MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jayasudha: తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం, చదవడం ఎందుకు రాలేదో తెలుసా?

Jayasudha: తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం, చదవడం ఎందుకు రాలేదో తెలుసా?

టాలీవుడ్ లో చాలామంది హీరోలు, హీరోయిన్లకు తెలుగు చదవడం, రాయడం రాదు. కానీ సీనియర్ నటి.. 60 ఏళ్లు దాటిన జయసుధకు కూడా తెలుగు రాయడం చదవడం రాదా? తమిళం మొత్తం వచ్చినప్పుడు ఒక తెలుగు నటికి.. తెలుగు రాకపోవడానికి కారణం ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 30 2026, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ లో తెలుగు రాని తారలు ఎందరో...
Image Credit : our own

టాలీవుడ్ లో తెలుగు రాని తారలు ఎందరో...

ఫిల్మ్ ఇండస్ట్రీలో మాతృభాష రాని హీరోలు, హీరోయిన్లు, నటీనటులు ఎందరో ఉన్నారు. ఈ విషయంలో టాలీవుడ్ కి మినహాయింపు ఏమీ లేదు. తెలుగులో స్టార్ డమ్ ఉన్న సగం హీరోలకు తెలుగు చదవడం, రాయడం రాదు. అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, నాగార్జున లాంటి చాలా మంది హీరోలకు తెలుగు చదవడం రాదు. 

స్క్రిప్ట్ కూడా ఇంగ్లీష్ లో రాసుకుంటారు. ఈ హీరోలంతా ఇంగ్లీష్ మీడియం చదవడం.. చెన్నైలో పుట్టి పెరగడం వల్ల చాలా మంది సినిమా తారలకు మాతృభాష చదవడం, రాయడం రాదు. కానీ టాలీవుడ్ లో సహజనటిగా పేరు తెచ్చున్న పాత తరం హీరోయిన్ జయసుధకు కూడా తెలుగు చదవడం రాయడం రాదు అని మీకు తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మూడు తరాలతో నటించిన తార..
Image Credit : google

మూడు తరాలతో నటించిన తార..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సహజనటి అన్న పేరు జయసుధకు మాత్రమే ఉంది. నేచురల్ యాక్టింగ్ తో అద్భుతమైన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ను అలరిస్తూ వస్తోంది ఈ నటి. జయసుధ మూడు తారాల హీరోలతో కలిసి నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, మోహన్ బాబు, మురళీ మోహన్ వరకూ హీరోలతో జంటగా నటించిన జయసుధ.. ఆతరువాత తరం హీరోలకు తల్లిగా, భామ్మగా కూడా నటించి మెప్పించింది. విచిత్రం ఏంటంటే వందల తెలుగు సినిమాలు చేసిన జయసుధకు తెలుగు చదవడం, రాయడం రాదు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించింది.

Related Articles

Related image1
NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు లేరు
Related image2
Mahesh Babu: 3500 మంది ఆర్టిస్ట్ లతో రాజమౌళి భారీ ప్లాన్, మహేష్ బాబు కోసం జక్కన్న చేయబోతున్న అతిపెద్ద రికార్డు..
35
తమిళం వచ్చు.. కానీ తెలుగు ఎందుకు రాదు?
Image Credit : our own

తమిళం వచ్చు.. కానీ తెలుగు ఎందుకు రాదు?

జయసుధ తెలుగు నటి, కృష్ణ సతీమణి విజయ నిర్మలకు చాలా దగ్గర బంధువు. ఆమె అవ్వడానినికి తెలుగు నటే అయినా.. చెన్నైలోనే ఉంటుంది... మద్రాస్ లోనే పుట్టి పెరిగింది. అక్కడే తమిళ , ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంది. దాంతో ఆమెకు తమిళం రాయడం, చదవడం వచ్చు. తెలుగు సినిమాలు చేసినా కూడా తెలుగు చదవడం ఆమెకు రాదు. డైలాగ్స్ విని వాటిని గుర్తు పెట్టుకుని యాక్ట్ చేయడం జయసుధకు మొదటి నుంచి అలవాటు.

45
తెలుగు అక్షరాలను జీలేబీలతో పోల్చిన నటి..
Image Credit : Instagram/Jayasudha

తెలుగు అక్షరాలను జీలేబీలతో పోల్చిన నటి..

తెలుగు రాయడానికి చాలా ప్రయత్నం చేసినట్టు జయసుధ వెల్లడించారు. ఎంత ప్రయత్నించినా రాయలేకపోయానని ఆమె అన్నారు. తెలుగు భాష చాలా సుందరమైనదని.. తమిళ కవి భరతీయార్ కూడా సుందర తెలుంగు అని మెచ్చుకున్నట్టు గుర్తు చేసుకున్నారు. నటుడు వివేక్ మాత్రం తెలుగు అక్షరాలు చూస్తుంటే జీలేబీలు గుర్తుకు వస్తాయని అంటుంటాడని, తనకు కూడా తెలుగు అక్షరాలు జీలేబీల మాదిరి అనిపిస్తాయని ఆమె అన్నారు. తమిళంలో 18 అక్షరాలే ఉండటం వల్ల త్వరగా నేర్చుకోగలిగానని జయసుధ అన్నారు.

55
చెన్నైలోనే ఉండిపోయిన తెలుగు తారలు...
Image Credit : our own

చెన్నైలోనే ఉండిపోయిన తెలుగు తారలు...

ఒకప్పుడు సౌత్ సినిమా అంతా చెన్నైగా చెప్పబడుతున్న మద్రాసులో ఉండేది. ఆ కాలం నటులంతా అక్కడి నుంచే తమ భాషా సినిమాల్లో నటించేవారు. కాలక్రమంలో తెలుగు రాష్ట్రం విడిపోవడం.. తెలుగుఇండస్ట్రీ హైదరాబాద్ కు , కన్నడ పరిశ్రమ బెంగళూర్ కు చేరింది. అయితే సరే చాలామంది ఆతరం నటీనటులు చెన్నైలోనే అలవాటు పడటంతో అక్కడే ఉండిపోయారు. జయసుధ, జయప్రద, ఎస్పీబీ, డబ్బింగ్ జానకి, సింగీతం శ్రీనివాసరావు, షావుకారు జానకి, ఇలా ఎంతో మంది ఆ తరం వారు అక్కడే ఉండిపోయారు. కొంతమంది మాత్రం హైదరాబాద్ కు షిప్ట్ అయ్యారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu: 3500 మంది ఆర్టిస్ట్ లతో రాజమౌళి భారీ ప్లాన్, మహేష్ బాబు కోసం జక్కన్న చేయబోతున్న అతిపెద్ద రికార్డు..
Recommended image2
Chiranjeevi: చిరు, మాధవి రొమాన్స్ కోసమే 'రగులుతోంది మొగలి పొద' సాంగ్ పెట్టారా ? దెబ్బకు తలరాత మారిపోయింది
Recommended image3
NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు లేరు
Related Stories
Recommended image1
NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు లేరు
Recommended image2
Mahesh Babu: 3500 మంది ఆర్టిస్ట్ లతో రాజమౌళి భారీ ప్లాన్, మహేష్ బాబు కోసం జక్కన్న చేయబోతున్న అతిపెద్ద రికార్డు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved