చిరంజీవి రిజెక్ట్ చేస్తే బాలయ్య బ్లాక్ బస్టర్ కొట్టాడు... 600 రోజులు ఆడిన ఆ సినిమా ఏంటో తెలుసా?
చిరంజీవి, బాలకృష్ణ హీరోలుగా ఎదుగుతున్న రోజుల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిరంజీవి రిజెక్ట్ చేసిన ఓ కథను బాలకృష్ణ అంగీకరించాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఏకంగా 600 రోజులు ఆడింది.
చిత్ర పరిశ్రమలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. దర్శకులు, రచయితలు ప్రతి కథ ఎవరో ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని రాస్తారు. లేదా ఆల్రెడీ రాసిన కథకు ఫలానా హీరో అయితే సెట్ అవుతాడని అంచనా వేస్తారు. అయితే దర్శకులు దగ్గర ఉన్న కథకు వారు కోరుకున్న హీరో దొరక్కపోవచ్చు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. కథ నచ్చకపోవచ్చు, డేట్స్ ఖాళీగా ఉండకపోవచ్చు. సదరు దర్శకుడి మీద హీరోకి నమ్మకం లేకపోనూ వచ్చు.
ఈ తరం స్టార్స్ రెండు మూడేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్, చిరంజీవి జనరేషన్ వరకు ఏడాదికి స్టార్ హీరోలు కూడా తక్కువలో తక్కువ పది సినిమాలు చేసేవారు. ఫిల్మ్ మేకింగ్ లో క్వాలిటీ పెరిగాక ఏడాదికి చేసే సినిమా సంఖ్య తగ్గుతూ వచ్చింది. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి ప్రతి సంవత్సరం 10కి పైగా సినిమాలు చేసేవారు. బాలకృష్ణ కూడా దాదాపు ఆరేడు సినిమాలు చేసేవారు.
కాగా చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో బాలకృష్ణ బ్లాక్ బస్టర్ కొట్టారు. 80లలో దర్శకుడు కోడి రామకృష్ణ స్టార్ డైరెక్టర్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ ఆయనతో సినిమాలు చేసేందుకు పోటీ పడేవారు. ఓ కథను చిరంజీవికి కోడిరామకృష్ణ వినిపించాడట. ఎందుకో చిరంజీవికి ఆ కథ అంతగా నచ్చలేదట. ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశాడట.
అదే కథను కోడి రామకృష్ణ బాలకృష్ణకు వినిపించడంతో ఆయన ఓకే చేశాడట. 1984లో విడుదలైన ఆ చిత్రం బ్లాక్ బస్టర్. బాలకృష్ణకు సోలోగా అతిపెద్ద విజయం. ఈ మూవీ ఏకంగా 600 రోజులు ఆడింది. ఆ చిత్రం మంగమ్మ గారి మనవడు. సీనియర్ నటి భానుమతి కీలక రోల్ చేయగా... సుహాసిని హీరోయిన్ గా నటించింది. కేవీ మహదేవన్ ఇచ్చిన సాంగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.
ఈ సినిమా రిజెక్ట్ చేసినందుకు చిరంజీవి ఒకింత బాధపడ్డాడట. కెరీర్లో ఎదుగుతున్న రోజుల్లో అలాంటి చిత్రాన్ని వద్దనుకుని పొరపాటు చేశానని వేదన చెండాదట. అయితే అదే ఏడాది చిరంజీవికి ఛాలెంజ్ రూపంలో హిట్ పడింది. మంగమ్మ గారి మనవడు మూవీ మిస్ అయినా.. ఛాలెంజ్ తో చిరంజీవి కెరీర్ కి బూస్ట్ ఇచ్చే సూపర్ హిట్ కొట్టాడు.
మంగమ్మ గారి మనవడు విజయంతో బాలకృష్ణకు స్టార్ ఇమేజ్ దక్కింది. చిరంజీవికి పోటీగా రేసులోకి దూసుకు వచ్చాడు. అనంతరం కోడి రామకృష్ణ,-బాలకృష్ణ కాంబోలో అనేక సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. వీరిది హిట్ కాంబోగా పేరుగాంచింది.