హీరో విశాల్ కి ఏమైంది.. వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో, హెల్త్ గురించి పుకార్లు నిజమేనా
హీరో విశాల్ చెన్నైలో ఉంటున్నప్పటికీ తెలుగు ఆడియన్స్ అతడిని తెలుగు హీరోగానే భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో విశాల్ కుటుంబ మూలాలు ఉన్నాయి. పందెం కోడి చిత్రం నుంచి ఏపీ, తెలంగాణలో విశాల్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది.
హీరో విశాల్ చెన్నైలో ఉంటున్నప్పటికీ తెలుగు ఆడియన్స్ అతడిని తెలుగు హీరోగానే భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో విశాల్ కుటుంబ మూలాలు ఉన్నాయి. పందెం కోడి చిత్రం నుంచి ఏపీ, తెలంగాణలో విశాల్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. కానీ ఇటీవల విశాల్ జోరు తగ్గింది. కానీ విశాల్ మాత్రం కంటెంట్ ఉన్న చిత్రాలతో అలరిస్తూనే ఉన్నాడు.
Vishal
పందెం కోడి చిత్రం సూపర్ హిట్ అయ్యాక విశాల్ చిత్రాలు తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. విశాల్ కెరీర్ బిగినింగ్ లో వరుసగా విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాపులు ఎదురయ్యాయి. దీనితో రొటీన్ చిత్రాలకు స్వస్తి చెప్పిన విశాల్ కంటెంట్ ఉన్న వైవిధ్యమైన చిత్రాలతో రూట్ మార్చారు.
యాక్షన్, అభిమన్యుడు, ఎనిమి లాంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఇటీవల వచ్చిన మార్క్ ఆంటోని కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతం విశాల్ వయసు 47 ఏళ్ళు. ఈ క్రేజీ హీరో ఇంతవరకు పెళ్లి జోలికి వెళ్ళలేదు. ఇదిలా ఉండగా విశాల్ నటించిన మదగజ రాజా చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకువస్తున్నారు. చెన్నైలో జరిగిన ఈ చిత్ర ఈవెంట్ కి విశాల్ హాజరయ్యారు.
Vishal
కానీ విశాల్ ని చూసిన అందరికీ ఊహించని షాక్. విశాల్ గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయాడు. బాగా సన్నగా అయిపోయిన విశాల్ వేదికపై వణికిపోతూ కనిపించాడు. ముఖం కూడా మారిపోయింది. దీనితో విశాల్ ఆరోగ్యం పట్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాల్ కి ఏమైంది.. ఎందుకు అలా వణికిపోతున్నారు అంటూ ఆరా తీస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు విశాల్ హై ఫీవర్ తో భాదపడుతున్నారట. ఫీవర్ కారణంగానే విశాల్ సన్నగా మారినట్లు తెలుస్తోంది.
Vishal
నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. కేవలం ఫీవర్ కారణంగానే విశాల్ ఇలా మారాడా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా విశాల్ త్వరగా కోలుకుని మునిపటిలా యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. సుందర్ దర్శకత్వంలో మదగజరాజా చిత్రం తెరకెక్కింది.