MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Chingari Song: ఈ మెలోడి సాంగ్‌ వింటే లవర్స్ కి మతిపోవాల్సిందే.. వింటారా సరదాగా నుంచి సెకండ్‌ సాంగ్‌ ఔట్‌

Chingari Song: ఈ మెలోడి సాంగ్‌ వింటే లవర్స్ కి మతిపోవాల్సిందే.. వింటారా సరదాగా నుంచి సెకండ్‌ సాంగ్‌ ఔట్‌

Chingari Song: అశోక్‌ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన `వింటారా సరదాగా` మూవీ నుంచి అదిరిపోయే సెకండ్‌ సాంగ్‌ విడుదలైంది. ఈ పాట వింటే లవర్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 02 2026, 06:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వీసాతో రాబోతున్న అశోక్‌ గల్లా
Image Credit : Asianet News

వీసాతో రాబోతున్న అశోక్‌ గల్లా

అశోక్‌ గల్లా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ `వీసా-వింటారా సరదాగా`. `హీరో`, `దేవకి నందన వాసుదేవా` వంటి చిత్రాలతో అశోక్‌ గల్లా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆయా సినిమాలు యావరేజ్‌గా ఆడాయి. అశోక్ గల్లాకి సరైన గుర్తింపుని తీసుకురాలేకపోయాయి. మంచి బ్రేక్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ఆయన ఇప్పుడు `వింటారా సరదాగా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ మూవీలో ఆయనకు జోడీగా శ్రీ గౌరీ ప్రియ నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వైవా హర్ష, గుండు సుదర్శన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అలరిస్తోన్న వీసా రెండో పాట చింగారి
Image Credit : Asianet News

అలరిస్తోన్న వీసా రెండో పాట చింగారి

నూతన దర్శకుడు ఉద్భవ్ రఘు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఓ పాట విడుదలై ఆకట్టుకుంది. ఇప్పుడు `చింగారి` పేరుతో రెండో పాటని విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ఈ మెలోడీ గీతాన్ని, తన ప్రత్యేకమైన గానంతో శ్రోతలను అలరించే సిద్ శ్రీరామ్, లిప్సిక ఎంతో అందంగా ఆలపించారు. సనారే రచించిన 'చింగారి' పాట ప్రతి ఒక్కరి గుండెల్ని తాకేలా ఉంది. ప్రేమలోని నిశ్శబ్ద వేదనను, మనసులో రగిలే భావోద్వేగాలను ఎంతో కవితాత్మకంగా ఆవిష్కరిస్తుంది. మాటల్లో చెప్పలేని ప్రేమ అనుభూతిని సంగీతం ద్వారా అద్భుతంగా వ్యక్తపరిచే ఈ పాట ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యేలా రూపొందింది.

Related Articles

Related image1
Renu Desai: రేణు దేశాయ్‌ చేసిన మొదటి సినిమా ఏంటో తెలుసా? బద్రి కాదు, అది చూసే పవన్‌కి జోడీగా ఎంపిక
Related image2
Soundarya: రెండు లక్షలకు కక్కుర్తి పడి ప్రాణాలు పోగొట్టుకుంది.. సౌందర్య గురించి షాకింగ్‌ నిజాలు బయటపెట్టిన దర్శకుడు
34
విదేశాల్లో తెలుగు విద్యార్థుల జీవితాన్ని ఆవిష్కరించే వీసా
Image Credit : Asianet News

విదేశాల్లో తెలుగు విద్యార్థుల జీవితాన్ని ఆవిష్కరించే వీసా

'VISA - వింటారా సరదాగా' నుంచి విడుదలైన టీజర్ ఒక సరికొత్త కథనంతో, విదేశాల్లోని తెలుగు విద్యార్థుల జీవితాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్నేహం, ఆశయాలు, సాంస్కృతిక గుర్తింపు, ఊహించని ప్రేమ వంటి అంశాలను నేటి తరం ప్రేక్షకులు కోరుకునే విధంగా సరికొత్తగా ఆవిష్కరించనుంది. తొలి గీతం 'అనగనగా అమెరికా' ఒక హుషారైన పాటగా నిలిచి, అన్ని మాద్యమాల్లో అందరి మనసులను గెలుచుకుంది. సొంత ఊరిని వదిలి దూరంగా వెళ్ళి, విదేశాల్లో తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించే యువత భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రంగా 'VISA - వింటారా సరదాగా'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

44
లవర్స్ కి మతిపోగొట్టే చింగారి
Image Credit : Asianet News

లవర్స్ కి మతిపోగొట్టే చింగారి

ఇప్పుడు విడుదలైన 'చింగారి' పాటతో ఈ చిత్రం తనలోని రొమాంటిక్ కోణాన్ని ఆవిష్కరించింది. హృదయాన్ని తాకే స్వరాలు, సాహిత్యంతో ఈ పాట సంగీత ప్రియుల మనసులను గెలుచుకుంటోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు తీసే అభిరుచి గల నిర్మాతలు కావడంతో 'VISA - వింటారా సరదాగా'పై నమ్మకం మరింత పెరిగింది. ప్రతి కొత్త అప్‌డేట్‌తో ఈ సినిమా మరింత సానుకూల స్పందనను సొంతం చేసుకుంటోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image2
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Recommended image3
Ram Charan: 30 ఏళ్ల వయసులో రామ్ చరణ్ చేసిన పనికి.. నిర్మాత బండ్ల గణేష్ కు కన్నీళ్లు ఆగలేదు.. ఏం జరిగింది?
Related Stories
Recommended image1
Renu Desai: రేణు దేశాయ్‌ చేసిన మొదటి సినిమా ఏంటో తెలుసా? బద్రి కాదు, అది చూసే పవన్‌కి జోడీగా ఎంపిక
Recommended image2
Soundarya: రెండు లక్షలకు కక్కుర్తి పడి ప్రాణాలు పోగొట్టుకుంది.. సౌందర్య గురించి షాకింగ్‌ నిజాలు బయటపెట్టిన దర్శకుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved