MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • నాగబాబు వల్ల చిరంజీవి కి చీవాట్లు పెట్టిన తల్లి అంజనా దేవి.. కారణం ఏంటంటే?

నాగబాబు వల్ల చిరంజీవి కి చీవాట్లు పెట్టిన తల్లి అంజనా దేవి.. కారణం ఏంటంటే?

మెగాస్టార్ చిరంజీవికి తమ్ముళ్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగబాబు, పవన్ ను మెగాస్టార్ ప్రేమగా చూసుకుంటారు. ఓ సారి నాగ బాబు వల్ల మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవితో చివాట్లు తిన్నారట దానికి కారణం ఏంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 08 2026, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి
Image Credit : Asianet News

స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి

చిరంజీవి స్వయంకృషితో టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా ఎదిగారు. దశాబ్దాల పాటు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా కొనసాగిన ఆయన, తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలలో ఒకరిగా చిరు గుర్తింపు పొందారు. 1990లలోనే కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారని, అప్పట్లో అమితాబ్ కంటే ఎక్కువ పారితోషికం అందుకున్న హీరోగా మెగాస్టార్ నిలిచారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి మార్గంలో మెగా ఫ్యామిలీ హీరోలు
Image Credit : facebook.com/MEGASTARCHIRANJEEVI

చిరంజీవి మార్గంలో మెగా ఫ్యామిలీ హీరోలు

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారు.. ఆయన వేసిన మార్గంలో మెగా ఫ్యామిలీ హీరోలు ముందుకు సాగారు. ముఖ్యంగా తన తమ్ముళ్లైన నాగబాబు, పవన్ కళ్యాణ్‌లను చిరంజీవి కన్నబిడ్డల మాదిరిగా చూసుకున్నారు. ఇప్పటికీ వారిపై అదే ప్రేమను చిరు చూపిస్తారు. చిరంజీవి స్టార్ గా మారిన తరువాత నాగబాబును హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేశారు. కానీ వర్కౌట్ అవ్వలేదు.. ఇక ఆ తరువాత ఆయన్ను నిర్మాతగా సెటిల్ చేయాలి అనుకున్నారు. కానీ నాగబాబు, చిరంజీవి హీరోగా నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి.

Related Articles

Related image1
రామ్ చరణ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన బాలకృష్ణ, కవల పిల్లలు పుట్టినందుకు ఏం ఇచ్చాడంటే?
Related image2
చిరంజీవి ని తిట్టినందుకు 13 కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, ఎవరిని కొట్టాడో తెలుసా?
35
ఇండస్ట్రీలో నిలబడలేకపోయిన నాగబాబు..
Image Credit : Asianet News

ఇండస్ట్రీలో నిలబడలేకపోయిన నాగబాబు..

రామ్ చరణ్ హీరోగా నాగబాబు నిర్మించిన ‘ఆరెంజ్’ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత విడుదలైన ఈ చిత్రం కనీస వసూళ్లు కూడా రాబట్టలేదు. దాంతో నాగబాబు పూర్తిగా మునిగిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి.ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ఎదిగి, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. భారీ ఫ్యాన్ బేస్‌తో పవన్ కళ్యాణ్ సినిమాలు ఓపెనింగ్స్‌లో రికార్డులు నెలకొల్పాయి. నాగబాబు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు.

45
నాగబాబు వల్ల చివాట్లు తిన్న చిరంజీవి
Image Credit : facebook.com/MEGASTARCHIRANJEEVI

నాగబాబు వల్ల చివాట్లు తిన్న చిరంజీవి

ఈ నేపధ్యంలో, చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర సంఘటనను వివరించారు. తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఇంటి పనులకు తల్లికి సహాయం చేసేవాడినని, ఒక రోజు లాండ్రీ నుంచి బట్టలు తెచ్చే బాధ్యత నాగబాబుకు అప్పగించానని చెప్పారు. అయితే నాగబాబు నిద్రపోయి బట్టలు తేలేదని చెప్పడంతో, కోపంతో తాను నాగబాబును కొట్టేశానని చిరంజీవి వెల్లడించారు. ఈ ఘటనపై తల్లి అంజనా దేవి చిరంజీవిని గట్టిగా మందలించారట, తమ్ముడిని కొడతావా అని చివాట్లు పెట్టారట. సాయంత్రం తండ్రి వచ్చాక విషయం చెప్పగా, తండ్రి నాగబాబును మందలించారని చిరంజీవి గతంలో గుర్తు చేసుకున్నారు.

55
సక్సెస్ జోష్‌లో మెగాస్టార్..
Image Credit : ChiranjeeviKonidela/Instagram

సక్సెస్ జోష్‌లో మెగాస్టార్..

ప్రస్తుతం చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్నారు. ఈ ఏడాది ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొదట సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆలస్యమై, 2026 సమ్మర్‌లో విడుదల కానుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image3
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Related Stories
Recommended image1
రామ్ చరణ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన బాలకృష్ణ, కవల పిల్లలు పుట్టినందుకు ఏం ఇచ్చాడంటే?
Recommended image2
చిరంజీవి ని తిట్టినందుకు 13 కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, ఎవరిని కొట్టాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved