- Home
- Entertainment
- Who Is Natalie Burn: అబ్బాయిల గుండెల్లో అలజడి సృష్టించిన `టాక్సిక్` గ్లామర్ డాల్ ఎవరో తెలుసా?
Who Is Natalie Burn: అబ్బాయిల గుండెల్లో అలజడి సృష్టించిన `టాక్సిక్` గ్లామర్ డాల్ ఎవరో తెలుసా?
Who Is Natalie Burn: యష్ నటించిన 'టాక్సిక్' సినిమా టీజర్ విడుదలైంది, ఇది ప్రేక్షకులలో ఆద్యంతం కట్టిపడేస్తుంది. గూస్ బంమ్స్ తెప్పించింది. అదే సమయంలో ఓ నటి అలజడి క్రియేట్ చేసింది.

టాక్సిక్ టీజర్ గూస్ బంమ్స్
యష్ హీరోగా నటించిన `టాక్సిక్` మూవీ నుంచి ఆయన బర్త్ డే ట్రీట్ వచ్చింది. భారీ తారాగణం ఉన్న ఈ టీజర్‌ను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. 2.51 నిమిషాల టీజర్ తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.
టాక్సిక్ సినిమా నటీమణులు
గత వారం నుంచి టాక్సిక్ సినిమా నటీమణుల లుక్స్, పాత్రల పేర్లను చిత్రబృందం వెల్లడిస్తోంది. తారా సుతారియా, రుక్మిణి వసంత్, నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ టీజర్‌లో యష్‌తో కనిపించిన నటి సంచలనం సృష్టిస్తోంది.
టీజర్‌తో సంచలనంగా మారిన నటి
తాజాగా విడుదలైన `టాక్సిక్` టీజర్‌లో ఒక హాట్ సీన్ కనిపిస్తుంది. టీజర్ విడుదలయ్యాక ఈ బ్యూటీ ఎవరని నెటిజన్లు వెతకడం మొదలుపెట్టారు. యష్ తో బోల్డ్‌గా కనిపించిన ఆ గ్లామర్ డాల్ ఎవరో తెలిసిపోయింది.
గ్లామర్ డాల్ పేరు నటాలీ బర్న్ (Natalie Burn)
`టాక్సిక్` గ్లామర్ డాల్ పేరు నటాలీ బర్న్. ఉక్రేనియన్-అమెరికన్ నటి, మోడల్. 'ది యాక్టర్స్ స్టూడియో & ది టెలివిజన్ అకాడమీ'లో సభ్యురాలు. ఆమె ది ఎక్స్ పాండబుల్స్ 3, డాన్‌హిల్, మెకానిక్ రెసురెక్షన్ చిత్రాల్లో నటించింది. బోల్డ్ సీన్లకి, బోల్డ్ మూవీస్‌కి, హర్రర్ చిత్రాలకు ఆమె కేరాఫ్‌గా నిలుస్తూ వస్తోంది.
నటాలీ బర్న్ (Natalie Burn) నిర్మాత కూడా
కొన్ని రోజుల క్రితమే `టాక్సిక్` సినిమాలో నటిస్తున్నట్లు నటాలీ వెల్లడించారు. నటాలీ చాలా ప్రముఖ మ్యాగజైన్‌లకు మోడల్‌గా పనిచేశారు. అయితే ఈ మూవీలో ఆమె నటించడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం. యష్‌తో కారు సీన్లో రొమాంటిక్ సీన్‌లో ఆమె సృష్టించిన అలజడికి ఇప్పుడు ఇండియా మొత్తం షేక్ అవుతుండటం విశేషం.

