MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలయ్య సినిమా ఎఫెక్ట్.. అందుకు మేము పనికిరామా అంటూ ఏడ్చేసిన హీరోయిన్, సారీ చెప్పిన వివి వినాయక్ 

బాలయ్య సినిమా ఎఫెక్ట్.. అందుకు మేము పనికిరామా అంటూ ఏడ్చేసిన హీరోయిన్, సారీ చెప్పిన వివి వినాయక్ 

డైరెక్టర్ వివి వినాయక్ మాస్ చిత్రాల దర్శకుడిగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలందరినీ డైరెక్ట్ చేసిన ఘనత వినాయక్ సొంతం.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 11 2022, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డైరెక్టర్ వివి వినాయక్ మాస్ చిత్రాల దర్శకుడిగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలందరినీ డైరెక్ట్ చేసిన ఘనత వినాయక్ సొంతం. వినాయక్ బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన చెన్నకేశవరెడ్డి నిరాశపరిచింది. కానీ ఆ చిత్రాన్ని ఇప్పటికి మాస్ ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా ఇంటర్వ్యూలో వినాయక్ ఈ చిత్రానికి సంబంధించిన ఎవరికీ తెలియని విశేషాలు రివీల్ చేశారు. బాలకృష్ణ ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేశారు. తండ్రి పాత్రలో బాలయ్యకి జోడిగా టబు.. కొడుకు పాత్రలో బాలయ్యకి హీరోయిన్ గా శ్రీయ నటించారు. బాలయ్య చెల్లి పాత్రలో 'సుస్వాగతం' ఫేమ్ దేవయాని నటించింది. హీరోయిన్ల విషయంలో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నట్లు వినాయక్ వివరించారు. 

36

టబు ప్లేస్ లో మొదటగా అనుకుంది దివంగత నటి సౌందర్యని. కొన్ని సన్నివేశాల్లో ఓల్డ్ గెటప్ లో నటించాల్సి ఉంటుంది. దీనితో సౌందర్య తనకి ఇప్పుడే ఓల్డ్ పాత్రలు వద్దని రిజెక్ట్ చేసినట్లు వినాయక్ తెలిపారు. బాలయ్య చెల్లిగా దేవయాని కంటే ముందు హీరోయిన్ లయని సంప్రదించారట. 

46

బాలయ్యకి చెల్లిగా నటించాలి అని అడగగానే లయ ఏడ్చేసిందట. తెలుగు అమ్మాయిలు హీరోయిన్ పాత్రలకు పనికి రారా అంటూ వినాయక్ ని ముఖం మీదే అడిగేసి కన్నీరు పెట్టుకుందట. మమ్మల్ని చెల్లి పాత్రల కోసమే ఎందుకు అడుగుతారు అని ప్రశ్నించింది. బాలయ్య చెల్లిగా అమాయకంగా నటించాలి. అందుకు మీరు సరిపోతారని అడిగినట్లు వినాయక్ ఆమెకి చెప్పారు. 

56

కానీ లయ మాత్రం మమ్మల్ని ఎందుకు అలా చూస్తారు.. హీరోయిన్ గా ఎందుకు చూడరు అని ప్రశ్నించింది. దీనితో ఆమెకి సారీ చెప్పి అక్కడి నుంచి వచ్చేసినట్లు వినాయక్ అన్నారు. ఆ తర్వాత దేవయానిని అదే రోల్ కి ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్ పాత్రలు ఎంపిక చేయడం చాలా సులభం. కానీ తల్లి, చెల్లి పాత్రలని సెలెక్ట్ చేయడమే కష్టం అని వినాయక్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత లయ బాలయ్యకి హీరోయిన్ గా విజయేంద్ర వర్మ చిత్రంలో నటించింది. 

66

ప్రస్తుతం వివి వినాయక్.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో ఛత్రపతి చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. మరోసారి బాలకృష్ణని డైరెక్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా కూడా వినాయక్ గతంలో తెలిపారు. అదే కనుక జరిగితే క్రేజీ కాంబినేషన్ అవుతుంది అనడంలో సందేహం లేదు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: రాంచరణ్ పెద్ది, రకుల్ రొమాంటిక్ మూవీతో పాటు ఈ వారం ఓటీటీలో మరిన్ని సినిమాలు.. పండగే పండగ
Recommended image2
Rao Bahadur 3 Day Collections: రావు బహదూర్‌కి బాక్సాఫీసు షాక్‌.. సత్యదేవ్‌ మూవీ షెడ్డుకెళ్లిందా.. 3 రోజుల కలెక్షన్లు
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోకు తిట్లు-శివన్నారాయణకు పోటీగా దక్షిణమూర్తి-సూరజ్ కు చెంప దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved