Guppedantha Manasu: తనకి పెళ్లయిందని చెప్పి షాకిచ్చిన రిషి.. ఫణీంద్రకి డెడ్ లైన్ పెట్టిన ఎమ్మెస్సార్!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఇబ్బంది పడుతున్న ఒక లెక్చరర్ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో రిషి గురించి తెలుసుకోవలసిన నిజాలు చాలా ఉన్నాయి అంటూ ఇంకా ఏదో చెప్పబోతాడు మహేంద్ర. సార్ చెప్పవలసింది మీరు కాదు నేను. నిజం చెప్పి నా గుండె బరువు దించుకొనివ్వండి అంటాడు రిషి. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు ఏమీ అర్థం కావడం లేదు రిషి. ఏమైనా చెప్పాల్సింది ఉంటే తర్వాత చెబుదువుగాని, ముందైతే ముహూర్తం పెట్టుకుందాం.
పంతులు గారిని వెనక పిలిపించమంటావా అంటాడు విశ్వనాథం. వద్దు సార్ నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తాడు రిషి. ఒక్కసారిగా విశ్వనాథం ఏంజెల్ ఇద్దరు షాక్ అవుతారు. నువ్వు ఒప్పుకున్నాకే కదా ఈ ముహూర్తాలు పెట్టించాలనుకున్నది అంటాడు విశ్వనాథం. నేను ఒప్పుకోలేదు సార్ మీరు అలా అనుకున్నారు. ముందు రోజు రాత్రి కూడా నేను మీకు నిజం చెప్పాను.
కానీ మీరు పడుకుండిపోయారు. తర్వాత రోజు కూడా నేను మాట్లాడుతూ ఉండగానే పెళ్లికి ఒప్పుకున్నాను అనుకొని కన్ఫర్మేషన్ కి వచ్చేసారు. ఇప్పుడు మీరు బాధపడితే అందుకు నేను బాధ్యుడిని కాదు అంటాడు రిషి. బాధతో కుప్పకూలిపోతాడు విశ్వనాథం. నా మనవరాలిని పెళ్లి చేసుకోవా అంటూ బాధగా అడుగుతాడు. నువ్వేమీ బాధపడకు విశ్వం నేను రిషితో మాట్లాడుతాను అంటూ రిషి దగ్గరికి వెళ్లి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు?
నోరు విడిచి నన్ను పెళ్లి చేసుకో అన్నందుకు నీకు నేను చులకన అయిపోయాను కదా, అయినా పెళ్లి చేసుకో ఎందుకు చేసుకోవు? నాకు కారణం చెప్పి తీరాలి అంటూ గట్టిగా నిలదీస్తుంది ఏంజెల్. మరోవైపు మీటింగ్ లో తన డాక్యుమెంట్స్ ని అందరికీ చూపిస్తాడు ఎమ్మెస్సార్. అది చదివిన బోర్డు మెంబర్స్ షాక్ అవుతారు. కోటి రూపాయల కోసం కాలేజీ మొత్తాన్ని లాక్కుందామనుకుంటున్నారా అంటూ నిలదీస్తారు.
నేనేమీ ఇల్లీగల్ గా ప్రొసీడ్ అవ్వటం లేదు. అంతా లీగల్ గానే ప్రొసీడ్ అవుతున్నాను అంటాడు ఎమ్మెస్సార్. ఏంటి లీగల్, కోటి రూపాయలు కోసం కోట్ల విలువ చేసే కాలేజీని కొట్టేయడమా అంటాడు ఫణీంద్ర. కోటి రూపాయలు అని తేలిగ్గా తీసేయకండి ఆ కోటి రూపాయలు కోసమే మీ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. డీలింగ్ ప్రకారం నేను ఎప్పుడు అడిగితే అప్పుడు కోటి రూపాయలు ఇవ్వాలి.
లేదంటే కాలేజీ నాకు రాసి ఇవ్వాలి అంటాడు ఎమ్మెస్సార్. ఇప్పటికిప్పుడు అంటే ఎలా కుదురుతుంది అంటాడు ఫణీంద్ర. మీకు సాయంత్రం 6:00 వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపు నా డబ్బులు నాకు వచ్చే ఏర్పాట్లు చేయండి అంటాడు ఎమ్మెస్సార్. మరోవైపు మౌనంగా ఉన్న రిషి తో నువ్వు ఎంతసేపని ఇలా మౌనంగా ఉంటావు. ఈరోజు నాకు కారణం తెలిసి తీరాలి. ఎందుకు ఈ పెళ్లి వద్దంటున్నావు పని గట్టిగా నిలదీస్తుంది ఏంజెల్.
తప్పించుకోలేక నాకు పెళ్లయింది, నా భార్య కూడా బ్రతికే ఉంది అంటాడు రిషి. అబద్ధం చెప్పకు అబద్ధం చెప్పి ఈ పెళ్లిని తప్పించాలని చూడకు అంటుంది ఏంజెల్. నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు అంటాడు రిషి. మరి ఇన్నాళ్లు నాకు ఎందుకు చెప్పలేదు. అయినా నీ భార్య ఎవరు ఎక్కడ ఉంది అని మళ్ళీ గట్టిగా ప్రశ్నిస్తుంది. మహేంద్ర వాళ్ళని కూడా అతని భార్య ఎక్కడ ఉందో మీకు తెలుసా అని అడుగుతుంది.
వాళ్లు కూడా ఏమీ మాట్లాడకపోవడంతో నిజం నువ్వే చెప్పాలి రిషి, అసలు నీ భార్య ఏది, నువ్వు తనని వదిలేసావా లేదంటే తనే నిన్ను వదిలేసిందా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.షట్ అప్ ఏంజెల్ ఏంటా పిచ్చి ప్రశ్నలు అంటూ ఏంజెల్ ని కోప్పడతాడు రిషి. సీన్ కట్ చేస్తే మీ నిర్ణయం త్వరగా చెప్పండి అంటాడు ఎమ్మెస్సార్. నిర్ణయాలు నేను ఒక్కడినే తీసుకోను. అందరం కలిసి తీసుకుంటాము.
ఏ నిర్ణయం తీసుకోవడానికైనా జగతి రావాలి అంటాడు ఫణీంద్ర. ఇంతలో దేవయాని వచ్చి మన కాలేజీ ఎవరికో అప్పజెప్పాలి అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. కాలేజీ కోసం ఏమైనా చేయాలన్న శైలేంద్ర తపనని అడ్డుపెట్టుకొని ఈ ఎమ్మెస్సార్ మనల్ని మోసం చేశాడు అంటాడు ఫణీంద్ర. ఇప్పుడు ఈ సమస్య నుంచి గట్టు ఎక్కటం ఎలా అంటుంది దేవయాని.
జగతి వస్తుంది ఈ సమస్యని పరిష్కరిస్తుంది తనకి ఆ స్టామినా ఉంది అంటాడు ఫణీంద్ర. అయితే ఆమెని త్వరగా రమ్మనండి అంటూ వెటకారంగా మాట్లాడుతాడు ఎమ్మెస్సార్. జగతికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఫణీంద్ర. తను ఎలాగూ రాలేదు మీరు సైన్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అని మనసులో అనుకుంటాడు ఫణీంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.