- Home
- Entertainment
- Green India Challenge: మొక్కకు పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టిన విశాల్.. ఎమోషనల్ కామెంట్స్
Green India Challenge: మొక్కకు పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టిన విశాల్.. ఎమోషనల్ కామెంట్స్
'ఎనిమి' చిత్ర ప్రమోషన్స్ కోసం నటులు విశాల్, ఆర్య, మృణాళిని రవి హైదరాబాద్ కు వచ్చారు. Green India Challenge లో భాగంగా వీరు ముగ్గురూ హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ కు ఏ సెలబ్రిటీ వచ్చినా వారిచేత సంతోష్ కుమార్ మొక్కలు నటిస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగం చేస్తున్నారు.
తాజాగా 'ఎనిమి' చిత్ర ప్రమోషన్స్ కోసం నటులు విశాల్, ఆర్య, మృణాళిని రవి హైదరాబాద్ కు వచ్చారు. Green India Challenge లో భాగంగా వీరు ముగ్గురూ హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
మొక్కలు నాటే సమయంలో Vishal అందరి హృదయాలు దోచుకున్నారు. తాను నాటిన మొక్కకు ఇటీవల అకాల మరణం చెందిన Puneeth Rajkumar పేరు పెట్టాడు. తమ స్నేహానికి గుర్తుగా ఈ మొక్క ఉంటుందని విశాల్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. పునీత్ చారిటి కార్యక్రమాలన్నీ తాను కొనసాగిస్తానని ఇటీవల విశాల్ ప్రకటించారు. సంతోష్ కుమార్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ మానసపుత్రిక 'హరితహారం' స్పూర్తితో ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని విశాల్ తెలిపాడు.
ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో వారు ప్రారంభించిన ఈ 'గ్రీన్ ఇండియా చాలెంజ్' గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా 'గ్రీన్ ఇండియా చాలెంజ్' లో పాల్గొని మొక్కలు నాటాలనికోరుకుంటున్నట్లు విశాల్ తెలిపాడు.
మరో నటుడు Arya కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్న సంతోష్ కుమార్ ని అభినందించాడు. భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని ఆర్య కోరారు.
ఇద్దరు హీరోలతో పాటు నటి మృణాళిని రవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటింది. ఇదిలా ఉండగా విశాల్, ఆర్య శత్రువులుగా నటించిన ఎనిమి చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఎనిమి నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.