- Home
- Entertainment
- Jailer 2 Collection Day 1: జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ, ఫస్ట్ డే సెంచరీ కొట్టిన రజనీకాంత్, రికార్డుల వేట.. 1000 కోట్లు పక్కా..
Jailer 2 Collection Day 1: జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ, ఫస్ట్ డే సెంచరీ కొట్టిన రజనీకాంత్, రికార్డుల వేట.. 1000 కోట్లు పక్కా..
Jailer 2 Collection Day 1: బాక్సాఫీస్ పై దండయాత్రం మొదలు పెట్టింది జైలర్ 2 మూవీ. రిలీజ్ అయిన ఫస్ట్ డే రికార్డుల వేట స్టార్ట్ చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన యాక్షన్ మూవీ తొలిరోజు ఎంత వసూలు చేసిందో తెలుసా?

బాక్సాఫీస్ సంచలనంగా జైలర్ 2
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన భారీ యాక్షన్ డ్రామా చిత్రం 'జైలర్ 2' బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 15, గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. తొలిరోజే ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 59.70 కోట్ల నికర (Net) వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.
శాక్నిల్క్ (Sacnilk) గణాంకాల ప్రకారం, ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా నాలుగు భాషలలో కలసి మొత్తం 16,599 షోల ద్వారా భారతదేశంలో రూ. 70.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాగే విదేశీ మార్కెట్లలో (Overseas) రూ. 55 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో 'జైలర్ 2' ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ. 125.25 కోట్ల గ్రాస్ వసూళ్లతో అదరగొట్టింది.
అంతేకాకుండా, భారతదేశంలో తొలిరోజే రూ. 50 కోట్ల నెట్ మార్కును సునాయాసంగా దాటేసింది. ఇదే ఊపు కొనసాగితే.. ఫైనల్ రన్ లో జైలర్ 2 1000 కోట్లు కలెక్షన్స్ దాటటం పెద్ద విషయం కాదు అంటున్నారు విశ్లేషకులు. అంతే కాదు ఈ సినిమా 1000 కోట్ల మర్క్ దాటితే.. తమిళంలో ఈ ఘనత సాధించిన ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది.
భాషల వారీగా వసూళ్ల వివరాలు
గురువారం నాడు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం రూ. 59.70 కోట్ల నికర వసూళ్లలో తమిళ వెర్షన్ అత్యధిక వాటాను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు, హిందీ, కన్నడ భాషలు నిలిచాయి.
తమిళం: 9,326 షోల ద్వారా రూ. 43.35 కోట్ల నెట్ వసూలు చేయగా, 70.8% ఆక్యుపెన్సీ నమోదైంది.
తెలుగు: 2,792 షోల ద్వారా రూ. 12.50 కోట్ల నెట్ సాధించగా, 56.2% ఆక్యుపెన్సీ నమోదైంది.
హిందీ: 4,371 షోల ద్వారా రూ. 3.50 కోట్ల నెట్ సాధించగా, 22% ఆక్యుపెన్సీ లభించింది.
కన్నడ: 110 షోల ద్వారా రూ. 35 లక్షల నెట్ సాధించి, 54% ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
ఆక్యుపెన్సీ వివరాలు...
శాక్నిల్క్ నివేదిక ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు 55.4% సగటు ఆక్యుపెన్సీని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా తొలిరోజు థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య (Footfalls) 3,746,734గా నమోదైంది.తమిళ వెర్షన్లో ఉదయం షోలకు 71.77%, మధ్యాహ్నం షోలకు 65.31%, సాయంత్రం షోలకు 75.08% మరియు నైట్ షోలకు గరిష్టంగా 89.62% ఆక్యుపెన్సీ లభించింది. తెలుగు 2D వెర్షన్లో ఉదయం 44.09%, మధ్యాహ్నం 49%, సాయంత్రం 59% మరియు నైట్ షోలలో 77.55% ఆక్యుపెన్సీ నమోదైంది. విశేషమేమిటంటే, 'జైలర్ 2' తెలుగు హెచ్‌డిఆర్ (HDR by Bar) వెర్షన్ ఏకంగా 84.25% సగటు ఆక్యుపెన్సీని సాధించింది. ఇందులో నైట్ షోలకు ఏకంగా 97% ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం.
జైలర్ 2 లో ఎవరెవరు నటించారంటే?
'జైలర్ 2' చిత్రంలో రజినీకాంత్ రిటైర్డ్ జైలర్ టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా నటించారు. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా జీవిస్తున్న ఆయన జీవితంలోకి క్రిమినల్ అండర్‌వరల్డ్ నుండి కొత్త ముప్పు వచ్చినప్పుడు, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆయన మళ్లీ తన గతాన్ని బయటకు తీయాల్సి వస్తుంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, ప్రముఖ నటి విద్యా బాలన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
