దేవదాసు వర్సెస్ దేవదాసు, కృష్ణను దారుణంగా దెబ్బ తీసిన ఏఎన్నార్, ఇంతకీ ఏం జరిగింది?
దేవదాసు మూవీకి పోటీగా దేవదాసు విడుదల చేసి కృష్ణను దెబ్బ తీశాడు ఏఎన్నార్. కృష్ణ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అసలు ఈ దేవదాసు వర్సెస్ దేవదాసు ఏంటి? ఇంట్రెస్టింగ్ స్టోరీ..
Devadasu Movie
ప్రపంచంలోని ఆల్ టైం గ్రేట్ లవర్స్ ఎవరంటే.. లైలా-మజ్ను, రోమియో-జూలియట్, పార్వతి-దేవదాసు అంటారు. అయితే పార్వతి, దేవదాసు కేవలం నవలా పాత్రలు మాత్రమే. వాస్తవంగా పార్వతి-దేవదాసు అనే ప్రేమికులు లేరు. బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన నవలే దేవదాస్. ఆ నవల ఆధారంగా పలు భాషల్లో దేవదాసు మూవీ తెరకెక్కింది.
Devadasu Movie
మోడరన్ డేస్ లో షారుక్ ఖాన్-ఐశ్వర్య రాయ్ జంటగా దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ తెరకెక్కించారు. 2002లో విడుదలైన దేవదాస్ బాక్సాఫీస్ హిట్. దాదాపు రూ. 168 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు దేవదాసు చిత్రాన్ని మొదటగా చేశారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ట్రాజిక్ లవ్ డ్రామా భారీ విజయం అందుకుంది.
దేవదాసుగా ఏఎన్నార్, పార్వతిగా సావిత్రి నటించింది. కెరీర్ లో ఎదుగుతున్న రోజుల్లో విడుదలైన దేవదాసు ఏఎన్నార్, సావిత్రిలకు బ్రేక్ ఇచ్చింది. ప్రేక్షకుల్లో ఫేమ్ తెచ్చిపెట్టింది. దేవదాసు చిత్రం కోసం ఏఎన్నార్ ఆహారం మానేశాడట. మద్యానికి బానిసైన భగ్న ప్రేమికుడిగా కనిపించడం కోసం ఏఎన్నార్ బరువు తగ్గారని సమాచారం.
Devadasu Movie
ఓ 20 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ దేవదాసు చిత్రాన్ని కలర్ లో నిర్మించాలి అనుకున్నారు. అది రిస్క్ తో కూడిన వ్యవహారం. ఏఎన్నార్-సావిత్రిల దేవదాసు టాలీవుడ్ క్లాసిక్ గా నిలిచిపోయింది. దేవదాసు చిత్రాన్ని మరలా నిర్మించడం సరైన నిర్ణయం కాదని కృష్ణకు సన్నిహితులు సలహా ఇచ్చారట. రిస్క్స్ చేయడానికి ఎప్పుడు ముందుండే కృష్ణ వినలేదట. ఏఎన్నార్ దేవదాసు 1953లో వచ్చింది. ఈ ఇరవై ఏళ్లలో సాంకేతికంగా సినిమా చాలా అభివృద్ధి చెందింది. ఈ జనరేషన్ ఆడియన్స్ కి దేవదాసును సరికొత్తగా అందించుదామని కృష్ణ అన్నారట.
కృష్ణ మొండిగా ముందుకు వెళ్లారట. భార్య విజయనిర్మల దేవదాసు చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. రమేష్ నాయుడు సంగీతం అందించారు. ఎస్పీ బాలు పాటలు పాడారు. కృష్ణ-విజయనిర్మల.. దేవదాసు-పార్వతి పాత్రలు చేశారు. 1974 డిసెంబర్ 6న దేవదాసు చిత్రాన్ని విడుదల చేశారు. మూవీకి మిక్స్డ్ టాక్. నిడివి ఎక్కువైంది అనేది ప్రధాన విమర్శ. రెండు సార్లు ట్రిమ్ చేశారట. నిడివి తగ్గించాక కొంచెం బాగుందని ప్రేక్షకులు భావించారట.
Devadasu Movie
వీటన్నింటికీ మించి... ఏఎన్నార్ చేసిన పని దేవదాసు(1974)ను దెబ్బతీసిందట. దేవదాసు(1953) మూవీ హక్కులు కొన్న నాగేశ్వరరావు అదే రోజున దేవదాసు రీరిలీజ్ చేశాడట. అంటే ఏఎన్నార్ దేవదాసు-కృష్ణ దేవదాసు బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయి. కృష్ణ దేవదాసు ఆడుతున్న థియేటర్ పక్కనే ఏఎన్నార్ దేవదాసు కూడా ప్రదర్శించారట. అందుకు కృష్ణ ఏమీ బాధపడలేదట. కృష్ణ దేవదాసు మాత్రం ఆడలేదట.
Devadasu Movie
ఇక ఏఎన్నార్ దేవదాసు రీరిలీజ్ కాబట్టి ఫలితంతో సంబంధం లేదు. ఆ విధంగా కృష్ణను ఏఎన్నార్ అప్పట్లో దెబ్బ తీశాడట. అయితే ఏఎన్నార్ బ్లాక్ బస్టర్ మూవీ స్పూర్తితో ఓ మూవీ చేసిన కృష్ణ బ్లాక్ బస్టర్ అందుకున్నారట. ఏఎన్నార్ దసరా బుల్లోడు మంచి విజయం సాధించింది. మహిళా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరించారట. ఆ తరహా మూవీ కృష్ణ కూడా చేయాలని భావించారట. మనం కూడా మహిళా ప్రేక్షకులకు చేరువయ్యే కథతో సినిమా చేయాలని అనుకున్నారట.
Devadasu Movie
అదే పండంటి కాపురం. ఈ మూవీకి సహనిర్మాత గా కూడా ఉన్న కృష్ణ ఆ రోజుల్లో రిస్క్ చేసి రూ. 12 లక్షలు పైగా బడ్జెట్ తో పండంటి కాపురం తెరకెక్కించారట. పండంటి కాపురం గొప్ప విజయం అందుకుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి