- Home
- Entertainment
- విరాట్ కోహ్లీ సంపాదన కాకుండా అనుష్క శర్మ ఆస్తులు ఎంతో తెలుసా.. ఎన్ని వందల కోట్లు అంటే..
విరాట్ కోహ్లీ సంపాదన కాకుండా అనుష్క శర్మ ఆస్తులు ఎంతో తెలుసా.. ఎన్ని వందల కోట్లు అంటే..
విరాట్ కోహ్లీ 2017లో అనుష్క శర్మని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అనుష్క శర్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అనుష్క, విరాట్ కోహ్లీ ఒక యాడ్ లో నటించడం ద్వారా ప్రేమలో పడ్డారు.

Virat Kohli , Anushka Sharma
ఇండియన్ క్రికెట్ స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ గురించి పరిచయం అవసరం లేదు. వరల్డ్ లోనే అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ ఒకరు. సెంచరీల వరద పారిస్తూ కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఇండియన్ క్రికెటర్ గా మంచి గుర్తింపు వస్తే ఆ వ్యక్తి సంపాదన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ నుంచి మాత్రమే కాకుండా ఎండార్స్మెంట్స్ నుంచి కూడా కోట్లల్లో ఆదాయం వస్తుంది.
విరాట్ కోహ్లీ 2017లో అనుష్క శర్మని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అనుష్క శర్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అనుష్క, విరాట్ కోహ్లీ ఒక యాడ్ లో నటించడం ద్వారా ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. విరాట్ కోహ్లీ వందల కోట్లు సంపాదిస్తుంటే తన భార్యగా అనుష్క శర్మ కూడా తగ్గడం లేదు. ఆమె సంపాదన కూడా ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంది.
అనుష్క శర్మ బాలీవుడ్ లో ఒక్కో చిత్రానికి 5 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. అనుష్క శర్మ యాడ్స్ విషయంలో కూడా దూసుకుపోతోంది. అనుష్క ఒక్కో యాడ్ కి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందని సమాచారం.
అనుష్క శర్మకి సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. తన సోదరుడితో కలసి అనుష్క క్లీన్ స్లేట్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించింది. ఈ సంస్థలో అనుష్క వెబ్ సిరీస్ లు, చిత్రాలు నిర్మిస్తోంది. దీని ద్వారా కూడా అనుష్కకి ఆదాయం వస్తుంది. అదే విధంగా అనుష్క దుస్తుల వ్యాపారం కూడా ప్రారంభించింది. అనేక దుస్తుల బ్రాండ్స్ లో ఆమె ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇతర వ్యాపారాల్లో, స్టార్ అప్ కంపెనీల్లో అనుష్క ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ సంపాదన కాకుండా కేవలం అనుష్క సంపాదించిన ఆస్తుల విలువ 255 కోట్ల వరకు ఉంటుందట. ఇక విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ 1000 కోట్ల పైనే. ఈ దంపతుల ఆస్తులు సుమారుగా 1300 కోట్లు ఉంటాయని సమాచారం. అనుష్క, కోహ్లీ దంపతులకు వామిక, ఆకయ్ ఇద్దరు పిల్లలు సంతానం.