`పుష్ప 3`లో `విక్రమ్` విలన్.. బన్నీ పోరాడే ఇంటర్నేషనల్ స్మగ్లర్ అతడేనా?.. ఆ విషయంలో నిరాశ తప్పదా..?
గత రెండు రోజులుగా `పుష్ప`కి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. మూడో పార్ట్ అనేది టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా మరో క్రేజీ వార్త తెరపైకి వచ్చింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ `పుష్ప 2`. ఇది మూడేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కి కొనసాగింపు. ఈ పార్ట్ తోనే సినిమా ఎండ్ అవుతుందని భావించారు. కానీ మూడో పార్ట్ ఉంటుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాని ఊపేస్తుంది. సుకుమార్ ప్లాన్ మామూలుగా లేదని అంతా కితాబిస్తున్నారు. ఆయన ఆలోచనలకు ఫిదా అవుతున్నారు. ఈ మూవీని ఇంటర్నేషనల్ రేంజ్‌కి తీసుకోబోతున్నారని అంతా భావిస్తున్నారు.
అంతేకాదు `పుష్ప` మూవీకి సంబంధించి టైటిల్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. మొదటి పార్ట్ కి `రైజ్` అని పెట్టారు. ఇందులో అల్లు అర్జున్.. పుష్ప రాజ్‌గా ఎదగడం చూపించారు. రెండో పార్ట్ లో `రూల్` అని పెట్టారు. అంటే పుష్పరాజ్ స్మగ్లింగ్‌ని రూల్ చేయడాన్ని చూపించబోతున్నారు. ఇక మూడో పార్ట్ కి `రోర్` అని పెట్టబోతున్నారట. ఈ లెక్కన బన్నీ ఇంటర్నేషనల్ వైడ్‌గా పెద్ద స్మగ్లర్‌గా ఎదుగుతాడని, అంతర్జాతీయంగా ఆయన గర్జించబోతున్నారని అంటున్నారు. అయితే మూడో టైటిల్ నిజం కాదనే వార్త కూడా ఉంది. ఏదేమైనా `రైజ్, రూల్, రోర్` అనేది పర్‌ఫెక్ట్ గా ఉందనేది బన్నీ ఫ్యాన్స్ మాట.
మరోవైపు ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో కొత్త ఆర్టిస్ట్ లు ఎంట్రీ ఇవ్వబోతున్నారట. రెండో భాగంలోనే పలువురు కొత్త ఆర్టిస్ట్ లు ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. అది మూడో పార్ట్ లో ఉండేలా ప్లాన్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో మరో పవర్‌ఫుల్ నేమ్ తెరపైకి వచ్చింది. ఇందులో `విక్రమ్` విలన్ విజయ్ సేతుపతి కనిపించబోతున్నారట. ఆయన తెలుగులో `ఉప్పెన`లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన పాత్ర ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
`పుష్ప2` ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్ జరుగుతుంది. మూడు టీమ్‌లు షూటింగ్‌లో పాల్గొంటున్నాయట.ఈ షెడ్యూల్ పూర్తయ్యాక జపాన్‌లో చిత్రీకరిస్తారట. అది `పుష్ప 2` క్లైమాక్స్ ఎపిసోడ్ అని తెలుస్తుంది. పుష్పరాజ్ ఇండియాని రూల్ చేసిన అనంతరం జపాన్‌లోనూ తన బిజినెస్‌ని విస్తరిస్తాడట. అక్కడ ఓ ఇంటర్నేషనల్ విలన్‌తో తలపడాల్సి ఉంటుందట. ఆ పాత్ర కోసం విజయ్ సేతుపతి అడుగుతున్నారని భోగట్టా. తమిళ మీడియా దీన్ని రాసుకొచ్చింది. `పుష్ప` టీమ్ విజయ్ సేతుపతిని అప్రోచ్ అయ్యారని, ఇంకా ఫైనలైజ్ కాలేదని, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే `పుష్ప3`కి షూటింగ్‌కి సంబంధించిన అప్‌డేట్ వస్తోంది. ఈ మూవీ వెంటనే ఉండబోదని అంటున్నారు. అల్లు అర్జున్ `పుష్ప2` పూర్తయిన తర్వాత ఇతర కమిట్ మెంట్లలోకి వెళ్తారట. ఆయన అట్లీ, ప్రశాంత్ నీల్‌లతో సినిమాలుంటాయని తెలుస్తుంది. ఈ మూవీస్ అయిపోయిన తర్వాత `పుష్ప3` అని చేయాలని భావిస్తున్నారట. అంటే ఇంకా అది రెండేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తంగా అయితే వెంటనే `పుష్ప3` ఉండబోతుందని టీమ్ నుంచి తెలుస్తున్న సమాచారం. బన్నీ ఫ్యాన్స్ కి ఇది నిరాశ కలిగించే వార్త అని చెప్పొచ్చు.
మరోవైపు `పుష్ప2` రిలీజ్ డేట్‌పై అనేక సందేహాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీమ్ రెండు మూడు సార్లు ఆగస్ట్ 15న వస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఇంకా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీ వాయిదా పడుతున్నట్టు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. కానీ లేటెస్ట్ ఇన్ఫో..ప్రకారం ఇండిపెండెంట్ డేకి కచ్చితంగా వస్తుందని, రిలీజ్ డేట్‌లో ఏమాత్రం మార్పు లేదని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు సాధ్యమవుతుందనేది చూడాలి. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. నెగటివ్ రోల్‌లో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు.