- Home
- Entertainment
- Balakrishna Shelved Movie: బాలకృష్ణ చేయాల్సిన `విక్రమసింహ` మూవీ ఎందుకు ఆగిపోయింది? ఇంతటి విషాదం ఉందా?
Balakrishna Shelved Movie: బాలకృష్ణ చేయాల్సిన `విక్రమసింహ` మూవీ ఎందుకు ఆగిపోయింది? ఇంతటి విషాదం ఉందా?
Balakrishna Vikramasimha Shelved: బాలకృష్ణ చాలా హిట్ సినిమాలను వదిలేసుకున్నారు. కానీ ఆయన చేయాల్సిన `బాహుబలి` రేంజ్ మూవీ `విక్రమసింహ భూపతి` ఎందుకు ఆగిపోయింది.

Balakrishna Shelved Movie: హీరోలు ఒకరు చేయాల్సిన సినిమాని మరో హీరో చేస్తుంటారు. దర్శకులు స్క్రిప్ట్ లు పట్టుకుని హీరోల చుట్టూ తిరుగుతుంటాయి. ఓ హీరో ఓకే చేసి, ఇక మూవీ స్టార్ట్ చేయాలనుకున్న సమయానికి అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి.
మరో హీరో వద్దకు వెళ్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఆగిపోయిన సందర్బాలు కూడా ఉన్నాయి. బాలకృష్ణ చేయాల్సిన ఓ సంచలన మూవీ కూడా ఆగిపోయింది. ఆ సినిమా చేసి ఉంటే, అది హిట్ అయితే మరో `బాహుబలి` రేంజ్ సినిమా అయ్యేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
బాలయ్య నటించాల్సిన సినిమాల్లో చాలా ఆగిపోయాయి. చాలా చేతులు మారాయి. కానీ `విక్రమసింహ భూపతి` పేరుతో ఆయన ఓ సినిమాని ప్రకటించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్ గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అయ్యారు. త్రిపురనేని మహారథి రచయితగా పనిచేశారు. ఇళయరాజా సంగీతం, కబీర్ లాల్ కెమెరా మెన్. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రారంభించారు. కొన్నాళ్లపాటు చిత్రీకరణ కూడా జరిపారు.
ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంది. విక్రమ సింహ భూపతిగా, ప్రతాప వర్మగా నటించారు. తండ్రి కొడుకులుగా కనిపిస్తారు. తండ్రి రాజు. ఆయనపై కొందరు కుట్ర చేసి చంపేస్తారు. జనం మధ్యలో రాజ్యానికి దూరంగా పెరిగిన కొడుకు తండ్రి మరణానికి కారకులను కనిపెట్టి రాజ్యాన్ని తన వశం చేసుకోవడం కథ.
ఇందులో బాలయ్యకి జోడీగా రోజా, అంజలా ఝవేరీ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. 2001లో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖపట్నం, అరకు, గోల్కొండ ఫోర్ట్ లో షూటింగ్ జరిపారు. రెండు పాటలతో సహా సగం మూవీని షూట్ చేశారట.
మధ్యలో ఓ సిద్ధాంతి ఈ మూవీ చేస్తే నువ్వు ఇబ్బందుల్లో పడతావు అని నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డికి చెప్పారు. ఆయన అనుమానంతో కొన్నాళ్లు సినిమాని ఆపేశారు. దీంతో బాలయ్య అదే సమయంలో `సీమసింహం`సినిమా చేశారు. అనుకున్నట్టుగానే నిర్మాత గోపాల్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. కోడి రామకృష్ణ `అంజి` అంటూ ఇతర సినిమాలు చేశారు.
అనారోగ్యం నుంచి కోలుకోని గోపాల్ రెడ్డి కన్నుమూశారు. దీంతో ఈ మూవీ ఆగిపోయింది. అదే ఈ మూవీని తెరకెక్కించి ఉంటే అప్పట్లోనే ఇది సంచలనాత్మక మూవీ అయ్యేది. అయితే ఈ కథ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే ఉంది. కానీ `బాహుబలి`ని పోలి ఉండటమే పెద్ద మైనస్.
బాలకృష్ణ ఇటీవల `డాకు మహారాజ్` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఇక ఇప్పుడు `అఖండ 2`లో నటిస్తున్నారు బాలయ్య. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రంరూపొందుతుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఇటీవలే బాలయ్యకి ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ పురస్కారం వరించిన విషయం తెలిసిందే.