తెలుగు సినిమాతోనే వహిదా రెహమాన్ ఎంట్రీ.. బాలీవుడ్ ను ఏలిన తార, కదలివచ్చిన అవార్డ్ లెన్నో.. `
బాలీవుడ్ సీనియర్ తార వహీదా రెహ్మాన్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రేక్షకుల మనసులను గెలిచిన సీనియర్ నటిని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం, ఆమె సినిమాలు, అవార్డ్ లు సంగతులు చూస్తే.
Dadasaheb Phalke Award 2023 for veteran actress Waheeda Rehman nsn
టాలీవుడ్ లో ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసి.. బాలీవుడ్ చేరిన తార వహీదా రెహ్మాన్. హైదరాబాద్ ముస్లీం కుటుంబంలో జన్మించారని అంటుంటారు.వహీదా తన నటనతో.. డాన్స్ తో కొన్నేళ్ళ పాటు బాలీవుడ్ ను ఏలింది. వరుస సినిమాలతో.. వరుస సక్సెస్ లతో స్టార్ ఇమేజ్ ను సాధించింది. ఎన్నో అవార్డ్ లు సాధించి ఆ అవార్డ్ లకే వన్నే తెచ్చిన వహీదాను తాజాగా దాదాసాహెబ్ అవార్డ్ తో సత్కరించబోతోంది కేంద్ర ప్రభుత్వం.
ఏరువాక సాగారో అన్నో చిన్నన్నాఅంటూ.. ఓచిన్నది చేసిన డాన్స్ ఇప్పటికీ చాలా మందికి తెలుసు. ఆ పాటలో అద్భుతమైన డాన్స్ పెర్ఫామెన్స్ చేసిన ఆమె ఎవరో కాదు వహీదా రెహ్మాన్. 1955లో అక్కినేని నాగేశ్వరావు హీరోగా వచ్చిన రోజులు మారాయి తెలుగు సినిమాలో.. ఈ పాటతో తెరంగేట్రం చేసింది వహీదా రెహ్మాన్. రోజులు మారాయి, జయసింహల తర్వాత ఎమ్జీఆర్, భానుమతి నటించిన ఆలీబాబా 40 దొంగలు లోనూ ఓ పాటకు డాన్స్ చేసింది వహీదా.
రోజులు మారాయి తరువాత చాలా కాలానికి అక్కినేని నటించిన బంగారు కలలు సినిమాలో ఆయనకు సోదరిగా నటించారు వహిదా. ఆ తరువాత 1986లో కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన సింహాసనంలో రాజమాతగా కనిపించారు. 2006లో సిద్ధార్థ్ హీరోగా రూపొందిన చుక్కల్లో చంద్రుడు సినిమాల్లో కనిపించి అలరించారు వహీదా రెహమాన్ .
వహీదా రెహమాన్ తెలుగావిడి అనుకుంటారు అంతా. కాని అది నిజం కాదు. ఆమె అచ్చమైన తమిళముస్లిమ్ కుటుంబానికి చెందిన . ఆమె తండ్రి మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ఉద్యోగరీత్యా ఆంధ్రలో చాలాకాలం గడిపారు. అలా వహీదా రోజులు మారాయి, జయసింహ’సినిమాలు విడుదలైనప్పుడు ఆయన విజయవాడలో మునిసిపల్ కమీషనర్‌గా పనిచేస్తున్నారు. వహీదా చదివింది కూడా ఇక్కడే కాబట్టి ఆమెకు తెలుగు మాట్లాడటం బాగా తెలుసు.
ముస్లీమ్ కుటుంబంలో జన్మించినా.. ఆమె చిన్నప్పుడే శాస్త్రీయ నృత్యం కూడా నేర్చుకున్నారు. ఎన్నో సినిమాలకు తన నాట్యంతో ప్రాణం పోశారు వహీదా. ఇక సౌత్ లో సినిమాలు చేసుకుంటూ ఉన్న వహీదాను బాలీవుడ్ కు తీసుకెళ్లింది మాత్రం వహీదాను పరిచయం చేసింది మాత్రం గురుదత్. సీఐడీ సినిమాతో గురుదత్ వహీదా హిందీ సినిమాకు పరిచయం చేశారు. అయితే ఈసినిమా డైరెక్షన్ మాత్రం తన న శిష్యుడు రాజ్ ఖోస్లాకు అప్పగించారు.
ఈసినిమాతోనే గురుదత్ తో ప్రేమలో పడ్డారు వహీదా. అంతే కాదు ఈమూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. ఆమెకు కాస్ట్లీ కారు కూడా ఇచ్చాడట గురుదత్. ఈసినిమా వహీదా రెహ్మాన్ కెరీర్ ను మార్చేసింది. ఆమె ఇంటికి మేకర్స్ క్యూ కట్టారు. ఆమెను వేషాలు వెతుక్కుంటూ వచ్చాయి..1971లో వచ్చిన రేష్మా ఔర్ షేరా సినిమాకుగాను ఆమెకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు కూడా సాధించారు. ఇక 1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలు వహీదాను వరిచాయి.
ఇవే కాదు.. 1966 లో పిలింఫేర్ ఉత్తమనటి 1968 లో నీల్ కమల్ సినిమాకు ఫిలింఫేర్ .1967 లో బెంగాలీ జర్నలిష్టు అసోసియేషన్ అవార్డు, 1994 లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 2012 లో ముంబయి ఫిల్ం ఫెస్టివల్ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు 2013 లో సెంటెనరీ అవార్డు , 2013 లో ఇండియన్ ఫిలిం పెర్సనాలిటీ అవార్డ్ లు కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.
అంతే కాదు వహీదా రెహ్మాన్ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిష్టాత్మకంగా ఫీల్ అయ్యే ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని కూడా 2006లో అందుకున్నారు. ఇక డైరెక్టర్ గురుదత్ ను ఎంతగానో ప్రేమించింది వహీదా. కాని ఆయనకు అంతకు ముందే పెళ్ళి జరగడం.. చిన్నవయస్సులోనే ఆయన హఠాత్తుగా మరణించడంతో తనతో షగున్‌లో హీరోగా నటించిన కమల్ జీత్ ను 1974లో వివాహమాడారు వహిదా రెహమాన్. వారికి ఇద్దరు పిల్లలు.
ఇక ఆర్టిస్ట్ గా ఆమె గొప్పతనం గురించి చాలా చెప్పవచ్చు.. సినిమా చేయడానికి ముంబయ్ నుంచి హైదరాబాద్ వస్తే.. స్టార్ హోటల్స్ లో బస చేయడానికి ఇష్టపడేవారు కాదు.నిర్మాతను కష్టపెట్టడం ఆమెకు ఇష్టం ఉండదు. తనతో పాటు ఓ సహాయకుడు తప్పించి ఎవరూ వచ్చేవారు కాదట. అంతే కాదు.. తన కాస్ట్యూమ్స్ కూడా ముంబయ్ నుంచి తెచ్చుకునేవారట. అలా తన సింప్లిసిటీతో పాటు..నటన పట్ల తన గౌరవాన్ని చాలా సందర్భాల్లో చాటుకున్నారు వహీదా రెహ్మాన్. అందుకే ఆమె దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కు అర్హురాలు అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.