- Home
- Entertainment
- మెగాస్టార్ స్థానం కోసం పోటీపడ్డ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా? బాలయ్య, వెంకీ, నాగ్ అసలే కాదు.. అదే వాళ్ల మైనస్
మెగాస్టార్ స్థానం కోసం పోటీపడ్డ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా? బాలయ్య, వెంకీ, నాగ్ అసలే కాదు.. అదే వాళ్ల మైనస్
చిరంజీవి ఇప్పుడు తిరుగులేని మెగాస్టార్‌గా ఎదిగారు. గత మూడు దశాబ్దాలుగా ఆ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. అయితే మెగాస్టార్ ఇమేజ్ కోసం ఇతర ఇద్దరు హీరోలు పోటీ పడ్డారు. వాళ్లెవరో చూద్దాం.

చిరంజీవి మెగాస్టార్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. గత మూడు దశాబ్దాలుగా అదే ఇమేజ్‌తో రాణిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ స్థానం కోసం చాలా పోటీ నెలకొంది. అప్పట్లో చిరంజీవికి పోటీ ఇచ్చిన వారిలో బాలయ్య, వెంకటేష్, నాగార్జున కూడా ఉన్నారు. వీరితోపాటు గట్టి పోటీ ఇచ్చిన వారిలో సుమన్, రాజశేఖర్‌లు కూడా ఉండటం విశేషం.
టాలీవుడ్‌లో ఆ నలుగురు హీరోలుగా చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌లను పిలుస్తారు. వీళ్లే టాప్ హీరోలు. మిగిలిన వాళ్లని ఆ తర్వాత రేంజ్ హీరోలుగా పిలిచేవాళ్లు. మోహన్ బాబు, రాజశేఖర్, సుమన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ వంటి వారిని టైర్ 2 కేటగిరిగా భావిస్తుంటారు.
suman, rajasekhar
కానీ ఓ దశలో చిరంజీవికి పోటీ ఇచ్చిన వారిలో బాలయ్య, వెంకీ, నాగ్ అసలే లేరు. కానీ సుమన్, రాజశేఖర్‌లు ఉన్నారు. చిరంజీవికి దీటుగా వీళ్లు యాక్షన్ సినిమాలు చేసి మెప్పించారు. బాలయ్య, వెంకీ, నాగార్జు వంటి వారు ఫ్యామిలీ, లవ్ స్టోరీలు చేసుకుంటూ వచ్చారు. కానీ వాటితోపాటు యాక్షన్ సినిమాలతో దుమ్మురేపింది ఈ ఇద్దరు హీరోలే. 1980-90 టైమ్‌లో ఓ దశలో చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చారు.
chiranjeevi
కానీ చిరంజీవికి, వాళ్లకి ఉన్న తేడా ఏంటి? వాళ్లు మెగాస్టార్ ఎందుకు కాలేకపోయారనేది చూస్తే. చిరంజీవి అసెట్ డాన్స్, సొంత డబ్బింగ్. అప్పట్లో చిరంజీవి డాన్స్ లకు విపరీతమైన క్రేజ్ ఉండేది. థియేటర్లలో పాటలను రెండు మూడు సార్లు రిపీట్‌గా వేయించుకుని ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేవాళ్లు. ఇక సొంత డబ్బింగ్ తో ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌లకు కూడా ఫ్యాన్స్ ఊగిపోయేవాళ్లు. దీనికితోడు ఆయన వ్యక్తిత్వం, మంచితనం కూడా పనిచేశాయి.
క్వాలిటీస్ విషయంలో సుమన్, రాజశేఖర్‌లు.. చిరంజీవిలా గ్రేస్‌ఫుల్‌గా డాన్స్ లు చేయలేరు. డాన్సులు మ్యానేజ్ చేశారు తప్పితే, ఫ్యాన్స్ ఊగిపోయేలా ఉండేవి కావు. సొంత డబ్బింగ్ చెప్పలేకపోవడం మరో మైనస్. ఈ ఇద్దరు హీరోలు సాయికుమార్ మీదనే ఆధారపడేవాళ్లు. సాయికుమార్ వాయిసే వీరికి బిగ్ అసెట్. వీటికితోడు వీరిచుట్టూ కొన్ని వివాదాలు వెంటాడాయి. సుమన్ ని బ్లూ ఫిల్మ్ కేసు దెబ్బ కొట్టింది. పీక్‌లో ఉండగా అది ఆయన్ని కుంగదీసింది. ఓ రకంగా ఆయన కెరీరే స్మాష్ అయ్యేలా చేసింది.
rajasekhar (photo credit-etv)
మరోవైపు రాజశేఖర్.. ఆవేశపరుడు అనేది ఉండేది. అందరిని మ్యానేజ్ చేయడం ఆయన వల్ల కాదు. ఇక డాన్సులు కూడా రాజశేఖర్ మైనస్. ఏదో మ్యానేజ్ చేయడం తప్ప బాగా చేయలేడు. అదే ఆయకు పెద్ద మైనస్‌గా మారింది. కానీ తనదైన యాక్షన్ సినిమాలతో చిరంజీవికి కొంత కాలం గట్టి పోటీ ఇచ్చాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కానీ కంటిన్యూగా తన క్రేజ్, ఇమేజ్‌ని కొనసాగించాడు చిరు. డాన్సులతో అదరగొట్టాడు. యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్లు, కామెడీతో మెప్పించాడు. తిరుగులేని మెగాస్టార్‌గా ఎదిగారు. ఇప్పటికీ అదే స్థానంలో కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు సుమన్, రాజశేఖర్ ఫేడౌట్ అయిపోయారు.
సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నాడు. రాజశేఖర్ త్వరలో టర్న్ తీసుకోబోతున్నారు. కానీ చిరంజీవి మాత్రం హీరోగా దూసుకుపోతున్నాడు. పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ రాణిస్తున్నారు. ఇప్పటి తరానికి పోటీ ఇస్తున్నారు.
also read: రాజశేఖర్, సుమన్ మధ్య చిచ్చు పెట్టిన యాక్షన్ హీరో, స్ట్రాంగ్ వార్నింగ్.. చివరికి ఇద్దరికీ ఝలక్