MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు లేరు

NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు లేరు

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఇష్టపడని వారు ఉండరు. ఆయన్ను ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వరసలు పెట్టి పిలుస్తుంటారు. మరి తారక్ ను నాన్నా అని ముద్దుగా పిలిచే ముగ్గరు హీరోల గురించి మీకు తెలుసా? ఇంతకీ ఎవరువాళ్లు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 30 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎన్టీఆర్ ను వరసలు పెట్టి పిలిచే హీరోలు..
Image Credit : our own

ఎన్టీఆర్ ను వరసలు పెట్టి పిలిచే హీరోలు..

ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరితో మంచి అనుబంధం కలిగి ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన్ను ఇష్టపడనివారు ఉండరు. చిన్న పెద్దా తేడా లేకుండా అందరిని కలుపుకుని వెళ్లడం తారక్ కు బాగా అలవాటు. ఇక టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఎన్టీఆర్ ను వరసలు పెట్టి పిలుస్తుంటారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ బావా బావా అని పిలుచుకుంటారు.. మహేష్ బాబుని అన్నా అని పిలుస్తాడు ఎన్టీఆర్. రామ్ చరణ్ ను బ్రదర్ అని పిలుస్తాడు.. ఇక ఎన్టీఆర్ ను కూడా చాలా ప్రేమగా నాన్నా అని పిలిచే ముగ్గరు హీరోలు ఎవరో తెలుసా? అందులో ఇద్దరు హీరోలు ప్రస్తుతం ఈ లోకంలో లేరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రామ లక్ష్మణుల్లా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్.
Image Credit : our own

రామ లక్ష్మణుల్లా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్.

నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగాడు కానీ కళ్యాణ్ రామ్ హీరోగా స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయాడు. దాంతో నిర్మాతగా, హీరోగా రాణిస్తున్నాడు. పలు వ్యాపారాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ను ఎప్పుడు నాన్నా అనే పిలుస్తుంటాడు. ఇద్దరు తల్లులు వేరైనా.. సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ అనుబంధంతో కలిసి మెలిసి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా.. ఎక్కువగా ఇద్దరు కలిసే వెళ్తుంటారు. ఎన్టీఆర్ చాలా సినిమాలను కళ్యాణ్ రామ్ నిర్మించారు.

34
తారక్ ను నాన్నా అని పిలిచిన మొదటి వ్యక్తి..
Image Credit : our own

తారక్ ను నాన్నా అని పిలిచిన మొదటి వ్యక్తి..

నిజానికి ఎన్టీఆర్ ను నాన్నా అని పిలిచిన మొదటి వ్యక్తి ఆయన తండ్రి హరికృష్ణ. ఎన్టీఆర్ కు తండ్రి అంటే చాలా ఇష్టం ఆయన్ను చాలా ప్రేమించేవాడు. ఎప్పుడు తండ్రి గురించి చాలా గొప్పగా చెపుతుంటాడు. హరికృష్ణ కూడా జూనియర్ ను ఎప్పుడూ నాన్నా నాన్నా అనే పిలిచేవారు. ఎప్పుడు పేరు పెట్టి పిలిచేవారు కాదు. ఏదైనా ఈవెంట్లలో అయినా.. బహిరంగ ప్రదేశాల్లో కూడా నాన్నా అనే పిలిచేవారు హరికృష్ణ. 8 ఏళ్ల క్రితం ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ కు ఆయన అన్న కళ్యాణ్ రామ్ పెద్ద దిక్కుగా ఉన్నారు. అందుకే తండ్రిలాగా కళ్యాణ్ రామ్ కూడా తారక్ ను నాన్నా అని పిలుస్తుంటారు.

44
ఎన్టీఆర్ కు పొగరు ఎక్కువ అనుకున్న హీరో..
Image Credit : Asianet News

ఎన్టీఆర్ కు పొగరు ఎక్కువ అనుకున్న హీరో..

ఇక ఎన్టీఆర్ ను నాన్నా అని పిలిచే మూడో వ్యక్తి ఎవరో కాదు రియల్ స్టార్ శ్రీహరి. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఒక్క సినిమా మాత్రమే చేశారు. కానీ ఆ సినిమాతో వారి అనుబంధం చాలా బలంగా పాతుకుపోయింది. ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవారు. సొంత మనుషుల్లా కలిసిపోయారు. శ్రీహరి బృందావనం సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించాడు. 

సినిమా ఈవెంట్ లో శ్రీహరి మాట్లాడుతూ.. ''ఎన్టీఆర్ తో నటించాలి అని చెప్పినప్పుడు పెద్దింటి బిడ్డ కదా.. పొగరు ఉంటుందేమో అని అనుకున్నాను.. కానీ సెట్లో కలిశాక ఎంత మంచివాడో అర్ధం అయ్యింది. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నాన్నా అనే పిలుస్తా'' అని అన్నారు. శ్రీహరి కూడా ఇప్పుడు ఈ లోకంలో లేరు. అనారోగ్య కారణాల వల్ల ఆయన 49 ఏళ్ళ చిన్న వయసులోనే కన్ను మూశారు. ఇలా ముగ్గురు హీరోలు ఎన్టీఆర్ ను నాన్నా అని పిలుస్తుంటారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Lekshmi: ఆ చెత్త పనుల వల్లే ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై చెప్పా.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Gangster Stories: గ్యాంగ్‌స్టర్ కథలకు అడ్డా.. ఆ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తే హిట్టే!
Recommended image3
Posani: ఇండస్ట్రీ హిట్ విషయంలో త్రివిక్రమ్ ని తిట్టేసిన పోసాని.. 4 రోజుల పాత్రతో క్రెడిట్ మొత్తం అతడికే
Related Stories
Recommended image1
Chiranjeevi: లేడీ గెటప్ లో చిరంజీవి, మీసం లేకుండా చూసి సురేఖ ఏమని వార్నింగ్ ఇచ్చిందంటే?
Recommended image2
Bangkok Pilla: యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా? షాక్ అవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved