- Home
- Entertainment
- Virosh Wedding : రష్మిక మందన్న మాజీ ప్రియుడిని పెళ్లికి పిలుస్తుందా? శెట్టి గ్యాంగ్‌కు పిలుపు లేదా?
Virosh Wedding : రష్మిక మందన్న మాజీ ప్రియుడిని పెళ్లికి పిలుస్తుందా? శెట్టి గ్యాంగ్‌కు పిలుపు లేదా?
ఎట్టకేలకు పెళ్ళిపై అఫీషియల్ గా ప్రకటన చేశారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. పెళ్లి ఈ వెంట్ కు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు కూడా పెట్టారు. ఈక్రమంలో.. ఈ పెళ్లికి రష్మిక మందన్న మాజీ ప్రియుడికి పిలుపు ఉంటుందా?

విజయ్ - రష్మిక అధికారిక ప్రకటన..
ఎట్టకేలకు అధికారికంగా పెళ్లి ప్రకటన చేశారు టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. చాలా కాలంగా రహస్య ప్రేమ నడుపుతూ వచ్చిన ఈ జంట.. లాస్ట్ ఇయర్ ఎంగేజ్మెంట్ ను కూడా సీక్రేట్ గానే ఉంచారు. మీడియా, అభిమానులు ఎన్ని రకాలుగా ప్రత్నించినా.. వీరు ఈ విషయంలో స్పందించలేదు.
ఇక ఎట్టకేలకు పెళ్లిపై ఇద్దరు ఒకేసారి సోషల్ మీడియా ప్రకటన చేశారు. తాము చెప్పకముందే అభిమానులు అన్నీ చేస్తున్నారని. తమ జంటకు విరోష్ అని పేరు కూడా పెట్టారని.అభిమానుల కోరిక మేరకు తమ పెళ్లికి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టుకుంటున్నట్టు ప్రకటనలో తెలిపారు విజయ్ దేవరకొండ. ఈ ప్రకటనతో పాటు పెళ్లి కార్డును కూడా వారు పోస్ట్ చేశారు.
రష్మికకు తొలి అవకాశం ఇచ్చిన శెట్టి గ్యాంగ్..
బెంగళూరులోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రష్మిక మందన్నకు సినిమాల్లోకి వచ్చే అవకాశం కల్పించింది కర్ణాటక 'శెట్టి గ్యాంగ్'. 'కిరిక్ పార్టీ' సినిమాలో సింపుల్ పాత్రతో ఆమె అందరినీ ఆకట్టుకుంది. ఆమె అమాయకపు అందం కన్నడిగులకు బాగా నచ్చింది. ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ఆమెకు నిశ్చితార్థం కూడా జరిగింది. వారిద్దరి మధ్య 13 ఏళ్ల వయసు తేడా ఉంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక..
నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలలకే ఈ జంట మధ్య విభేదాలు మొదలయ్యాయి. అప్పటికే రష్మిక తెలుగులో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో నటించింది. ఈ రెండు చిత్రాల్లో విజయ్ దేవరకొండ హీరో. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి.
గీత గోవిందంతో మొదలైన బంధం..
'గీత గోవిందం' సినిమాతో మొదలైన వీరి పరిచయం 'డియర్ కామ్రేడ్' నాటికి ప్రేమబంధంగా మారింది. ఈ సినిమాల్లోని లిప్ లాక్ సీన్లు, విజయ్-రష్మిక మధ్య కెమిస్ట్రీ అందరికీ నచ్చింది. ఈ జంట నిజ జీవితంలోనూ పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకున్నారు.
కానీ వారు మాత్రం తమ బంధంపై ఎప్పుడ స్పందించలేదు. అధికారికంగా స్పందించని ఈ జంట, వెకేషన్ ఫోటోలతో నెటిజన్లకు దొరికిపోతూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజం కాబోతుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరగనుంది, హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుందని టాక్.
రష్మిక మాజీ ప్రియుడికి పిలుపు ఉంటుందా?
ఇప్పుడు అందరికి ఒకటే డౌట్ వెంటాడుతోంది. ఈ పెళ్లికి రష్మిక మందన్న తన ప్రియుడిని పిలుస్తుందా? తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన శెట్టి గ్యాంగ్ కు పెళ్లి పిలుపు ఉంటుందా.? ఇక రష్మిక పెళ్లిపై 'శెట్టి గ్యాంగ్' సభ్యుడు ప్రమోద్ శెట్టిని మీడియా ప్రశ్నించింది. ఆయన మాట్లాడుతూ.. "మాకెవరికీ పెళ్లి పిలుపు లేదు. ఆమె పంపదు కూడా. మేమెవరూ పెళ్లికి వెళ్లడం లేదు" అని ఆయన స్పష్టం చేశారు. కిరిక్ పార్టీ నుంచి కాంతార వరకు ఎన్నో హిట్ చిత్రాల్లో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, ప్రమోద్ శెట్టి, రాజ్ బి శెట్టి కలిసి పనిచేశారు. అందుకే వీరిని 'శెట్టి గ్యాంగ్' అంటారు.
రష్మికతో బ్రేకప్ తర్వాత బాధలో రక్షిత్ శెట్టి..
రష్మికతో బ్రేకప్ తర్వాత రక్షిత్ కొన్నాళ్లు చాలా బాధపడ్డాడని, కానీ క్రమంగా కోలుకున్నాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రమోద్ శెట్టి చెప్పారు. రక్షిత్ శెట్టి ఇప్పటివరకు రష్మిక గురించి ఎక్కడా ఒక్క నెగటివ్ కామెంట్ కూడా చేయలేదు.
ఇటీవల ఆయన ఐదు సినిమాల స్క్రిప్ట్‌లు రెడీ చేసుకున్నట్టు గుడ్ న్యూస్ చెప్పారు. కిరిక్ పార్టీ రిలీజై పదేళ్లు పూర్తయిన సందర్భంగా రిషబ్ శెట్టి పోస్ట్ చేసిన పోస్టర్‌లో రష్మిక ఫోటో లేకపోవడం పెద్ద చర్చకు దారితీసింది. రక్షిత్‌తో బ్రేకప్ తర్వాత కన్నడిగులు ఇప్పటికీ రష్మికను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

