Ori Devuda Review:ఓరి దేవుడా మూవీ ట్విట్టర్ టాక్, రూటు మార్చిన విశ్వక్.. సక్సెస్ కొట్టినట్టేనా..?
మాస్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ విశ్వక్ సేన్. యూత్ ను టార్గెట్ చేసుకుని సినిమాలు చేసే ఈ యంగ్ స్టార్.. ఈసారి కాస్త కొత్తగా ఆలోచించాడు. ఓరి దేవుడా అంటూ.. డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈరోజు రిలీజ్ అవుతున్న ఈసినిమా ప్రీమియర్స్ ను చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో సినిమాపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈమూవీ గురించి ఆడియన్స్ ఏమంటున్నారంటే..?
యూత్ ను ఎక్కువగా టార్గెట్ చేసుకుని యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ మాస్ పల్స్ పట్టుకుని సినిమాలు చేస్తూ వచ్చిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు కాస్త రూట్ మార్చాడు. కాస్త క్లాస్ ఏలిమెంట్స్ తో.. డిఫరెంట్ సబ్జెక్ట్ నుసెలక్ట్ చేసుకుని ఓరీ దేవుడా సినిమా చేశాడు. ఈమూవీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగారిలీజ్ కు రెడీ అయ్యింది. అంతకు ముందే ఈసినిమా ప్రీమియర్ షోలు పడగా.. సినిమా చూసిన ఆడియన్స్ వారి అభిప్రాయాలు ట్విట్టర్ లో పంచుకుంటున్నారు. మరి సినిమా గురించి వారు ఏమన్నారో చూద్దాం.
విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ జంటగా నటించిన ఈసినిమాలో సీనియర్ హీరో.. వెంకటేష్ దగ్గుబాటి, గెస్ట్ రోల్ లో అలరించారు. రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ, నాగినీడు లాంటి సీనియర్ యాక్టర్స్ నటించిన . ఈ సినిమాను అశ్వత్ డైరెక్ట్ చేయగా.. PVP సినిమా & శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.
ఓరి దేవుడా సినిమాపై ఆడియన్స్ లో పాజిటీవ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ హఫ్ చూసిన ప్రేక్షకులునెగెటీవ్ కామెంట్స్ అయితే ఇవ్వడంలేదు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది. స్క్రీన్ ప్లే అదర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కథ కాస్త కొత్తగా అనిపించిందటున్నారు.
ఇక ఈసినిమాలో విశ్వక్ సేన్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. మూవీ చూసిన ఆడియన్స్ హీరో యాక్టింగ్ కు ఫిదా అవుతున్నారు. ఈ కథకు విశ్వక్ కరెక్ట్ అంటున్నారు. కాకపోతు మూవీ కథ కాస్త స్లోగా సాగుతుంది.. ఇప్పటి వరకూ వచ్చిన కామెంట్లో లో ఇది ఒక్కటే మైనస్ కనిపిస్తుంది. ఇక సినిమానురిజల్ట్ మాత్రం సెకండ్ హాఫ్ మూవీ డిసైడ్ చేస్తుంది అంటూ ట్వీట్ చేస్తున్నారు జనాలు.
ఇక సినిమాకు చాలా ముఖ్యమైన ఇంట్రవెల్ ట్విస్ట్ పై ఆడియన్స్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంట్రవెల్ బ్యాంగ్ అదిరింది అంటూ ట్వీట్ చేస్తన్నారు. ఇక ఈ మూవీలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేయడం ఈసినిమాకు ప్లాస్ పాయింట్ గా మారింది. వెంకీ ఎంట్రీతో ఆడియన్స్ లో ఉత్సాహం కనిపించిందంటున్నారు.
మొత్తానికి విశ్వక్ సేన్ చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఆడియన్స్ నుంచి నెగెటీవ్ కామెంట్స్ పెద్దగా కనిపించలేదు. అలా అని సూపర్ డూపర్ హిట్ అంటూ.. రెచ్చిపోయి కామెంట్స్ చేసిన వారు కూడా లేరు. ఇక సినిమా రిలీజ్ అయిన తరువాత ఓవర్ ఆల్ గా రిజల్ట్ ఎలా ఉంటుందోచూడాలి.