మహేష్ బాబు ఏ విషయంలో భయపడతారో తెలుసా..? సూపర్ స్టార్ నే భయపెట్టేది ఎవరు..?
సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ సీన్స్ అంటే ఫ్యాన్స్ పడిచస్తుంటారు. ఆయన అంటే రౌండీలు భయపడుతుంటారు. కాని మహేష్ బాబు కూడా ఓ భిషయంలో భయపడతారని మీకు తెలుసా...?
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు మూడు రకాల లుక్ టెస్ట్ జరిగాయట మహేష్ కు. అయితే ఫైనల్ లుక్ మాత్రం ఇంత వరకూ కన్ ఫార్మ్ కాలేదు. త్వరలో ఈమూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.
Mahesh Babu
జనవరి 2025 లో ఈ సినిమా స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న ఈసినిమా మొదటి పార్ట్ ను 2027 లో రెండో పార్ట్ ను 2029 లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
దాదాపు 12 00 కోట్ల బడ్జెట్ తో ఈ భారీ యాక్షన్, అడ్వెంచర్ మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. అయితే సినిమా స్టార్ట్ అయితే కాని ఇందులో నిజాలు ఏంటీ అనేది తెలియవు. ఇప్పటికే మహేష్ బాబు లుక్స్ కూడా ఫైనల్ అయినట్టు సమాచారం.
మహేష్ బాబు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.మహేష్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ గా ఎదరు చూస్తూ ఉన్నారు. ఇక త్వరలో ఈ మూవీషూటింగ్ కు రెడీ అవుతున్నారు. కాగా మహేష్ బాబు నుంచి సినిమా రావడానికి ఇంకా మూడు నాలుగేళ్ళు పట్టవచ్చు అని తెలియడంతో ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. అయితే మహేష్ బాబు వరల్డ్ స్టార్ అవ్వబోతున్నాడు అని తెలియడంతో దిల్ ఖుష్ అవుతున్నారు.
Mahesh Babu
ఈక్రమంలో మహేష్ బాబుకు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టార్ హీరోగా ఎన్నో అడ్వెంచర్లు చేసి ఉంటాడు..అయితే ఆయన ఏ విషయంలో.. భయపడతారో మీకు తెలుసా..?
సోషల్ మీడియా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఓ విషయంలో కాస్త వెనకడుకు వేస్తారట. అదేదో కాదు.. వాటర్. అవును వాటర్ కు సబంధించి మహేష్ లో ఓ చిన్న భయం ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
బాగా ఎత్తైన జలపాతాలు.. నిండు గా ఉన్న సరస్సులు, నదులు.. ఇలా నీటికి సబంధించి మహేష్ బాబుకు భయం ఉందని. అందుకే ఎక్కువగా అలాంటి ప్రాంతాల్లో షూటింగ్ పెట్టుకోవద్దు అని దర్శకులకు మహేష్ చెపుతాడు అని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. చాలామంది ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. ఇటువంటి ప్రచారాల్లో ఏ నిజం లేదు అంటున్నారు.
మహేష్ బాబు ఇప్పటికే నీటికి సబంధించి చాలా సన్నివేశాలు చేశారు. నీళ్ళల్లో డాన్స్ లు కూడా వేసిన పాటలు ఉన్నాయి. అంతే కాదు ఆయన ఇంట్లో కూడా పెద్ద స్విమ్మింగ్ ఫూల్ ఉండటం.. అందులో తన పిల్లలతో కలిసి ఆయన ఈత కొట్టడం కూడా అందరికి తెలిసిందే. మరి అలాంటప్పుడు ఇలా మహేష్ కు ఎందుకు నీరు అంటే ఫోబియా ఉంటుంది అని తిట్టిపోస్తున్నారు. నిజానిజాలేంటో మహేష్ కే తెలియాలి మరి.