Janaki Kalaganaledu: జ్ఞానాంబకు అబద్ధం చెప్పిన మల్లిక, విష్ణు.. క్యాటరింగ్ పని ఒప్పుకున్న రామచంద్ర?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 17వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఈరోజు ఎపిసోడ్ లో జానకి తన హ్యాండ్ బ్యాగ్ మొత్తం వెతకగా డబ్బులు లేకపోవడంతో మావయ్య గారికి నేను టాబ్లెట్ తీసుకుని వస్తానని చెప్పాను నా దగ్గర డబ్బులు లేవు రామా గారి దగ్గర కూడా డబ్బులు లేనట్టు ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జానకి విష్ణు దగ్గరికి వెళ్లి మావయ్య గారివి టాబ్లెట్స్ అయిపోయాయి నీ దగ్గర డబ్బులు ఉంటే కొంచెం తీసుకొని వస్తావా లేదంటే డబ్బులు ఇచ్చినా నేను వెళ్లి తీసుకొచ్చుకుంటాను అని అంటుంది జానకి. అప్పుడు విష్ణు తలబడుతూ ఉండగా ఇంతలోనే మల్లిక అక్కడికి వస్తుంది. అలా తడబడతారు ఎందుకు మీ దగ్గర లేని డబ్బులు మా దగ్గర ఎందుకు వస్తాయి జానకి అనడంతో షాపు ఉంది.
కదా మల్లిక అని జానకి అడగగా అదేం లేదమ్మా పేరుకి పెద్ద షాప్ అయినా కానీ దాంతో రూపాయి కూడా ఆదాయం లేదు. ఇప్పుడు అసలు ఆ షాపే లేదు అని అంటుంది మల్లిక. అప్పుడు జ్ఞానాంబ బయటకు వచ్చి షాపు లేకపోవడం ఏంటి అని అడగడంతో మల్లిక విష్ణు టెన్షన్ పడుతూ ఉంటారు. విష్ణు నిన్నే అడిగేది షాపు లేకపోవడం ఏంటి అనడంతో విష్ణు తడబడుతూ ఉంటాడు. అప్పుడు విష్ణు షాపు లేదు అనడంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. షాప్ లో బిజినెస్ సరిగా జరగకపోవడంతో బిజినెస్ ని మరింత పెంచుకోవడం కోసం మా ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి ఆ షాప్ ని బాగు చేయించాను. అయినా కూడా బిజినెస్ సరిగా అవ్వలేదు దాంతో షాప్ ని మా ఫ్రెండ్ కి అప్పగించాల్సి వచ్చింది అనడంతో గోవిందరాజులు జ్ఞానాంబ, జానకి షాక్ అవుతారు.
అంటే ఇప్పుడు నువ్వు సంపాదించడానికి కూడా ఏమీ లేదా అని గోవిందరాజులు అడగడంతో నేను బయట ఎక్కడైనా పని చూసుకుంటాను నాన్న అని అంటాడు. అప్పుడు మల్లిక ఈ విషయం నేను ముందే చెప్పమన్నాను చూసారా అందరూ మనల్ని మనం సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు అని అంటుంది. అడిగే వరకు చెప్పాలి అని నీకు కూడా అనిపించలేదా అని విష్ణుని నిలదీస్తుంది జ్ఞానాంబ. మల్లిక అసలు విషయం ఎక్కడ బయటపడుతుందో అని మీరు శుభమా అని బయటకు వెళ్తుంటే అడ్డుపడ్డారు మళ్ళీ వెళ్దురు రండి అని లోపలికి పిలుచుకొని వెళ్తుంది. అప్పుడు గోవిందరాజు వాళ్ళు ఆలోచనలో పడతారు. మరొకవైపు రామచంద్ర పని కోసం షాపులు మొత్తం వెతుకుతూ ఉంటాడు.
ఇప్పుడు జానకి కూడా మందులు తీసుకొని రావడానికి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. మరొకవైపు రామచంద్ర ఒక షాప్ దగ్గర నిలబడి ఉండగా ఇంతలోనే పక్కన అతను కేటరింగ్ వాళ్ళు హ్యాండ్ ఇవ్వడంతో తిట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు రామచంద్ర ఆ క్యాటరింగ్ నేను చేస్తాను నాకు డబ్బులు ఇవ్వండి అని ఆ కేటరింగ్ పనిని ఒప్పుకుంటాడు. అప్పుడు వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి రామచంద్రని పనిలో జాయిన్ అవ్వమని చెప్పి వెళ్ళిపోతారు. మరొకవైపు జానకి స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పాటలు చెప్పడానికి జాబు వెతుక్కుంటుంది. అప్పుడు జాబ్ దొరకడంతో సంతోషంగా బయట నిలబడి ఉండగా ఇంతలోనే అక్కడికి రామచంద్ర వస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు జానకి గారు అడగడంతో నాకు జాబ్ దొరికింది రామా గారు అని అంటుంది.
చిన్న చిన్న వాటికి మీరు జాబ్ చేయడం ఏంటి చదువుకోవాలి కదా అని అంటాడు రామచంద్ర. అప్పుడు మనకు డబ్బులు చాలా అవసరం చేయాలి జాబ్ అని అంటుంది జానకి. నాక్కూడా పని దొరికింది ఇదిగో అడ్వాన్స్ ఇచ్చారు అని జానకికి చూపించి సరే ఇంటికి వెళ్దాం పదండి అని అంటాడు. మరొకవైపు విష్ణు జరిగిన విషయాలు తలుచుకుని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే మల్లిక అక్కడికి వస్తుంది. అప్పుడు మల్లిక అక్కడికి వచ్చి వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటుంది. మన దగ్గర డబ్బులు ఉన్న విషయాన్ని నేను చెప్పను మీరు చెప్పద్దు మొదట షాప్ ఎక్కడ పెట్టాలో అది ఆలోచించండి మిగతా సంగతులు అని నేను చూసుకుంటాను అని అంటుంది మల్లిక.
మరొకవైపు అఖిల్ తనకి ఏమీ పట్టదు అన్నట్టుగా మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉండగా ఇంతలో వచ్చి జెస్సి ఇంట్లో పరిస్థితులు అర్థం అవుతున్నాయ నీకు అనడంతో అసలు ఏంటి నీ గోల అని అంటాడు అఖిల్. కస్టపడి సంపాదించాలి కానీ ఇలా వీడియో గేమ్ లు ఆడుకుంటూ కూర్చోకూడదు అనే జెస్సి అఖిల్ ని తిడుతుంది. అప్పుడు అఖిల్ తనకి ఏమి సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతాడు. అ ప్పుడు వారిద్దరూ పోట్లాడుకుంటూ ఉండగా ఇంతలో చికిత మీ మామయ్య గారు వచ్చారు అమ్మగారు మిమ్మల్ని పిలుచుకు రమ్మని చెప్పింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.