Bigg Boss తర్వాత నా కళ్లు తెరుచుకున్నాయి.. సింగర్ గీతా మాధురి
Bigg Boss: టాలీవుడ్ సింగర్ గీతా మాధురి బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సీజన్ లో ఆమె రన్నరప్ గా నిలిచారు. కాగా, రీసెంట్ గా ఆ షో విషయాలను ఆమె ఓ పాడ్ కాస్ట్ లో పంచుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Geetha Madhuri
టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురికి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. తెలుగులో మంచి ప్లే బ్యాక్ సింగర్ గా ఆమెకు గుర్తింపు ఉంది. కేవలం సినిమాల్లో పాటలు పాడటమే కాకుండా.. పలు రకాల సింగింగ్ షోలో మెంటర్ గానూ, జడ్జిగా కూడా ఆమె పార్టిసిపేట్ చేశారు. ఆమె పాటలకు, ఆమె వ్యక్తిత్వానికి చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు.
గీతా మాధురి బిగ్ బాస్ కి కూడా వెళ్లారనే విషయం అందరికీ తెలిసిందే. హీరో నాని హోస్ట్ గా ఉన్న సమయంలో సీజన్ 2 లో ఆమె బిగ్ బాస్ హౌస్ కి వెళ్లారు. ఆ సీజన్ లో రన్నరప్ గా ఆమె నిలిచారు. ఆ సమయంలో చేతికి బిగ్ బాస్ టాటూ కూడా వేయించుకున్నారు. కాగా.. రీసెంట్ గా గీతా మాధురి ఓ పాడ్ కాస్ట్ కి హాజరయ్యారు. ఆ సమయంలో బిగ్ బాస్ విషయాలను పంచుకున్నారు.
ఎడిటర్స్ కూడా గేమ్ ఆడతారు..
బిగ్ బాస్ లో గేమ్ ఆడేది కేవలం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రమే కాదు అని గీతా మాధురి అన్నారు. మొత్తం ముగ్గురు గేమ్ ఆడతారని... ఒకరు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే.. రెండోది ఆడియన్స్, మూడోది ఎడిటర్స్ అని ఆమె చెప్పారు. ఇప్పటికీ.. మీ సీజన్ లో పాల్గొన్న వారితో కాంటాక్ట్ లో ఉన్నారా అని యాంకర్ అడిగితే.. ‘ మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. అప్పుడప్పుడు మెసేజ్ లు చేసుకుంటూ ఉంటాం. బర్త్ డేస్ కి విష్ చేసుకుంటాం. ఏదైనా సాధిస్తే షేర్ చేసుకుంటాం. హౌస్ లో ఉన్నప్పుడు ఉన్న కోపం బయట వచ్చిన తర్వాత ఏమీ ఉండదు. అన్ని సీజన్ల కంటే మా సీజనే బాగుంది.. ఎంతైనా మన సీజన్ మన సీజనే అని ఇలానే మాట్లాడుకుంటూ ఉంటాం’ అని గీతా మాధురి చెప్పారు.
మీ సీజన్ విన్నర్ కౌశల్ గారితో టచ్ లో ఉన్నారా అని యాంకర్ అడిగితే.. ‘ రెగ్యులర్ గా కాదు కానీ.. కొన్ని సార్లు కలిశాం. మా పాప పుట్టినప్పుడు వచ్చారు.. నేను ఆయన బర్త్ డే కి వెళ్లాను. మేమిద్దరం కలిసి ఆర్జే చైతూకి ఇంటర్వ్యూ ఇచ్చాం.. రెగ్యులర్ గా టచ్ లో లేకపోయినా కలిసినప్పుడు మాట్లాడుకుంటాం’ అని గీతా చెప్పారు. అయితే..బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు గీతా చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
నా కళ్లు తెరుచుకున్నాయి..
తన చేతికి ఉన్న బిగ్ బాస్ టాటూ చూపిస్తూ.. తన కళ్లు తెరుచుకున్నాయి అని ఆమె అన్నారు. ‘ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నిజంగా నా కళ్లు తెరుచుకున్నాయి. అప్పటి వరకు నేను ఒక టైప్ ఆఫ్ పీపుల్ ని చూడలేదు. అందరూ మంచోళ్లు అనే భావన నుంచి.. అంతలేదు అనే భావనకు వచ్చాను. నా బిగ్ బాస్ జర్నీ తర్వాత.. ఏదీ నమ్మడం లేదు. చూసినదల్లా, విన్నదల్లా నమ్మడం ఆపేశాను. నేను చూసింది కూడా నమ్మట్లేదు. నా కళ్లతో ఏదైనా చూసినా.. వేరే యాంగిల్ లో ఏమైనా చూశానేమో, మాములుగానే నేను నాన్ జడ్జిమెంటల్. ఈ బిగ్ బాస్ తర్వాత మరింత నాన్ జడ్జిమెంటల్ గా మారిపోయాను. ఆ సమయంలో ఏమయ్యింటుంది లే అని ఆలోచించడం మారిపోయాను. చాలా ఎమోషనల్ గా అయ్యాను. అంతే ప్రాక్టికల్ గా కూడా మారాను. ఈ రెండూ కాంట్రాస్ట్ అయినా కూడా నా లైఫ్ లో ఈ రెండూ బిగ్ బాస్ తర్వాత జరిగాయి. మొదటి మూడు వారాలు ఫ్రెండ్స్ లేరు అని అనుకున్నాను.. చివరి వారాల్లో అందరితో మెమరీలు క్రియేట్ అయ్యియి.’ అని గీతా చెప్పారు

