MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ఖాళీగా ఉందని అమ్మాయిని ప్రేమించిన చిరంజీవి డైరెక్టర్‌, ఇన్‌ కమింగ్‌ కాల్‌ ఫ్రీ చేయాలంటూ దేవుడికి మొక్కులు

ఖాళీగా ఉందని అమ్మాయిని ప్రేమించిన చిరంజీవి డైరెక్టర్‌, ఇన్‌ కమింగ్‌ కాల్‌ ఫ్రీ చేయాలంటూ దేవుడికి మొక్కులు

ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ క్రష్‌ ఉంటుంది. టీనేజ్‌లోనే ప్రేమలో పడతారు. కానీ అవి సక్సెస్‌ కావడం చాలా అరుదు. ఈ విషయంలో చిరంజీవి డైరెక్టర్‌ చేసిన పని మాత్రం క్రేజీ.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Nov 20 2024, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
photo i dream

photo-i dream

మెగాస్టార్‌ చిరంజీవి చివరగా బిగ్గెస్ట్ హిట్‌ అందుకున్న మూవీ `వాల్తేర్‌ వీరయ్య`. ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా ఇది నిలిచింది. ఇది రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. ఇందులో చిరంజీవికి జోడీగా శృతి హాసన్‌ నటించగా, రవితేజ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీకి దర్శకుడు బాబీ(కేఎస్‌ రవీంద్ర). అభిమానిగా చిరంజీవిని ఎలా చూపించాలో ఆ రేంజ్‌లో చూపించి ఆయనకు కెరీర్‌ బెస్ట్ హిట్‌ ఇచ్చాడు బాబీ. 
బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
photo-i dream

photo-i dream

అసిస్టెంట్‌ డైరెక్టర్ గా, రైటర్‌గా చాలా ఏళ్లు పనిచేసిన బాబీ.. రవితేజతో `పవర్‌` సినిమాతో దర్శకుడిగా మారారు. ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు`. `సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌`, `జై లవకుశ`, `వెంకీ మామ`, `వాల్తేర్‌ వీరయ్య` వంటి సినిమాలు తీశారు. `సర్దార్‌ గబ్బర్‌ సింగ్`, `వెంకీ మామ` అంతగా ఆడలేదు. మిగిలిన సినిమాలు పెద్ద హిట్‌ అయ్యాయని చెప్పొచ్చు. ఇప్పుడు బాలకృష్ణతో `డాకు మహారాజ్‌` సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన టీనేజ్‌ లవ్‌ స్టోరీ బయటపెట్టాడు. క్రేజీ స్టోరీ చెప్పి ఆశ్చర్యపరిచారు. 

36
photo-i dream

photo-i dream

దాదాపు పదకొండేళ్లు సినిమాల్లో స్ట్రగుల్‌ పడినట్టు తెలిపాడు బాబీ. అయితే ఇండస్ట్రీలో తాను చాలా స్ట్రగుల్స్ ఫేస్‌ చేసినట్టు తెలిపారు. కథలు చెప్పడానికి వెళ్లినప్పుడు కొత్త షర్ట్ లేకపోవడంతో ఆఫర్లో వంద రూపాయలకు రెండు షర్ట్ కొనుక్కొని అవే చాలా ఏళ్లు మ్యానేజ్‌ చేశాడట. తినడానికి డబ్బులు ఉండేవి కాదని తెలిపారు. ఈ క్రమంలో ప్రేమించిన అమ్మాయి కోసం తాను ఇండస్ట్రీలోకి వచ్చాడట. అది చాలా విచిత్రంగా జరిగిందన్నారు. తాను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్‌ 9వ తరగతి చదివే అమ్మాయిని ప్రేమించాడట. ఆమె కోసం తన బైక్‌ తీసుకుని వెళ్తుండేవాడట. 
 

46

ఓ రోజు తనని కూడా తీసుకెళ్లారు. ఫ్రెండ్‌ లవర్‌తోపాటు మరో అమ్మాయి తోడు వచ్చిందట. ఆ ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటుంటే ఈ అమ్మాయి ఖాళీగా కనిపించేది. దీంతో ఆ అమ్మాయితో మాట్లాడటం స్టార్ట్ చేశాడట బాబీ. వాటర్‌ అడగడం, స్కూల్‌ ఎన్నిగంటలకు అయిపోతుంది, టీచర్‌ ఎలా ఉంటారు, క్లాస్లు ఎలా అవుతున్నాయని ఏదో పిచ్చాపాటి మాటలు మాట్లాడేవాడట. అలా ఆ పరిచయం సీరియస్‌గా మాట్లాడుకునే స్థాయికి వెళ్లిందని, ఇలా రెండేళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారట.

56

ఓ రోజు అమ్మాయి మనం పెళ్లి చేసుకుందాం అని అడిగేసిందట. ఏదో చిన్నపిల్ల కదా అని లైట్‌ తీసుకున్నాడట. కానీ ఆమె మాటలు సీరియస్‌గా గుండెకి గుచ్చుకుంటున్నాయట. ఆమెని పెళ్లి చేసుకోవాలంటే మనం ఏదైనా చేయాలి, ఏం చేయాలనే కన్‌ప్యూజన్‌తో చదువు మానేసినట్టు తెలిపారు బాబీ. ఆ కన్‌ప్యూజన్‌లోనే హైదరాబాద్‌కి వచ్చినట్టు చెప్పాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లాలననిపించిందని,  డైరెక్టర్‌ కావాలని బలంగా నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దానికోసమే పదకొండేళ్లు స్ట్రగుల్ అయినట్టు తెలిపారు.
 

66

హైదరాబాద్‌కి వచ్చాక కూడా చిన్న డబ్బా ఫోన్‌తో కాల్స్ మాట్లాడేవాడట. అయితే కాల్స్ చేయడం కంటే ఇన్‌కమింగ్‌ కాల్స్ కే ఎక్కువ అమౌంట్‌ కట్ అయ్యేదట. అదే చాలా ఇబ్బందిగా ఉండేదని, దీంతో పంజాగుట్టలో సాయి బాబా టెంపుల్‌కి ప్రతి గురువారం వెళ్లేవాడట. గుడికి వెళ్లి దేవుడిని కోరుకునే కోరికలు రెండే అని, ఒకటి ఇన్‌కమింగ్‌ కాల్స్ ఫ్రీ చేయాలని, రెండోది ఇండస్ట్రీలో నిలబడేలా చేయాలనేది.

అలా 2003 నుంచి 2006 వరకు రోజూ అదే కోరుకున్నాడట. కోరుకున్నట్టుగానే ఇన్‌కమింగ్‌ కాల్స్ ఫ్రీ చేశారట. ఆ తర్వాత కొన్నాళ్లకి దర్శకుడిగా మారిపోయాయని, పెళ్లి చేసుకున్నానని తెలిపారు. అయితే తమది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని, అమ్మాయిది వేరే కాస్ట్ కావడంతో ఆ అడ్వెంచర్స్ కూడా ఫేస్‌ చేసినట్టు తెలిపారు బాబీ. బాలయ్యతో చేస్తున్న `డాకు మహారాజ్‌` మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది.   

read more:`పుష్ప 2`కి ఫహద్‌ ఫాజిల్‌ పారితోషికం ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే? హీరోయిన్‌ కంటే కూడా

also read: ఫారెన్‌లో నాగార్జునకి చుక్కలు చూపించిన నయనతార, ఫోన్‌ వస్తే వణికిపోయేవారట.. ఆ బ్యాడ్‌ డేస్‌ని స్వయంగా చూశాడట

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image2
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Recommended image3
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved