- Home
- Entertainment
- ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల కంటే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? సావిత్రి, భానుమతి, జమున కాదు
ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల కంటే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? సావిత్రి, భానుమతి, జమున కాదు
Ntr-Anr: ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? సావిత్రి, భానుమతి, జమున కాదు, మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఎంత తీసుకున్నదంటే?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Ntr-Anr
Ntr-anr: పారితోషికాల ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఎవరు ఎక్కువ తీసుకుంటే వాళ్లే పెద్ద హీరోలుగా చెలామణి అవుతున్నారు. కానీ ఇండస్ట్రీ ప్రారంభంలో పారితోషికాలకు ప్రయారిటీ ఉండేది కాదు, ఎన్టీఆర్, ఏఎన్నార్ సమయంలో తక్కువ పారితోషికాలు తీసుకుంటూ ఎక్కువ సినిమాలు చేసేవారు.
ఏడాదికి ఇరవై ముప్పై మూవీస్ చేసేవారంటే అతిశయోక్తి లేదు. అయితే అప్పట్లో కూడా కొందరు స్టార్స్ భారీ పారితోషికం తీసుకునే వాళ్లు ఉన్నారు. ఓ దశలో ఎన్టీఆర్, ఎన్నార్‌లను మించిన పారితోషికాలు తీసుకునే హీరోయిన్లు కూడా ఉన్నారు.
telugu heroes, heroines,
సావిత్రి, భానుమతి, జమున, అంజలిదేవి వంటి హీరోయిన్లు అప్పట్లో హీరోలకు దీటుగా సినిమాలు చేసి రాణించారు. నటనలోనే కాదు, పారితోషికాల్లో కూడా పోటీ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు లను మించిన పారితోషికం తీసుకున్న హీరోయిన్ కూడా ఉంది.
అయితే ఈ జాబితాలో సావిత్రి, జమున, భానుమతి వంటి కథానాయికలు లేరు. వీళ్లు కాకుండా ఓ హీరోయిన్ మాత్రం హైయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్‌గా నిలిచింది. మరి ఆమె ఎవరు? ఎంత తీసుకునేది అనేది చూస్తే.
vanisri
ఆమె ఎవరో కాదు అలనాటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీ. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా సొంత టాలెంట్‌తో ఎదిగిన నటి వాణిశ్రీ. కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు. ఆమె నటించిన సినిమాలకు అవార్దులు తక్కువగా వచ్చినా, కమర్షియల్‌గా బాక్సాఫీసు వద్ద సత్తా చాటాయి. కాసుల వర్షం కురిపించాయి.
దీంతో వాణిశ్రీకి అప్పట్లో ఫుల్ డిమాండ్ ఉండేది. రామారావు, నాగేశ్వరరావు వంటి హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసేవారు. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి స్టార్స్ తర్వాత రాణించినా, ఓ పీరియడ్‌లో వాణిశ్రీ మోస్ట్ డిమాండ్ హీరోయిన్‌గా నిలిచింది. అత్యధిక పారితోషికం అందుకున్న నటిగానూ నిలిచింది.
Ntr-Anr
అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు గట్టిగా కొడితే రెండు లక్షలు తీసుకునే వారు. 1.5లక్షలు తీసుకుంటే ఎక్కువ. అప్పట్లో శోభన్‌బాబు హీరోల్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా నిలిచారు. ఆయన రెండు లక్షలు తీసుకునేవారట. కానీ ఆయన్ని మించిన పారితోషికం తీసుకున్న నటి వాణిశ్రీ. ఆమె ఒక్కో సినిమాకి అప్పట్లో రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు పారితోషికం తీసుకునేవారట.
ఈ విషయాన్ని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. అప్పట్లో ఇండస్ట్రీని, హీరోలను డామినేట్ చేసిందని, కొన్నాళ్లపాటు శాషించిందన్నారు. వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెడితే నటిగా ఆమె నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని, జూ ఆర్టిస్ట్ నుంచి నటిగా మారి సూపర్ స్టార్‌గా ఎదిగిందన్నారు. ఆమె అంటే తనకు ఎంతో రెస్పెక్ట్ అని తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ.
vani sri
నెల్లూర్‌కి చెందిన వాణిశ్రీ.. 1962లో వచ్చిన `భీష్మ` చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత `సుఖ దుఃఖాలు` సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. `మరుపురాని కథ` కూడా బాగానే ఆడింది. `కృష్ణవేణి`, `ప్రేమ్ నగర్`, `దసరా బుల్లోడు` చిత్రాలతో స్టార్‌గా ఎదిగింది.
ఇక తిరిగిలేని ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. `ఆరాధన`, `జీవిత చక్రం`, `రంగుల రాట్నం`, `భక్త కన్నప్ప`, `బొబ్బిలి రాజా` వంటి చిత్రాలతో తిరుగులేని లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది వాణిశ్రీ. సుమారు నాలుగు దశాబ్దాలపాటు చిత్రపరిశ్రమలో ఉంది.
Vanisri
హీరోయిన్‌గా కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే డాక్టర్ కరుణకరన్ ని వివాహం చేసుకుంది. మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యింది. ఆమెకి ఒక కొడుకు, ఓ కూతురు ఉంది. పిల్లలు కాస్త పెద్దయ్యాక మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అమ్మగా, అత్త పాత్రలు పోషించింది. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో వాణిశ్రీ సుమారు 200 మూవీస్ చేసింది. తెలుగులోనే ఎక్కువ మూవీస్ ఉన్నాయి.
also read: Mad Square Movie Review: `మ్యాడ్ 2` మూవీ రివ్యూ, రేటింగ్