MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: వేదని చూసి జలసీగా ఫీల్ అవుతున్న యష్.. సంతోషంలో విన్నీ?

Ennenno Janmala Bandham: వేదని చూసి జలసీగా ఫీల్ అవుతున్న యష్.. సంతోషంలో విన్నీ?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 7వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Feb 07 2023, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో వేద లోపలికి వచ్చి మీరు వచ్చారా అని అంటుంది. అప్పుడు యష్ వేదవైపు చూస్తూ ఉండగా నాకు కాఫీ ఇవ్వమంటారా అనడంతో అక్కర్లేదు అని అంటాడు. నా డ్రెస్ ఎలా వుంది బాగుంది కదా స్పెషల్ డ్రెస్. మా విన్ని ఇచ్చే స్పెషల్ పార్టీకి స్పెషల్ గానే వెళ్లాలి కదా అని అంటుంది వేద. అప్పుడు వేద ఇంకా బాగా రెడీ అవుతుండగా అది చూసి యష్ కుళ్ళుకుంటూ ఉంటాడు. ఇదేంటి పార్టీకి మీరు కూడా రావాలి. మీరు రాకపోతే కుదరదు ప్లీజ్ రండి అని అడుగుతుంది అనుకుంటే నన్ను పట్టించుకోకుండా రెడీ అవుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు యష్.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అప్పుడు వేద అడగకపోయేసరికి మార్నింగ్ ఏదో పార్టీకి వెళ్దాం అన్నావు కదా అని అంటాడు. మీరు కుదరదు అన్నారు కదా అని అనడంతో లేదు వేద కుదరదు అనలేదు చూద్దాం అని అన్నాను అంటాడు యష్. దాని అర్థం అదే కదా అని వేద  కావాలనే యష్ ని ఏడిపించాలని మాట్లాడుతుంది. నేను వెళ్దామని అడిగితే వద్దన్నారు కాల్ చేసి అడుగుదామంటే ఫోన్ కట్ చేశారు అని అంటుంది వేద. అప్పుడు కావాలనే వేద యష్ ని మరింత ఏడిపించాలని మీరు బెస్ట్ సీఈవో కదా బిజీబిజీ కదా అని అంటుంది. సరే నేను వెళ్తున్నాను మీరు రావాలి అనిపిస్తే మొన్న మాదిరి గుమ్మం వరకు వచ్చి వెళ్ళకండి పార్టీలో వచ్చి జాయిన్ అవ్వండి అయాం వెయిటింగ్ ఫర్ యు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద.

36

ఆ తర్వాత వేద పార్టీకి వెళ్తుంది.  అప్పుడు విన్నీ వేదకి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పి మీ హస్బెండ్ ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు వేద అబద్ధాలు చెబుతుంది. లేటుగా వస్తారు మనతో పాటు జాయిన్ అవుతారు అని అంటుంది వేద. పెళ్లి చేసుకోవా అని వేద అడగడంతో నీలాంటి అమ్మాయి దొరికితే ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటాను అంటాడు విన్నీ. అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు యష్ కోప్పడుతూ పార్టీకి వస్తారా అని ఒక్క మాట అడగకుండా వెళ్లిపోయింది ఎందుకంత టేక్కు అనుకుంటూ ఉంటాడు. బెస్ట్ సీఈవో ఇక్కడ ఒక్కసారి వెళ్లకూడదు అనుకుంటే అసలు వెళ్ళడు అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు.
 

46

బ్రతిమలాడకుండా వెళ్ళింది అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు యష్. మరొకవైపు వేద పార్టీలో యష్ వస్తాడు అని ఎదురుచూస్తూ ఉంటుంది. యష్ కి ఫోన్ చేయగా ఫోన్ కలవకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు విన్నీకి అసలు నిజం చెబితే బాధపడతాడు అనుకుంటూ ఉంటుంది వేద. మరోవైపు యష్ తను నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్లాలా వద్దా అని ఆలోచించుకుంటూ వెళ్లాలి అనుకుంటాడు మళ్ళీ వద్దు అని అనుకుంటాడు. అప్పుడు నా భార్య పక్కన నేను లేకపోతే అందరూ ఏమనుకుంటారు అని యష్ అనుకుంటాడు.

56

మరోవైపు అభి కూడా పార్టీకి వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగా నేను కూడా వస్తాను బంగారం ఇంట్లో బోరింగ్ గా ఉంది అని మాళవిక అనడంతో మా అక్క ఒప్పుకునే వరకు మనకు ఈ కష్టాలు తప్పవు కొద్ది రోజులు వెయిట్ చెయ్ ఏం కాదు అంటాడు అభి. అప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు అభి. మరోవైపు వేద,యష్ కోసం ఎదురుచూస్తూ ఏంటిది ఈయన ఫోనే పని చేయట్లేదు అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి విన్నీ వస్తాడు. ఏంటి మీ ఆయన కోసం ఎదురు చూస్తున్నావా అని విన్నీ అడగగా లేదు అని వేద కవర్ చేయడంతో ఒకరి కోసం ఎదురుచూపులు ఎలా ఉంటాయో నాకు తెలుసు నువ్వు కవర్ చేయకు అంటాడు విన్నీ. ఇప్పుడు విన్నీ వేద అందం గురించి పొగుడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు యష్ పార్టీకి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు.
 

66

ఆ తర్వాత అభి కూడా పార్టీకి వెళ్తాడు. మరోవైపు వేద,యష్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో విన్నీ అక్కడికి వచ్చి మాట్లాడిస్తూ ఉండగా అప్పుడు అభి రావడం చూసి షాక్ అవుతుంది వేద. ఇతను ఎందుకు వచ్చాడు అని నీకు తెలుసా అని వేదని అడగగా తెలుసు చాలా బ్యాడ్ పర్సన్ అని అనడంతో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను నువ్వు సైలెంట్ గా ఉండు నేను డీల్ చేస్తాను అంటాడు విన్నీ.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi OTT Date: రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Recommended image2
Mandi Chicken Biryani: ఇంట్లోనే ఈజీగా పొగలు కక్కే చికెన్ మండి బిర్యానీ..ముక్క కూడా మిగలదు
Recommended image3
Nagarjuna: కాలు విరిగినా షూటింగ్‌ చేసిన నాగార్జున, సెట్‌లో తీవ్ర అవమానం.. రియాలిటీ చూపించిన దర్శకుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved