బాలకృష్ణకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఆయన ఒక్కరినే కలుస్తాడా? విశ్వక్ సేన్, సిద్దు కాదు
నందమూరి బాలకృష్ణ ఇప్పుడు యంగ్ బ్యాచ్‌ని మెయింటేన్ చేస్తున్నారు. కానీ అంతకు ముందు ఆయన ఒక్క హీరోతోనే క్లోజ్‌గా ఉండేవారట. ఆయనే బెస్ట్ ఫ్రెండ్ అట. మరి ఎవరు ఆయన?
photo credit-aha unstoppable 4
నందమూరి నటసింహం బాలకృష్ణ.. తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని హీరోగా రాణిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీలో రెండో తరం నటుడిగా రాణిస్తున్న ఏకైక హీరో బాలయ్య కావడం విశేషం. ఆరుపదులు వయసులోనూ ఇప్పటికీ అటు సీనియర్లు చిరు, వెంకీ, నాగ్, ఇటు కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఎంత మంది హీరోలు వచ్చినా బాలయ్య స్పెషాలిటీ వేరే. ఆయన్ని ఎవరూ మ్యాచ్ చేయలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
బాలకృష్ణ ఆ మధ్య కాస్త ఒడిదుడుకులతో కెరీర్‌ని లాక్కొచ్చారు. కానీ ఇప్పుడు సరైన ట్రాక్‌లో పడ్డారు. వరుసగా విజయాలు అందుకుంటున్నారు. `అఖండ` సినిమాతో ప్రారంభమైన ఆయన సక్సెస్ జర్నీ `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి` చిత్రాలతో కొనసాగిస్తూ వచ్చారు. హ్యాట్రిక్ హిట్‌ని అందుకున్నారు. ప్రస్తుతం `డాకు మహారాజ్` సినిమాతో రాబోతున్నారు.
ఇదిలా ఉంటే బాలకృష్ణ ఇటీవల కుర్ర హీరోలతో క్లోజ్‌గా ఉంటున్నారు. అల్లు అర్జున్‌తో కలిసినప్పుడు క్లోజ్‌గానే ఉంటారు. అలాగే కుర్రహీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డతో పార్టీలు కూడా చేసుకుంటారట. ఇలా యంగ్ బ్యాచ్‌ని మెయింటేన్ చేస్తున్నారు బాలయ్య. కుర్ర హీరోలతో స్నేహం ఆయనలో ఎనర్జీని పెంచుతుందని చెబుతుంటారు. అయితే ఇవన్నీ ఈ రెండు మూడేళ్లుగా ఏర్పడ్డ పరిచయాలు.
Chiranjeevi - Balakrishna
కానీ అంతకు ముందే బాలయ్యకి ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ ఉన్నాడట. ఆయనే బెస్ట్ ఫ్రెండ్ అట. కలవడం చాలా తక్కువ అని, కలిస్తే మాత్రం ఆయన్నే కలుస్తానని, ఆయనతోనే క్లోజ్‌గా, సరదాగా ఉంటానని తెలిపారు బాలయ్య. ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటే చిరంజీవినే అని వెల్లడించారు బాలయ్య.
తమ మధ్య మంచి స్నేహం మాత్రమే కాదు, సినిమాల పరంగా పోటీ కూడా ఉంటుందని తెలిపారు బాలకృష్ణ. తాను ఎక్కువగా ఎవరినీ కలువని అని, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నట్టు తెలిపారు నందమూరి నట సింహం. ఒకవేళ ఎప్పుడైనా కలిస్తే మాత్రం చిరునే అని, ఇండస్ట్రీలో క్లోజ్‌గా ఉండేది ఆయనతో, ఇంకెవరితోనూ క్లోజ్‌గా ఉండనని, ఆయనతోనే అన్ని పంచుకుంటామని తెలిపారు.
Chiranjeevi - Balakrishna
బాలకృష్ణ నటించిన `గౌతమిపుత్ర శాతకర్ణి` సినిమా సమయంలో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆ సమయంలోనే చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ `ఖైదీ నెంబర్ 150` చిత్రంలో నటించారు. వీరి రెండు సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. రెండు సినిమాల మధ్య పోటీ ఉంటుందనే చర్చ బాగా నడిచింది. అయితే అసలు రంజు అప్పుడే ఉంటుందని సినీ అభిమానులు ఫీలయ్యారు. ఇ
ద్దరి సినిమాల మధ్యనే అసలైన పోటీ ఉంటుందని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. పోటీ ఉంటేనే బాగా కష్టపడి పనిచేస్తామని, అదే కిక్ ఇస్తుందన్నారు. పోటీ లేకుండా మజా ఉండదని, లైఫ్ చప్పగా సాగుతుందన్నారు. ఆ తర్వాత గతేడాది `వాల్తేర్ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాలతో ఈ ఇద్దరు మరోసారి పోటీ పడిన విషయం తెలిసిందే. రెండు సార్లు ఇద్దరూ విజయం సాధించడం విశేషం.
Chiranjeevi - Balakrishna
ఈ సంక్రాంతికి కూడా ఈ ఇద్దరు బాక్సాఫీసు వద్ద తలపడాల్సి వచ్చింది. చిరంజీవి నటిస్తున్న `విశ్వంభర` చిత్రాన్ని మొదట సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఈ మధ్యనే ఈ పోటీ నుంచి తప్పుకున్నారు. షూటింగ్, సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ డిలే కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ఈ సంక్రాంతికి బాలయ్య నటిస్తున్న `డాకు మహారాజ్` సినిమాని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సారి తండ్రి చిరంజీవితో కాకుండా కొడుకు చరణ్‌తో పోటీ పడుతున్నారు బాలకృష్ణ. చరణ్ నటిస్తున్న `గేమ్ ఛేంజర్` చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.
also read: `పుష్ప 2`కి ఫహద్ ఫాజిల్ పారితోషికం ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే? హీరోయిన్ కంటే కూడా