- Home
- Entertainment
- Ramayana Collection: బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయడానికి ఇంక ఎన్నికోట్లు కావాలి? రామాయణకు సక్సెస్‌కి 5 కారణాలు
Ramayana Collection: బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయడానికి ఇంక ఎన్నికోట్లు కావాలి? రామాయణకు సక్సెస్‌కి 5 కారణాలు
Ramayana Collection: అల్లు అర్జున్ 'పుష్ప 2' రికార్డులను తుడిచిపెట్టేసిన 'రామాయణ' సినిమా.. ఇప్పుడు 'బాహుబలి 2' రికార్డులపై కన్నేసింది! కేవలం 22 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా భారీ సక్సెస్ వెనుక ముఖ్యంగా 5 కారణాలు ఉన్నాయి.

పుష్ప2 కి షాక్ ఇచ్చిన రామాయణ
నితీష్ తివారీ దర్శకత్వంలో యశ్, రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన 'రామాయణ' సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది. రిలీజైన కేవలం 22 రోజుల్లోనే ఈ సినిమా గ్లోబల్ గ్రాస్ కలెక్షన్స్ ₹1,777 కోట్ల మార్కును దాటేశాయి. దీంతో అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' (గ్లోబల్ లైఫ్‌టైమ్ కలెక్షన్స్ ₹1,742.10 కోట్లు), రణబీర్ కపూర్ సొంత సినిమా 'యానిమల్' (₹917.82 కోట్ల లైఫ్‌టైమ్ రికార్డు)లను 'రామాయణ' బ్రేక్ చేసింది.
ఇండియాలో 22 రోజులకు గానూ 'రామాయణ' టోటల్ నెట్ కలెక్షన్స్ ₹992.10 కోట్లు కాగా.. గ్రాస్ కలెక్షన్స్ ఏకంగా ₹1,183 కోట్లను టచ్ చేశాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్లలో చూసుకుంటే ఇప్పటివరకు ఈ సినిమా ₹592.00 కోట్ల గ్రాస్ రాబట్టింది.
రామాయణ' భారీ కలెక్షన్లకు ఈ 5 ప్రధాన కారణాలు
1. సౌత్ స్టార్ యశ్ కాస్టింగ్
సౌత్ ఇండియా సూపర్ స్టార్ యశ్‌కు ఇక్కడ మాత్రమే కాకుండా విదేశాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాలో యశ్ ఉండటంతో సౌత్ ఆడియన్స్ కూడా ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపించే రణబీర్ కపూర్‌తో పోలిస్తే, యశ్‌కి ఉన్న క్రేజ్ ఎక్కువ. అందుకే ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. రావణుడి పాత్రలో యశ్ అద్భుతంగా నటించి ప్రాణం పోశారు. ట్రైలర్లో ఆయన సీన్స్ కూడా అదిరిపోయాయి. సినిమా సక్సెస్‌కు ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్.
2. భారీ స్థాయిలో స్క్రీన్స్, షోల ప్లానింగ్
'రామాయణ' సినిమాను భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేశారు.. ఇప్పటికీ చాలా చోట్ల ఇది ఆడుతోంది. స్క్రీన్లపై ఈ సినిమా పట్టు సాధించడం, వేరే చిన్న సినిమాలను తీసేయడం కూడా ఈ కలెక్షన్లకు ఓ కారణం. ఉదాహరణకు వినోద్ కాప్రీ తీసిన 'పైర్' (Pyre) లాంటి చిన్న సినిమాల షోలను సగానికి తగ్గించి, ఆ ప్లేస్‌లో 'రామాయణ' షోలు వేశారు. కలెక్షన్ల సునామీకి ఇది కూడా ఓ రీజన్.
3. దీపావళి వరుస సెలవులు
నవంబర్ 5న రిలీజైన ఈ సినిమాకు దీపావళి లాంగ్ వీకెండ్ బాగా కలిసొచ్చింది. ఈ సెలవుల కారణంగానే మొదటి 6 రోజుల్లోనే సినిమా ₹500 కోట్ల మార్కును దాటేసింది. సెలవులు ఉండటంతో జనాలు ఫ్యామిలీలతో కలిసి థియేటర్లకు క్యూ కట్టారు. సెకండ్ వీకెండ్లోనే దాదాపు ₹196 కోట్లు వసూలు చేసి ఈ మూవీ సరికొత్త రికార్డులు సృష్టించింది.
4. అద్భుతమైన వీఎఫ్ఎక్స్ (VFX), భారీ ప్రొడక్షన్
సినిమాలో వాడిన వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ ప్రేక్షకులను మెప్పించింది. వరల్డ్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, రిచ్ మేకింగ్ ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. క్రిటిక్స్ నుంచి కూడా దీనికి మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా సీతాపహరణం, జటాయు వధ సీన్లలో వాడిన టెక్నాలజీ ఆడియన్స్‌ను కట్టిపడేసింది.
5. పోటీగా మరో పెద్ద సినిమా లేకపోవడం
'రామాయణ' రిలీజైన టైమ్‌లో పోటీగా వేరే ఏ పెద్ద సినిమా థియేటర్లలో లేదు. దీనికి పోటీగా 'పైర్' లాంటి చిన్న బడ్జెట్ సినిమా మాత్రమే వచ్చింది, దాని షోలు కూడా తగ్గించేశారు. దీని వల్ల ఆడియన్స్ అందరూ 'రామాయణ' వైపే మొగ్గు చూపారు.. అదే ఈ రేంజ్ కలెక్షన్లకు కారణమైంది.
ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాలు ఇవే..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹2,070 కోట్లు వసూలు చేసిన 'దంగల్' ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన బ్లాక్‌బస్టర్‌గా టాప్‌లో ఉంది. ఆ తర్వాత స్థానంలో 'ధురంధర్ 2' ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ₹1,813 నుంచి ₹1,852 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక మూడో ప్లేస్‌లో రాజమౌళి డైరెక్ట్ చేసిన 'బాహుబలి 2' ఉంది. దీని గ్లోబల్ కలెక్షన్స్ దాదాపు ₹1,788 నుంచి ₹1,810 కోట్లు. ప్రస్తుతానికి 'రామాయణ' సినిమా 'బాహుబలి 2' రికార్డును బ్రేక్ చేయడానికి కేవలం ₹11 కోట్ల దూరంలో ఉంది. రాబోయే రోజుల్లో ఈ రికార్డును దాటే అవకాశం ఉంది. కానీ 'ధురంధర్ 2', 'దంగల్' రికార్డులను అందుకోవడం కాస్త కష్టమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.













