- Home
- Entertainment
- ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సెకండ్ సీజన్ ఎప్పుడు రాబోతోంది? ఈసారి గెస్ట్స్ ఎవరు? డిటేయిల్స్..
‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సెకండ్ సీజన్ ఎప్పుడు రాబోతోంది? ఈసారి గెస్ట్స్ ఎవరు? డిటేయిల్స్..
నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ (Balakrishna) మరోసారి ఓటీటీలో సందడి చేయనున్నారు. గతంలో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’తో అలరించిన బాలయ్య.. రెండో సీజన్ తో రానున్నాడు.

ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో (Aha) నందమూరి బాలకృష్ణ గతంలో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ (Unstopable with NBK)తో ఎంతలా అలరించాడో తెలిసిందే. ఈ టాక్ షోకు బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మొట్టమొదటి సారి బాలకృష్ణ టాక్ షోలో హోస్ట్ గా వ్యవహరించడం అందరినీ మెప్పించింది. పది ఎపిసోడ్ లుగా సాగిన ఈ షో ఓటీటీ వేదికన మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా బాలయ్య గెస్ట్ లతో వ్యవహరించిన విధానం ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది.
అయితే చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఈ టాక్ షోకు గెస్ట్ గా వచ్చారు. ఆఖరి ఎపిసోడ్ మహేశ్ తో ముగిస్తున్నట్టు నిర్మాణ సంస్థ తెలిపింది. అయితే మొదటి సీజన్ విజయవంత అవడంతో రెండో సీజన్ కూడా రానుందని అప్పుడే అనౌన్స్ చేశారు.
ఈ మేరకు ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సెకండ్ సీజన్ కోసం ప్లాన్ షురూ అయ్యినట్టు తెలుస్తోంది. దీనికోసం అన్ని ఎపిసోడ్స్ కు సంబంధించిన కార్యచరణను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఒక్కో ఎపిసోడ్ షూట్ చేసి ఆహాలోనే రిలీజ్ చేయనున్నారు.
మొదటి సీజన్ కు టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు, న్యూ ఫిల్మ్స్ స్టార్ కాస్ట్ ను గెస్ట్స్ గా ఆహ్వానించారు. అయితే సెకండ్ సీజన్ మాత్రం అంతకు మించి ఉండనుందని తెలుస్తోంది. మరింత ఆదరణ పొందేలా ప్లాన్ చేశారంట. ఈ షోకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఇతర యంగ్ హీరోలు స్పెషల్ గెస్ట్స్ గా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన రాబోయే చిత్రం NBK107 చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారకు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ సగానికిపైగా పూర్తవగా.. మిగితా భాగాన్ని శరవేగంగా షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ అనంతరం జూన్ నెలలో టాక్ షోకు సంబంధించిన సెకండ్ సీజన్ షూట్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని టాక్.