సాయి పల్లవి రహస్య వివాహం చేసుకుందా?... ఆ డైరెక్టర్ సోషల్ మీడియా పోస్ట్ తో క్లారిటీ!
రెండు రోజులుగా సాయి పల్లవి వివాహం చేసుకున్నారంటూ ఓ ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటోపై దర్శకుడు వేణు ఉడుగుల వివరణ ఇచ్చారు.
Sai Pallavi
చేసింది తక్కువ చిత్రాలే అయినా సాయి పల్లవి క్రేజ్ వేరు. హీరోయిన్ గా కంటే వ్యక్తిగా ఆమెను అభిమానించేవారు ఎక్కువ. ఈ జనరేషన్లో అరుదైన హీరోయిన్. తమిళ్ కంటే తెలుగులో ఆమెకు ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. ఫిదా, ఎంసీఏ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.
actress Sai Pallavi
ఇటీవల సాయి పల్లవి సినిమాలు తగ్గించారు. విరాటపర్వం అనంతరం సాయి పల్లవి తెలుగులో సినిమా చేయలేదు. అటు తమిళ్ లో కూడా కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించలేదు. దీంతో పలు పుకార్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా సాయి పల్లవి వివాహం చేసుకోబోతున్నారు. అందుకే సినిమాలు వదిలేశారని కథనాలు వెలువడ్డాయి.
actress Sai Pallavi
అలాగే డాక్టర్ చదివిన సాయి పల్లవి హాస్పిటల్ ఓపెన్ చేసి వైద్య వృత్తిలో కొనసాగాలని అనుకుంటున్తున్నారని మరో వాదన తెరపైకి వచ్చింది. అయితే మంచి సబ్జక్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాను. అందుకే ఆలస్యం అవుతుంది. సాయి పల్లవి అంటే ప్రేక్షకులు వాళ్ళ ఇంట్లో అమ్మాయి అనుకుంటారు. వారు గర్వపడే సినిమాలు చేయాలి అన్నారు.
sai pallavi
అనూహ్యంగా సాయి పల్లవికి పెళ్ళై పోయిందంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెడలో దండతో ఓ వ్యక్తి పక్కన సాయి పల్లవి నిల్చుని ఉన్నారు. ఎవరికీ తెలియకుండా సాయి పల్లవి రహస్య వివాహం చేసుకున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ న్యూస్ దర్శకుడు వేణు ఉడుగుల దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే స్పందించారు.
Photo Courtesy: Instagram
వైరల్ అవుతున్న ఫోటో ఒరిజినల్ షేర్ చేసిన వేణు ఉడుగల వివరణ ఇచ్చారు. శివ కార్తికేయన్ కి జంటగా సాయి పల్లవి నటిస్తున్న చిత్రం పూజా కార్యక్రమం రోజు తీసిన ఫోటో అది అని కామెంట్ చేశాడు. సాయి పల్లవి వివాహం చేసుకున్నారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. వేణు ఉడుగుల పోస్ట్ తో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
actress Sai Pallavi
విరాటపర్వం చిత్రానికి వేణు ఉడుగుల దర్శకుడన్న విషయం తెలిసిందే. రానా, సాయి పల్లవి జంటగా నటించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన విరాటపర్వం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులు మంచి సినిమాగా కొనియాడారు.
తాజాగా నాగ చైతన్యకు జంటగా భారీ పాన్ ఇండియా చిత్రానికి సాయి పల్లవి సైన్ చేసింది. చందూ మొండేటి దర్శకుడు కాగా అల్లు అరవింద్ నిర్మాత. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. గతంలో నాగ చైతన్య-సాయి పల్లవి కాంబోలో లవ్ స్టోరీ తెరకెక్కింది. ఈ మూవీ సూపర్ హిట్.