ఓ మూవీ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Release Date: ఆడియెన్స్ కి టాక్సిక్‌ టీమ్‌ కండీషన్స్.. వీళ్లు సినిమా చూడకూడదు, వీడియో మైండ్ బ్లోయింగ్‌
Recommended image2
Deepika Padukone: స్టార్‌ హీరో కోసం పారితోషికం తీసుకోకుండా సినిమా చేసిన కల్కి హీరోయిన్‌.. కారణం ఇదే
Recommended image3
Surekha Konidela: చిరంజీవి భార్యకు తెలంగాణా ప్రభుత్వం బంపర్ ఆఫర్, బోర్డు మెంబర్ గా సురేఖ కొణిదెల
Related Stories
Recommended image1
Ram Charan: సురేఖ, అంజనమ్మ.. ఇద్దరిలో రామ్ చరణ్ ఎవరి వంట ఇష్టంగా తింటాడో తెలుసా? ఉపాసన వంట చేస్తుందా?
Recommended image2
Mahesh Babu: 3500 మంది ఆర్టిస్ట్ లతో రాజమౌళి భారీ ప్లాన్, మహేష్ బాబు కోసం జక్కన్న చేయబోతున్న అతిపెద్ద రికార్డు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved