- Home
- Entertainment
- Top 25 Pan-Indian Superstars List: మహేష్ కి దారుణమైన రేటింగ్, బన్నీ, ప్రభాస్, తారక్, చరణ్‌లు ఎక్కడంటే?
Top 25 Pan-Indian Superstars List: మహేష్ కి దారుణమైన రేటింగ్, బన్నీ, ప్రభాస్, తారక్, చరణ్‌లు ఎక్కడంటే?
IMDB Top 25 Pan-Indian Superstars List: మోస్ట్ పాపులర్ పాన్ ఇండియా సూపర్ స్టార్స్ జాబితాని ఐఎండీబీ విడుదల చేయగా, ఇందులో మహేష్‌కి అవమానం జరిగింది. బన్నీ దుమ్ములేపారు.

Tolllywood top 10 heroes
Allu Arjun top in IMDB Pan-Indian Superstars List: కొన్ని పాపులర్ మేగజీన్, పలు మీడియా సంస్థలు సెలబ్రిటీలకు సంబంధించిన రేటింగ్ ఇస్తూ ఉంటారు. ఎవరు టాప్ లో ఉన్నారు? ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది? ఎవరిని ఇండియన్ ఆడియెన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారనేది రేటింగ్ రూపంలో వెల్లడిస్తుంటారు.
తాజాగా ప్రముఖ సంస్థ ఐఎండీబీ తాజాగా పాన్ ఇండియా హీరోలకు సంబంధించిన రేటింగ్ ఇచ్చింది. `టాప్ 25 పాన్ ఇండియన్ సూపర్‌స్టార్స్` పేరుతో ఈ లిస్ట్ ని విడుదల చేసింది. ఇందులో ఎవరి స్థానం ఎక్కడ అనేది చూస్తే.
ప్రస్తుతం రాజమౌళితో ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్న మహేష్ బాబుకి దారుణమైన రేటింగ్ దక్కింది. ఆయన టాప్ 25లో చివరి స్థానంలో నిలవడం గమనార్హం. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు లేకపోవడమే కారణమని చెప్పొచ్చు. ఇందులో ఈ మధ్య కాలంలో సినిమాలు చేసి, వార్తల్లో నిలిచిన వారికి టాప్ రేటింగ్ దక్కింది.
pushpa 2 reloaded release date extended allu arjun sukumar fahadh faasil
ఐఎండీబీ టాప్ 25 పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. ఆయన `పుష్ప 2`తో ఇండియన్ సినిమాని రూల్ చేసిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.
గత రెండు నెలలుగా చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు వివాదాలతో అల్లు అర్జున్ ఇండియా వైడ్‌గా హాట్ టాపిక్ అవుతున్నారు. ఎక్కువగా ఆయన గురించిన చర్చనే జరుగుతుంది. దీంతో మొదటి స్థానంలో నిలిచారు.
పాన్ ఇండియా స్థార్‌గా రాణిస్తున్న మన డార్లింగ్ ప్రభాస్ వెనకబడిపోయాడు. ఇంతకు ముందు టాప్ 1లో ఉన్న ఆయన ఇప్పుడు టాప్ 7కి పడిపోయారు. అలాగే ఆ తర్వాత స్థానంలో రామ్ చరణ్ ఉన్నాడు. `దేవర`తో ఆకట్టుకున్న ఎన్టీఆర్‌కి కూడా చివరి స్థానమే దక్కింది. ఆయన టాప్ 23లో ఉండటం ఆశ్చర్యపరుస్తుంది.
ఇక టాప్ 2లో షారూఖ్ ఖాన్, 3లో యష్, 4లో రణ్ బీర్ కపూర్, 5లో దేవ్, 6లో జీత్, 7-ప్రభాస్, 8-రామ్ చరణ్, 9-కార్తిక్ ఆర్యన్, 10-విజయ్, 11-హృతిక్ రోషన్, 12-రజనీకాంత్, 13-మిథున్ చక్రవర్తి, 14-సల్మాన్ ఖాన్, 15-ఆమీర్ ఖాన్, 16-ధనుష్, 17-విజయ్ సేతుపతి, 18-అజయ్ దేవగన్`, 19-ఫాహద్ ఫాజిల్, 20-దుల్కర్ సల్మాన్, 21-యష్ దాస్ గుప్తే, 22-జిష్సు సేన్ గుప్తా, 23-ఎన్టీఆర్, 24-కమల్ హాసన్, 25-మహేష్ బాబు. ఈ రేటింగ్‌లో ఐదుగురు తెలుగు హీరోలు, ఐదుగురు తమిళ హీరోలు, ఒక్క కన్నడ స్టార్, ఇద్దరు మలయాళ హీరోలు ఉండగా, మిగిలిన వారంతా బాలీవుడ్ స్టార్స్ కావడం గమనార్హం.
also read: NTR-Prashanth Neel movie: ఎన్టీఆర్-నీల్ మూవీ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు డిటేయిల్స్, మొత్తం వాళ్లే?
.