MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎదురుగా హీరోయిన్ తల్లి, లిప్ లాక్ సీన్ కోసం 47 టేక్స్ తీసుకున్న స్టార్ హీరో, మూడు రోజులు నాన్ స్టాప్ షూటింగ్!

ఎదురుగా హీరోయిన్ తల్లి, లిప్ లాక్ సీన్ కోసం 47 టేక్స్ తీసుకున్న స్టార్ హీరో, మూడు రోజులు నాన్ స్టాప్ షూటింగ్!

బాలీవుడ్ లో లిప్ లాక్ సన్నివేశాల కల్చర్ చాలా కాలం క్రితమే మొదలైంది. ఓ హీరోయిన్ తో ముద్దు సన్నివేశం చేసేందుకు ఓ హీరో 47 టెక్స్ తీసున్నాడంటే మీరు నమ్ముతారా..  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 13 2024, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Amir Khan

Amir Khan

సిల్వర్ స్క్రీన్ పై లిప్ లాక్ సన్నివేశం అంటే ఒక క్రేజీ థింగ్. ఇప్పటికీ ఇండియన్ ఆడియన్స్ దీన్ని బోల్డ్ అటెంప్ట్ గానే చూస్తారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలు కాగా సౌత్ చిత్రాల్లో కూడా ఘాటైన ముద్దు సన్నివేశాలు ఉంటున్నాయి. ఒక లిప్ లాక్ సన్నివేశం మూడు రోజులు షూట్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26


అమీర్ ఖాన్ తో ముద్దు సన్నివేశం కఠోరంగా సాగిందని కరిష్మా కపూర్ అన్నారు. రాజా హిందుస్థానీ మూవీలో ఈ జంట కిస్సింగ్ సన్నివేశంలో నటించారు. అమీర్-కరిష్మా పై ముద్దు సన్నివేశం చిత్రీకరించేందుకు ఏకంగా మూడు రోజుల సమయం తీసుకున్నారట. రాజా హిందూస్థానీ చిత్రానికి ధర్మేష్ దర్శన్ దర్శకుడు. మూడు దశాబ్దాల కెరీర్లో ఈ దర్శకుడు చేసింది కేవలం 7 సినిమాలు మాత్రమే. 

36

దర్శన్ పర్ఫెక్షన్ కోసం నటులకు చుక్కలు చూపించేవాడట. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ తాను అనుకున్నట్లు సీన్ వచ్చే వరకు టేక్స్ చేయిస్తూనే ఉంటాడట. దర్శన్ రెండో చిత్రం రాజా హిందూస్థానీ. అమీర్ ఖాన్-కరిష్మా కపూర్ జంటగా నటించారు. ఈ మూవీలో అమీర్ ఖాన్-కరిష్మా కపూర్ మధ్య ఓ ఘాటైన లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది. ఈ రొమాంటిక్ సీన్ చిత్రీకరణ ఒక పట్టాన పూర్తి కాలేదట. 

 

46

ఈ లిప్ లాక్ సన్నివేశం చిత్రీకరణ కోసం అమిర్ ఖాన్ ఏకంగా 47 టేకులు తీసుకున్నాడట. మూడు రోజుల పాటు షూట్ చేయాల్సి వచ్చిందట. కరిష్మా కపూర్ తల్లి కూడా ఆ సెట్స్ లో ఉందట. ఈ ముద్దు సన్నివేశం పై అనంతరం కరిష్మా కపూర్ స్పందించింది. అది ఒక చేదు అనుభవని ఆమె అన్నారు. ఆ సన్నివేశం చిత్రీకరిస్తున్న రోజులు భారంగా గడిచాయని ఆమె అన్నారు. 
 

56

కరిష్మా కపూర్ మాదిరి పలువురు నటులు తమ కో స్టార్స్ తో ముద్దు సన్నివేశంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మర్డర్ మూవీలో ఇమ్రాన్ హష్మీ-మల్లికా శెరావత్ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. ముద్దు సన్నివేశాలకు బ్రాండ్ అంబాసిడరైన ఇమ్రాన్ హష్మీ హీరోయిన్ మల్లికా శెరావత్ తో ఆన్ స్క్రీన్ కిస్సింగ్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. 

రంగూన్ మూవీలో షాహిద్ కపూర్-కంగనా రనౌత్ జంటగా నటించారు. ఓ లిప్ లాక్ సన్నివేశంలో నటించారు.  షాహిద్ తో ఆ సన్నివేశం చేయడం అసహ్యంగా అనిపించిందని కంగనా రనౌత్ అన్నారు. లవ్ అగైన్ మూవీలో భర్త నిక్ జోనాస్ ని ప్రియాంక చోప్రా కిస్ చేశారు. అయితే నిక్ జోనాస్ ని ఆన్ స్క్రీన్ కిస్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించిందని ప్రియాంక చోప్రా చెప్పారు. 

66

హీరోయిన్ మాధురి దీక్షిత్ దయావన్ మూవీలో హీరో వినోద్ ఖన్నాతో కిస్సింగ్ సన్నివేశం చేసింది. అందుకు చాలా బాధపడుతున్నట్లు ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. బ్రేక్ కే బాద్ మూవీలో ఇమ్రాన్ ఖాన్-దీపికా పదుకొనె జంటగా నటించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనెతో కిస్సింగ్ సన్నివేశం చేయడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. 

కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపిన రన్బీర్ కపూర్-కత్రినా కైఫ్ తర్వాత బ్రేకప్ అయ్యారు. అనంతరం జగ్గా జాసూస్ టైటిల్ తో ఒక చిత్రం చేశారు. ఈ మూవీలో కత్రినాతో లిప్ లాక్ సన్నివేశం ఉంచగా... రన్బీర్ కపూర్ బుగ్గ మీద ముద్దు పెట్టి సరిపెట్టాడట. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా, అలియా భట్ జతకట్టారు. అలియాతో లిప్ లాక్ అనుభవం దారుణం అంటూ సిద్ధార్థ్ మల్హోత్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: సీఈఓగా దీప, జ్యో- కార్తీక్, దీపలను విడదీసిన జ్యో- కాంచన ఆవేశం
Recommended image2
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు.. జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ తో పాటు రొమాంటిక్ వెబ్ సిరీస్ లు రెడీ
Recommended image3
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved