MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉపాసన భర్త కాదు వెంకటేష్ అల్లుడు కావాల్సిన రామ్ చరణ్... మరి కథ ఎక్కడ అడ్డం తిరిగింది?

ఉపాసన భర్త కాదు వెంకటేష్ అల్లుడు కావాల్సిన రామ్ చరణ్... మరి కథ ఎక్కడ అడ్డం తిరిగింది?

హీరో రామ్ చరణ్ దగ్గుబాటి వారి అల్లుడు కావాల్సిందట. అనుకున్నట్లు జరిగితే చిరంజీవి-వెంకటేష్ వియ్యంకులు అయ్యేవారట. మరి పెద్దలు మాట్లాడుకున్న ఈ సంబంధం ఎలా చెడిపోయింది.  

2 Min read
Sambi Reddy
Published : Sep 15 2022, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Venakatesh

Venakatesh

ఎవరితో ఎవరికి రాసుందో మనం చెప్పలేం. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. అలా రామ్ చరణ్-ఉపాసనలకు ఎప్పుడో రాసిపెట్టి ఉంది. వాళ్ళు భార్యాభర్తలు కావాలని భగవంతుడు నిర్ణయించాడు. పదేళ్ల వివాహ బంధం పూర్తి చేసుకున్న ఈ జంట టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. 
 

27
Venakatesh

Venakatesh

అయితే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కి మరో అమ్మాయిని అనుకున్నారట. దాదాపు ఓకే జనరేషన్ కి చెందిన చిరంజీవి-వెంకటేష్ అగ్ర హీరోలుగా దశాబ్దాల పాటు టాలీవుడ్ ని ఏలారు. వీరి మధ్య మంచి రిలేషన్ కూడా ఉంది. ఈ సాన్నిహిత్యంతో వియ్యంకులు కావాలని అనుకున్నారట. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత ను చరణ్ కిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారట.

37
Venakatesh

Venakatesh


రామ్ చరణ్-ఆశ్రితలకు వివాహం చేయాలని చిరంజీవి, వెంకటేష్ మధ్య మాటలు జరిగాయట. దాదాపు ఈ సంబంధం ఖాయం అయ్యిందట. ఇక రామ్ చరణ్ అభిప్రాయం చిరంజీవి అడగ్గా నో చెప్పారట. అలాగే తాను కామినేని ఉపాసనను ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడట. 
 

47
Venakatesh

Venakatesh

ఉపాసనతో రామ్ చరణ్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని తెలుసుకున్న చిరంజీవి చేసేది లేక వెంకటేష్ కుటుంబంతో సంబంధం క్యాన్సిల్ చేశాడట. ఇదే విషయాన్ని వెంకటేష్ తో చెప్పాడట. ఇక 2012 జూన్ 14న రామ్ చరణ్-ఉపాసనల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. 
 

57


మరోవైపు ఆశ్రిత హైదరాబాద్ కి చెందిన బిజినెస్ మాన్ ని ప్రేమించారు. కోరుకున్నవాడికి ఇచ్చి వెంకటేష్ ఆశ్రిత వివాహం చేశారు. భర్తతో పాటు విదేశాల్లో ఉంటున్న ఆశ్రిత హ్యాపీ మారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. 

67

ఇక రామ్ చరణ్-ఉపాసన ఇటీవలే 10వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు ఈ జంట. అక్కడే వన్ వీక్ ఏకాంతంగా గడిపి వచ్చారు. ఇద్దరూ తమ వృత్తుల్లో చాలా బిజీగా ఉంటారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా ఉన్నారు. అలాగే ఆ సంస్థ చారిటీ కార్యక్రమాలతో పాటు బి పాజిటివ్ అనే మ్యాగజైన్ నడుపుతున్నారు. 
 

77
మరోవైపు ఫోటోషూట్‌లతో రెచ్చిపోయారు మెగా హీరోలు. అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి స్పెషల్‌ ఫోటోలకు పోజిచ్చారు.

మరోవైపు ఫోటోషూట్‌లతో రెచ్చిపోయారు మెగా హీరోలు. అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి స్పెషల్‌ ఫోటోలకు పోజిచ్చారు.

ఇక రామ్ చరణ్ స్టార్ హీరోగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రామ్ చరణ్ వరల్డ్ వైడ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు శంకర్ తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved