విష్ణుప్రియ - పృథ్వీ కాంబినేషన్ లో రొమాంటిక్ సాంగ్, వైరల్ న్యూస్ లో నిజమెంత..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ప్రేమ పక్షులుగా పేరు తెచ్చుకున్నారు విష్ణుప్రియ - పృథ్వీ. ఇక వీరు బయటకు వచ్చిన తరువాత కూడా తమ ప్రయాణం కొనసాగించబోతున్నారా..?
బిగ్ బాస్ హౌస్ ప్రతీ సీజన్ లో ఖచ్చితంగా ఓ ప్రేమ జంట బయటకు వస్తుంటుంది. అయితే బయటకు వచ్చిన తరువాత కూడా వారు ప్రేమికులుగానే ఉన్నారా లేదా అనేది పెద్దగా తెలియకపోయినా..? బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకూ మాత్రం ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఈక్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఆడియన్స్ ను అలరించిన ప్రేమ జంట విష్ణుప్రియ - పృథ్వీ.
అయితే పృథ్వీ మాత్రం తనకు అటువంటి ఫీలింగ్స్ లేవు.. ఫ్యూర్ ఫ్రెండ్షిప్ అని అంటున్నా.. తనలో కూడా విష్ణుప్రియ మీద ప్రేమ కనిపించేది. ఇక విష్ణుప్రియ అయితే తనకంటే కూడా పృథ్వీ అంటేనే ఇష్టం అంటూ.. హౌస్ లో ఎన్ని వేశాలు వేసిందో కూడా అందరికి తెలుసు. అయినా సరే ఆమెతను ఎలా ఉండాలో అలానే ఉంది. ఆమె క్యారెక్టర్ నచ్చి.. ఫ్యాన్స్ ఓట్లు వేస్తూ వచ్చారు.
14 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న విష్ణు ప్రియ టాప్ 5 లోకి వస్తుంది అనుకున్నారు అంతా.. కాని 14 వారమే ఆమె ఎలిమినేట్ అవ్వడంతో కాస్త నిరాశచెందారు. అయితే 13 వ వారం పృథ్వీ.. 14 వారం విష్ణుప్రియ ఇద్దరు వారం గ్యాప్ తో వెళ్లిపోయారు. ఇక బయటక వెళ్ళిన తరువాత విష్ణు ప్రియ పెద్దగా ఎవరికి కనిపించలేదు.
Bigg boss telugu 8
బయటకి వచ్చిన తర్వాత విష్ణు ప్రియ ఎవరిని కలవలేదని సమాచారం. ఒక్క సీతతో ఆమెకనిపించింది. ఇంట్లో సీత తెచ్చిన కేక్ కట్ చేసింది అంతే.. ఆతరువాత ఎవరితో మాట్లాడలేదు. హడావిడి చేయలేదు. మరీముఖ్యంగా తన ప్రియుడు పృధ్వీని కూడా కలవలేదు. షో అయిపోయిన తర్వాత ప్రతీ కంటెస్టెంట్ తమ అభిమానులతో ప్రత్యేకంగా ఫ్యాన్స్ మీట్ పెట్టుకుంటారు. హడావిడి చేస్తుంటారు.
Bigg boss telugu 8
ర్యాలీలు తీస్తుంటారు. కాని విష్ణు ప్రియ 14 వారాలు ఉన్నా ఆ హడావిడి కనిపించలేదు. ఆమె ఫ్యామిలీ నుంచి ఏమైనా క్లాస్ పడిందా..? పృధ్వీ విషయంలో ఆమెకు వార్నింగ్ ఇచ్చారా..? అనుమానం కూడా వచ్చింది. ఇక అవన్నీ పక్కన పెడితే.. గ్రాండ్ ఫైనల్స్ లో కూడా విష్ణు ప్రియ పృధ్వీ పక్కనే కూర్చుని కనిపించింది. దాంతో వీరి బంధం బయట కూడా కొనసాగుతుంది అనే అనుకున్నారు అంతా.
Bigg boss telugu 8
ఇక తాజా సమాచారం ప్రకారం వీరు స్క్రీన్ మీద మరసారి జంటగా కనిపించబోతున్నారట. ఇద్దరి కాంబినేషరన్ లో ఓ సాంగ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఓ రొమాంటిక్ సాంగ్ ను వీరు చేయబోతున్నారని సమాచారం. గతంలో విష్ణు ప్రియ మానస్ కాంబోలో ఓ సాంగ్ వచ్చింది. అది సూపర్ హిట్ అయ్యింది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో కెమిస్ట్రీ అద్బుతంగా వర్కౌట్ అయిన పృధ్వీ-విష్ణుప్రియలు కలిసి సాంగ్ చేస్తే.. అది మరింత వైరల్ అవ్వడం ఖాయం. అయితే ఈ విషయం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయ్యింది. అఫీషియల్ గా మాత్రం ఎవరు ప్రకటించలేదు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటించే వరకూ చూడాల్సిందే.