- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: అప్పుడే దివ్య, విక్రమ్ ల మధ్య మొదలైన గొడవలు.. లాస్యకు విడాకులు ఇవ్వనున్న నందు?
Intinti Gruhalakshmi: అప్పుడే దివ్య, విక్రమ్ ల మధ్య మొదలైన గొడవలు.. లాస్యకు విడాకులు ఇవ్వనున్న నందు?
Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి రేటింగ్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. డబ్బు కోసం సవతి కూతురు జీవితాన్ని తాకట్టు పెట్టిన ఒక సవతి తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో లాస్య తులసికి ఫోన్ చేసి బెయిల్ కోసం బానే కష్టపడుతున్నట్లు ఉన్నావు మా మధ్యన ఉన్న దూరాన్ని అడ్డుపెట్టుకొని మమ్మల్ని మరింత దూరం చేయాలని చూస్తున్నావా అంటుంది. అది నీ స్కూలు నీ సిలబస్ నాకు అలాంటివి అలవాటు లేదు. మీరిద్దరూ భార్య భర్తలు మీరిద్దరూ ఎలా పోతే నాకేంటి అంటుంది తులసి.
మరి అలాంటప్పుడు నందుకి ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అంటుంది లాస్య. నా అత్తమామలు కొడుకు కోసం బెంగ పెట్టుకున్నారు. నా పిల్లలు తండ్రి కోసం బెంగ పెట్టుకున్నారు. వాళ్ల కోసమే నందగోపాల్ గారిని విడిపించడానికి ప్రయత్నిస్తున్నాను అంటుంది తులసి. మరోవైపు బెయిల్ మీద నందుని బయటికి తీసుకొస్తాడు మాధవి భర్త.
తండ్రిని పట్టుకుని ఏడుస్తుంది దివ్య. హత్య చేసి అయినా బయటికి రావచ్చు కానీ గృహహింస కేసు నుంచి అంత త్వరగా బయటికి రాలేము అంటూ ఆ కేసు హిస్టరీ చెప్తాడు మాధవి భర్త. మంచి ఉద్దేశంతోనే ఈ సెక్షన్ పెట్టారు కానీ లాస్య ఆంటీ దీన్ని మిస్ యూస్ చేస్తుంది అంటుంది దివ్య. అలాంటి వాళ్ళని చేయలేమా అంటుంది తులసి.
మరోవైపు నీకు ఏమాత్రం విలువ ఇవ్వని వ్యక్తి కోసం ఎందుకు అంత ఎదురు చూస్తావు అని తల్లిని అడుగుతాడు విక్రమ్. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను పైకి నిబ్రంగా కనిపిస్తున్న నీ గుండెల్లో సంఘర్షణ ఊహించగలను అంటుంది రాజ్యలక్ష్మి. అది నా దురదృష్టం అంటాడు విక్రమ్. నీ నోటి నుంచి అలాంటి మాట వినకూడదు అనుకున్నాను కానీ నేను ఓడిపోయాను అంటుంది రాజ్యలక్ష్మి.
అంతలోనే దివ్య వస్తుంది. రాజ్యలక్ష్మి ఆమెని పలకరించబోతే నేను తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి అంటాడు విక్రమ్. అలాంటివి ఏమైనా ఉంటే మీ ఇద్దరూ మీ గదిలో చూసుకోండి అంటాడు తాతయ్య. ఏదో అడుగుతాను అంటున్నారు అడగనివ్వండి తాతయ్య అంటుంది. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు భర్తని నాకు కాకపోయినా అత్తగారికి చెప్పి వెళ్లాలి కదా.ఆవిడ ఎంత బాధపడింది. ఆవిడ గౌరవాన్ని నిలబెట్టలేనందుకు నేను ఎంత బాధ పడ్డానో తెలుసా అంటాడు విక్రమ్. బసవయ్య సంజయ్ కూడా ఏవేవో ప్రశ్నలు వేస్తారు. ఏం చేయాలో అంతా చని పరిస్థితుల్లో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను అంతేకానీ ఒళ్ళు పొగరుతో చేసిన పని కాదు అంటుంది దివ్య.
అమ్మకి సారీ చెప్పు అంటాడు విక్రమ్. నీ నుంచి ఇలాంటి రెస్పాన్స్ అస్సలు ఊహించలేదు. నీలో నాకు తెలియని మరో మనిషి ఉన్నాడని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఫోన్లో నేను టెన్షన్ గా మాట్లాడినప్పుడు నాకోసం వస్తాదేమో అనుకున్నాను కానీ రాలేదు. మొదటి రాత్రి ని కూడా వదులుకొని నేను పుట్టింటికి వెళ్ళింది అక్కడ ఎంజాయ్ చేయడానికి కాదు మా నాన్నని అరెస్టు చేశారని ఫోన్ వచ్చింది నేను పరిగెత్తాను అంటూ జరిగింది చెప్తుంది దివ్య. అత్తయ్య గారికి సారీ చెప్పటం అలా చెప్తే నీ ఇగో చల్లారుతుంది కదా అంటూ అత్తగారి కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్తుంది దివ్య.
అలాంటివి ఏమి వద్దు అంటూ ఆమెని హత్తుకుంటుంది రాజ్యలక్ష్మి. అక్కడ జరిగిన విషయాలు మాకు ఏమీ తెలియదు అందుకే టెన్షన్ పడ్డాము అంటుంది రాజ్యలక్ష్మి. ఇన్నాళ్లు నా స్థానం నీ గుండెల్లో అనుకున్నాను కానీ మీ మనసులో కూడా నాకు స్థానం లేదని ఇప్పుడే తెలిసింది అని విక్రమ్ తో అంటుంది దివ్య. వాడి మాటలు పట్టించుకోకు వదిలేయ్ అంటాడు తాతయ్య. గుండెల్లో గుచ్చుకునే లాగా మాట్లాడాడు ఎలా వదిలేయమంటారు అంటుంది దివ్య. మా ఇంట్లో అందరూ బాధలో ఉన్నారు వాళ్ళకి నా తోడు అవసరం. ఇకమీదట నేను ఇలాగే పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది ఎవరికైనా ప్రాబ్లం అయితే ఇప్పుడే చెప్పండి అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది దివ్య.
మరోవైపు కొడుకు కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు పరంధామయ్య దంపతులు. అప్పుడే ఇంటికి వచ్చిన నందు గుమ్మంలోనే ఆగిపోతాడు. కొడుకుని చేయి పట్టి లోపలికి తీసుకు వస్తుంది అనసూయ. తరువాయి భాగంలో లాస్య కి డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు నందు. మన వైపు ఒక దివ్యని ఓదార్చి మామయ్య గారికి ఎలాంటి హెల్ప్ అవసరమైన నేను చూసుకుంటాను అంటూ భార్యకి మాటిస్తాడు విక్రమ్. అదే విషయాన్ని రాజ్యలక్ష్మి కి ఉప్పందిస్తాడు బసవయ్య