- Home
- Entertainment
- ఇంటి అద్దె కట్టలేక రోడ్డున పడిన రష్మిక మందాన కుటుంబం... హీరోయిన్ కాకముందు ఆమె కష్టాలు తెలుసా?
ఇంటి అద్దె కట్టలేక రోడ్డున పడిన రష్మిక మందాన కుటుంబం... హీరోయిన్ కాకముందు ఆమె కష్టాలు తెలుసా?
సినిమాకు కోట్లు తీసుకుంటున్న రష్మిక మందాన కుటుంబం ఒకప్పుడు కనీసం ఇంటి రెంట్ కట్టలేక ఇబ్బంది పడ్డారట. రెండు నెలలకో సారి ఇల్లు మారేవారట. ఆమె ఒకప్పటి జీవితం గురించి ఆసక్తికర విషయాలు...

Rashmika mandanna
రష్మిక మందాన దేశంలోనే టాప్ హీరోయిన్స్ లో ఒకరు. ఆమె సినిమాకు రూ. 5 కోట్ల వరకూ తీసుకుంటున్నారు. సౌత్ తో పాటు నార్త్ ఇండియా లో కూడా ఆఫర్స్ దక్కించుకుంటుంది. ఏడాదికి రష్మిక మందాన సంపాదన ఇరవై కోట్లకు పైమాటే. ఆమెకు పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి.
అయితే ఒకప్పుడు రష్మిక జీవితం వేరట. చదువుకునే రోజుల్లో తన కుటుంబం ఎంతటి ఆర్థిక కష్టాలు అనుభవించిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కనీసం ఇంటి అద్దె చెల్లించే స్థోమత కూడా వారికి ఉండేది కాదట. ఇల్లు ఖాళీ చేసి రోడ్డున పడ్డ సందర్భాలు అనేకం అని ఆమె అన్నారు.
రష్మిక మందాన మాట్లాడుతూ.. నా జీవితంలో మరొక కోణం ఉంది. మా కుటుంబం ప్రతి రెండు నెలలకు ఇల్లు మారుతూ ఉండేవాళ్ళం. బాల్యం లో పడ్డ కష్టాలు నాకు ఇంకా గుర్తున్నాయి. నివసించడానికి ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడ్డాము.
అద్దె ఇంటికి రెంట్ కట్టలేని పరిస్థితి. అందుకే తరచుగా ఇల్లు మారుతూ ఉండేవాళ్ళం. అద్దె ఇళ్ల కోసం వీధుల్లో తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మా పేరెంట్స్ ని ఒక బొమ్మ కొనివ్వమని కూడా అడిగేవాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్లకు ఆ స్థోమత లేదు. కానీ మేము ఏది అడిగినా పేరెంట్స్ కాదనకుండా ఇచ్చేవాళ్ళు.
ఇప్పటికీ నేను ఓ బొమ్మ కూడా కొనుక్కోలేని అప్పటి అమ్మాయిలానే ఫీల్ అవుతాను. అందుకే నేను డబ్బులకు చాలా విలువ ఇస్తాను. నేను బాల్యంలో పడిన కష్టాలు రీత్యా నా సక్సెస్ ని తేలిగ్గా తీసుకోను.. అని రష్మిక చెప్పుకొచ్చింది.
రష్మిక చదుకునే రోజుల్లో మోడలింగ్ చేసింది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఆమెకు కిరిక్ పార్టీ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. అది సూపర్ హిట్ కొట్టింది. ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం ఛలో. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరూ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఆమె స్టార్ అయ్యారు. 1996 ఏప్రిల్ 5న జన్మించిన రష్మిక మందాన బర్త్ డే నేడు.