సినిమాపై అంచనాలు పెంచేస్తున్న విరాటపర్వం మూవీ పాత్రలు... వెన్నెలగా సాయి పల్లవి, మరి రానా?
రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. దర్శకుడు వేణు ఉడుగుల పీరియడ్ రివొల్యూషన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. 90ల ప్రారంభంలో జరిగి నక్సల్ ఉద్యమ పోరాటాల నేపథ్యంలో విరాట పర్వం తెరకెక్కుతుంది.
టాలీవుడ్ లో విరాట పర్వం మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. చాలా కాలం తరువాత నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో పాటు, రానా, సాయి పల్లవి లాంటి స్టార్ క్యాస్ట్ నటించడంతో ప్రత్యేకత సంతరించుకుంది.
కాగా విరాట పర్వం మూవీని పాత్రల గురించి ఆసక్తికర విషయాలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. రానా దగ్గుబాటి రావన్న అనే నక్సలైట్ రోల్ చేస్తున్నారు. విద్యావంతుడైన రవి... సొసైటీలో పెద్దల అరాచకాలు, ప్రభుత్వాల అవినీతికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసే నక్సల్ గా కనిపిస్తాడట.
ఇక ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. రవన్నను ప్రేమించే పల్లెటూరి పేద అమ్మాయిగా, నక్సలిజం సానుభూతిపరురాలిగా సాయి పల్లవి పాత్ర ఉంటుందట. విరాటపర్వం మూవీలో సాయి పల్లవి పాత్ర పేరు వెన్నెల అని తెలుస్తుంది.
కాగా విరాటపర్వం మూవీలో మరో కీలక రోల్ చేస్తున్నారు ప్రియమణి. ప్రియమణి కూడా కామ్రేడ్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఆమె లుక్ విడుదల చేయడం జరిగింది. భారతక్క అనే పేరుతో కరుడుగట్టిన నక్సలిస్ట్ గా ఆమె పాత్ర ఉంటుందని సమాచారం.
సీనియర్ నటి ఈశ్వరి రావ్ కూడా విరాటపర్వం మూవీలో పాత్ర చేస్తున్నారు. ఈశ్వరి రావ్ వెన్నెల తల్లిగా అంటే, సాయి పల్లవి తల్లి పాత్రలో కనిపిస్తారని వినికిడి.
కాగా బాలీవుడ్ నటి దర్శకురాలు నందితా దాస్ విరాటపర్వం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. మానవహక్కుల పరిరక్షకురాలిగా, సోషల్ యాక్టివిస్ట్ గా ఆమె కథలో కీలకమైన పాత్ర చేస్తున్నారట.
ఇలా మొత్తంగా అద్భుతమైన నటులు, బలమైన కథతో తెరకెక్కుతున్న విరాట పర్వం అవార్డు విన్నింగ్ మూవీ అవడం ఖాయంగా కనిపిస్తుంది. ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా విరాటపర్వం విడుదల కానుంది.