- Home
- Entertainment
- 'రాత్రంతా తాగి తెల్లవారి నేనే దేవుణ్ని అంటే నమ్మరు'.. ప్రభాస్ పై డైరక్టర్ షాకింగ్ కామెంట్స్
'రాత్రంతా తాగి తెల్లవారి నేనే దేవుణ్ని అంటే నమ్మరు'.. ప్రభాస్ పై డైరక్టర్ షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు. బాలీవుడ్ నటి కృతి సనన్ జానకి ( సీత) పాత్రను పోషించింది. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించాడు.

రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్’.భారీ అంచనాల నడుమ విడుదల అయ్యిన ఈ చిత్రం తొలి షో నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మొత్తం చెప్పాలంటే ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించలేదని చెప్పుకోవచ్చు. భాక్సాఫీస్ పరంగానూ సినిమా వర్కవుట్ కాలేదు. సినిమాపై మొదటి నుంచి ఉన్న భారీ అంచనాలను అందుకోవడం ఈ సినిమా విఫలం అయ్యింది.
ప్రధానంగా పేలవమైన VFX, చవకైన డైలాగ్‌లు, రామాయణం ఇస్లాంమీకరణ సహా పలువు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అవన్నీఇప్పుడిప్పుడే జనం మర్చిపోతున్నారు. అయితే ఊహించని విధంగా కాశ్మీరీ ఫైల్స్ డైరక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాని, అందులో నటించిన ప్రభాస్ ని టార్గెట్ చేసారు.
‘ఆదిపురుష్’ మూవీ రిలీజ్ తర్వాత ప్రభాస్ అసలు నటుడే కాదంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. మరోసారి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతకు ముందు అసలు ప్రభాస్‌ను నటుడే కాదని పేర్కొన్న వివేక్.. ఆదిపురుష్‌ను ఒక నాన్సెన్స్ మూవీగా పేర్కొననారు. ఈ విషయం సద్ధుమణగక ముందే మరోసారి ప్రభాస్, ఆదిపురుష్‌పై ఇన్‌డైరెక్ట్ ఎటాక్ చేస్తూ రెచ్చిపోయారు అగ్నిహోత్రి.
Etimes తో అగ్నిహోత్రి మాట్లాడుతూ... చూసే జనం అంత ఇడియట్స్ కాదంటూ ఆయన ఈ సినిమాని,పనిలో పనిగా ప్రభాస్ ని దారుణంగా టార్గెట్ చేసారు. ప్రజలు విశ్వాసం పెంచుకున్న కథల విషయంలో ఫిలిం మేకర్స్ తప్పు చేస్తున్నారు. ఇలాంటి కథలను రూపొందిస్తున్నప్పుడు ముందుగా మేకర్స్ అందరికీ దానిపై 100% విశ్వాసం ఉండాలి. లేదంటే ఫలితం శూన్యం అని చెప్పుకొచ్చారు.
మహాభారతం లేదా రామాయణం వంటి సినిమాల కోసం స్టార్ హీరోలను ఎంచుకుంటే ఫలితం ఉండదు. మేకర్స్ ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయగలిగినా చివరికి ‘ఆదిపురుష్’ లాంటి ఫలితాన్నే చవిచూస్తారని తెలిపారు వివేక్. ఒక కథ ఐదు వేల సంవత్సరాలుగా కొనసాగుతుందంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది.
కాబట్టి ఎవరైనా అలాంటి కథల్లో దేవుడిగా నటించినంత మాత్రాన అది వాళ్లను దేవుళ్లుగా చేయదు. ప్రతి రోజూ రాత్రంతా తాగి తెల్లవారి నేనే దేవుణ్ని అంటే ఎవరూ నమ్మరు. ప్రజలు మూర్ఖులు కాదు’ అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. ఈ కామెంట్స్ ప్రభాస్‌ను ఉద్దేశించే వివేక్ అగ్నిహోత్రి చేశారని అందరికీ అర్దమైంది.
తాము తీసింది రామాయణం కాదని, రామయణం స్ఫూర్తిగా తీసుకుని రూపొందించామని ‘ఆదిపురుష్’పై రచయిత మనోజ్ తెలిపారు. “’ఆదిపురుష్’ సినిమాను రామాయణం అని మేము చెప్పలేదు. రామాయణంగా తీయలేదు. కేవలం, మేము రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించాం. ఈ విషయాన్ని మేము సినిమా డిస్ క్లైమర్ లో కూడా వేశాం.
రామాయణంలో జరిగే ఒక భాగాన్ని ఆధారంగా తీసుకుని ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కించాం. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పాం. మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న మార్కెట్ కు అనుగుణంగానే ఈ సినిమాను తీశాం. అంతేకానీ, మేం తీసింది సంపూర్ణ రామాయణం కాదు. ఈ విషయాన్ని ప్రేక్షకులు గుర్తుంచుకోవాలి” అని వివరించారు.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టి-సిరీస్ నిర్మించింది. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది, భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ చిత్రంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు. బాలీవుడ్ నటి కృతి సనన్ జానకి ( సీత) పాత్రను పోషించింది. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించాడు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటించాడు.
ఈ చిత్రం 2020లో ప్రకటించినప్పటి నుండి భారీ హైప్‌ని క్రియేట్ చేసింది. తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది.
‘ఆదిపురుష్’ చిత్రానికి IMDb దారుణమైన రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా 3.8/10 రేటింగ్ పొందింది. ఇటీవల కాలంలో డిజాస్టర్లుగా మిగిలిన చిత్రాల కంటే ‘ఆదిపురుష్’ మూవీ రేటింగ్ దారుణంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అక్షయ్ కుమార్ ఫ్లాప్ చిత్రం ‘సెల్ఫీ’కి 5.9, రణబీర్ కపూర్ ‘షంషేరా’కు 4.8 రేటింగ్ ఉంది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కూడా 5.6 రేటింగ్ పొందింది. కానీ ‘ఆదిపురుష్ చిత్రం 10 పాయింట్లకు గాను కేవలం 3.8 పాయింట్లు సాధించడం ఆశ్చర్యకరమనే చెప్పాలి.