పవన్ కళ్యాణ్ మూవీ చేయనని చెప్పిన శోభన్ బాబు... కారణం ఏమిటో తెలుసా?
నటుడు శోభన్ బాబు, పవన్ కళ్యాణ్ ల గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మూవీకి శోభన్ బాబు నో చెప్పారట. అందుకు కారణం ఏమిటో చూద్దాం...

శోభన్ బాబు తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టార్ గా వెలిగారు. ఆయన ఫ్యామిలీ చిత్రాల హీరో. లేడీ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. ఏళ్ల తరబడి ఆయన స్టార్ గా ఉన్నారు. బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు.
Sobhan Babu
ఒక దశకు వచ్చాక శోభన్ బాబు ఇమేజ్ తగ్గింది. 80లలో ఆయన కెరీర్ పీక్స్ లో ఉంది. 90ల నాటికి తగ్గింది. 1996లో విడుదలైన హలో గురూ ఆయన చివరి చిత్రం. 2008లో శోభన్ బాబు మరణించారు. అంతకు ముందే ఆయనకు సిల్వర్ స్క్రీన్ కి దూరం అయ్యారు.
Pawan Kalyan
కాగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ సుస్వాగతం లో ఆయనకు ఆఫర్ వచ్చిందట. కానీ ఆయన రిజెక్ట్ చేశాడట. సుస్వాగతం చిత్రంలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర కీలకం కాగా శోభన్ బాబును అనుకున్నారట. ఆయన్ని సంప్రదించగా రిజెక్ట్ చేశాడట. అందుకు ఆయన ఒక కారణం చెప్పాడట.
నేను హీరోగా రిటైర్ అయ్యాను. ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో హీరోగానే ఉండాలి. అదే ఇమేజ్ నాకు ఉండాలి. అందుకే క్యారెక్టర్ రోల్స్ చేయకూడదు అనుకున్నాను. కాబట్టి చేయను అన్నారట. శోభన్ బాబు చేయకపోవడంతో ఆ పాత్రకు రఘువరన్ ని తీసుకున్నారు. రఘువరన్ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు.
అతడు మూవీకి కూడా శోభన్ బాబుని దర్శకుడు త్రివిక్రమ్ సంప్రదించినట్లు సమాచారం. నాజర్ చేసిన హీరో తాత పాత్రకు శోభన్ బాబును అనుకున్నారట. అప్పుడు కూడా శోభన్ బాబు చేయను అని చెప్పారట. శోభన్ బాబు తెలివిగా తన సంపాదన రియల్ ఎస్టేట్ లో పెట్టాడు. దాంతో ఆయనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. కేవలం డబ్బుల కోసం నటించాల్సిన అవసరం రాలేదు..