Vishwak Sen: నందమూరి కాంపౌండ్ నుంచి మెగా కాంపౌండ్ లోకి..రాజకీయ చరిత్ర చెబుతూ విశ్వక్ సేన్ దిమ్మతిరిగే రిప్లై
Vishwak Sen: విశ్వక్ సేన్ నటించిన 'లైలా' చిత్రం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో విశ్వక్ సేన్ తన చిత్రాన్ని ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు.

Vishwak Sen
Vishwak Sen: విశ్వక్ సేన్ నటించిన 'లైలా' చిత్రం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో విశ్వక్ సేన్ తన చిత్రాన్ని ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. లైలా చిత్రం రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విశ్వక్ సేన్ ఈ మూవీలో లేడీ గెటప్ లో కూడా కనువిందు చేయబోతున్నాడు.

Vishwak Sen
ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో విలేఖరులు విశ్వక్ సేన్ కి ఆసక్తికర ప్రశ్న సంధించారు. మీ సినిమా ఈవెంట్స్ కి నందమూరి హీరోలని తీసుకువస్తారు. కానీ ఇప్పుడు బాస్ ని తీసుకువస్తున్నారు. నందమూరి కాంపౌండ్ నుంచి మెగా కాంపౌండ్ కి షిఫ్ట్ అయ్యారా అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకి విశ్వక్ సేన్ అసహనం వ్యక్తం చేశారు. కాంపౌండ్ లు మీరు వేసుకుంటారు. మాకున్నది ఒకటే కాంపౌండ్. ఇండస్ట్రీలో అన్ని కాంపౌండ్ లు లేవు. ఒకరిపై అభిమానం ఉందని ప్రతిసారి వాళ్లనే పిలిచి ఇబ్బంది పెట్టలేం. బాస్ ఈజ్ బాస్. ఒక హీరోని ఈవెంట్ కి పిలవడానికి 100 కారణాలు ఉంటాయి. చిరంజీవి గారితో మా నాన్నకి చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ గుర్తు చేశారు.
నా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు మాకు శ్రేయోభిలాషి. దయచేసి ఇండస్ట్రీలో మా మధ్య మీరు గోడలు కట్టొద్దు అంటూ విశ్వక్ సేన్ కౌంటర్ ఇచ్చారు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలని సమసిపోయేలా సహకారం అందించండి. అంతేకాని ఇలా అంతరాలు సృష్టించకండి అని తెలిపారు.