ఆ నటుడి ఇంట్లో మందు బాటిల్స్ కొట్టేసిన త్రివిక్రమ్, దర్శకుడు కాకముందు ఇలాంటి పనులు చేశాడా?
వీడు వస్తే ఇంట్లో నుండి ఏం వస్తువులు పట్టుకుపోతాడో అని త్రివిక్రమ్ విషయంలో ఓ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ భయపడేవాడట. ఆ నటుడి ఇంట్లో నుండి మందు బాటిల్స్ కొట్టేసేవాడట త్రివిక్రమ్..
రచయితగా పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ డైరెక్టర్ అయ్యారు త్రివిక్రమ్ శ్రీనివాస్. స్వయంవరం, చిరునవ్వుతో, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి హిట్ చిత్రాలకు ఆయన రచయితగా పని చేశారు. త్రివిక్రమ్ కి మాటల మాంత్రికుడు అనే బిరుదు ఉంది. ఆయన డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. సీరియస్ డైలాగ్స్ లో జీవిత సారం చెప్పే త్రివిక్రమ్... కామెడీ పంచులు, టైమింగ్ ఓ రేంజ్ లో ఉంటాయి.
నువ్వే నువ్వే మూవీతో త్రివిక్రమ్ దర్శకుడిగా మారారు. రొమాంటిక్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా నువ్వే నువ్వే తెరకెక్కింది. తరుణ్-శ్రియా శరన్ జంటగా నటించారు. చంద్రమోహన్, ప్రకాష్ రాజ్,సునీల్ కీలక రోల్స్ చేశారు. 2002లో విడుదలైన నువ్వే నువ్వే సూపర్ హిట్.
Nuvve Nuvve 20 Years event
హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, రొమాన్స్ తో పాటు.. ఫాదర్, డాటర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యాయి. కామెడీ సైతం ఆకట్టుకుంటుంది. అప్పుడే కెరీర్లో ఎదుగుతున్న శ్రియకు ఈ మూవీ విజయం ప్లస్ అయ్యింది. నువ్వే నువ్వే విడుదలై 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గతంలో ఒక సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రియా, తరుణ్, ప్రకాష్ రాజ్, త్రివిక్రమ్ పాల్గొన్నారు.
Nuvve Nuvve 20 Years event
త్రివిక్రమ్ మాట్లాడుతూ... ప్రకాష్ రాజ్ తో పనిచేయడం చాలా మంది కష్టం అంటారు. కానీ నాకు మాత్రం కాదు. ఆయనంటే అందరికీ భయం. కానీ నేనంటే ఆయనకు భయం. డైరెక్టర్ ని కాక ముందు నుంచే ప్రకాష్ రాజ్ తో పరిచయం ఉంది. అర్ధరాత్రి ఆయన ఇంటికి వెళ్లి తలుపు తట్టి, ఏమైనా ఉందా... తినడానికని అడిగి, తినేసేవాళ్ళం. ఆయన ఇంట్లో ఉన్న మందు బాటిల్స్ కొట్టేసేవాళ్ళం.
Nuvve Nuvve 20 Years event
వీడు వచ్చాడంటే ఇంట్లో నుండి ఏం పట్టుకుపోతాడో అని ప్రకాష్ రాజ్ భయపడేవాడు. నేను, సునీల్ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాం. మమ్మల్ని మాత్రం భరించేవాడు. ఓకే... పల్లెటూళ్ల నుండి వచ్చారు. భవిష్యత్ లో ఏదో ఒకటి అవుతారులే అని అనుకునేవాడేమో. ప్రకాష్ రాజ్ ని ఎందుకు బ్యాన్ చేశారో తెలియదు. ఒక సీన్ లేదా డైలాగ్ విషయంలో మేము గొడవపడిన సందర్భం లేదు, అన్నారు. త్రివిక్రమ్ మాటలు విన్నాక.. కోట్లు సంపాదించిన త్రివిక్రమ్ ఒకప్పటి జీవితం ఇదా.. అని ఆయన ఫ్యాన్స్ వాపోతున్నారు.
Suni and Trivikram Srinivas
సునీల్, త్రివిక్రమ్ ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటూ సినిమా ప్రయత్నాలు చేసేవారట. తిండికి కూడా ఇబ్బంది పడుతూ, ఉన్న కొంచెం డబ్బులు జాగ్రత్తగా ఖర్చు చేసేవారట. ఆ ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి ఉండేదట. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు రూ. 20-30 కోట్లు తీసుకుంటాడు. ఆయనకు బడా నిర్మాణ సంస్థల్లో వాటాలు ఉన్నాయి. అటు సునీల్ సైతం నటుడిగా సెటిల్ అయ్యాడు.