- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: దివ్యని అసహ్యించుకుంటున్న విక్రమ్.. మళ్ళీ దంపతులు కానున్న నందు, తులసి?
Intinti Gruhalakshmi: దివ్యని అసహ్యించుకుంటున్న విక్రమ్.. మళ్ళీ దంపతులు కానున్న నందు, తులసి?
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ఆస్తికోసం సగతి కొడుకు కాపురంలో నిప్పులు పోస్తున్న ఒక సవతి తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో బయటి నుంచి వచ్చిన తులసి తల్లిని హత్తుకుని బాధపడుతుంది. నా కళ్ళ కూతుర్ని నా మాటలతో ఇబ్బంది పెట్టాను తను నన్ను తప్పుగా అనుకుంటుందేమో అని తల్లికి చెప్పుకొని బాధపడుతుంది. తను ఎందుకు అలా అనుకుంటుంది పాతికేళ్ళు పెంచి పెద్ద చేశావు నువ్వు ఎలాంటి దానివో దానికి తెలుసు కదా అంటూ సర్ది చెప్తుంది తల్లి.
అయినా తనని ఎప్పుడు ఏమీ అనవు కదా తనని బాధపెట్టే అంతగా తప్పు ఏం చేసింది అంటుంది అనసూయ. వాళ్ల నాన్న అరెస్టు అయిన దగ్గర్నుంచి దివ్య మనసు ఇక్కడే తిరుగుతుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఇంట్లో వాళ్ళు దాంతో ఆడుకుంటున్నారు. మీ కూతురు చెప్పిన మాట వినటం లేదు అంటూ నాకే కంప్లైంట్ చేశారు. అందుకే దానిని దూరం పెట్టాలని తనని బాధపెట్టేలాగా మాట్లాడాను అంటుంది తులసి.
ఆమెకి ధైర్యం చెప్తారు అత్త, తల్లి. మరోవైపు రాజ్యలక్ష్మి భోజనం తీసుకుని వచ్చి మీ ఆవిడ నామీద కోపంతో భోజనం చేయలేదు. నాకు తన మీద కోపం లేదు తనకి ఈ ఇంట్లో నేను తల్లి స్థానంలో ఉన్నాను మంచి చెడు చెప్పే బాధ్యత ఉంది అంత మాత్రం చేత తనంటే నాకు ఇష్టం లేకుండా పోతుందా? అలిగి భోజనం మానేస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాను వెళ్లి మీ ఆవిడకి తినిపించు అని తన నటన కౌశలాన్ని చూపిస్తుంది రాజ్యలక్ష్మి.
ఇప్పుడు తనకి భర్త ప్రేమ కన్నా తల్లి ప్రేమే అవసరం దయచేసి నువ్వే తినిపించు అంటాడు విక్రమ్. అలాగే నాన్న దానికి నువ్వు ఎందుకు అంత బ్రతిమాలటం అంటూ దివ్య దగ్గరికి ప్లేట్ తీసుకొని వెళ్లి నామీద పెత్తనం చేయాలని చూస్తే ఇలాగే ఉంటుంది చచ్చినట్లు నేను చెప్పినట్లు విను అని ఇంకా ఏదో మాట్లాడుతుంది రాజ్యలక్ష్మి. కానీ ఇంతలో దూరంగా వాళ్ళిద్దర్నీ విక్రమ్ గమనిస్తూ ఉండడం గమనించి నవ్వుతూనే తిట్ల దండకం ప్రారంభిస్తుంది.
కోపం మీద ఉన్న దివ్య భోజనం తినిపిస్తున్న ఆమె చేతిని నెట్టేస్తుంది. దూరం నుంచి చూస్తున్న విక్రమ్ దివ్య ని అపార్థం చేసుకుంటాడు. అమ్మ అంతలా ప్రేమ చూపిస్తుంటే దివ్య మరి ఎక్కువ చేస్తుంది అనుకుంటాడు. నీ మొగుడు ఒక పిచ్చోడు రేపు మాపో బలివ్వబోయే మేక అంటూ దివ్యని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది రాజ్యలక్ష్మి. దివ్య కోపంతో భోజనం ప్లేట్ విసిరేస్తుంది.
అది చూసిన విక్రమ్ రెచ్చిపోయి దివ్యని చివాట్లు పెడతాడు. నువ్వు కలుగజేసుకోవద్దు తనది చిన్నతనం అంటూ కొడుకు ముందు ఓవరాక్షన్ చేస్తుంది రాజ్యలక్ష్మి. కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతున్నందుకు ఆనందపడుతుంది రాజ్యలక్ష్మి. మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చిక్కుల్లో పడేస్తే మాజీ భార్య రక్షించాలని చూస్తుంది ఇదేమి చిత్రమో అంటుంది అనసూయ.
నా కూతురు అంతే సాయం చేయాలనిపిస్తే తన పర భేదం చూపించకుండా చేస్తుంది అంటుంది సరస్వతి. నందు లాస్యకి విడాకులు ఇచ్చేసేలాగా ఉన్నాడు తులసి తో తెగిపోయిన బంధాన్ని మళ్లీ ముడి పెడితే బాగున్ను అంటుంది అనసూయ. అది జరగని పని.. నా కూతురు కొన్ని విషయాల్లో ఎంత సౌమ్యంగా ఉంటుందో కొన్ని విషయాల్లో అంత మొండిగానూ ఉంటుంది. ఈ విషయంలో లేనిపోని అసలు పెట్టుకోవద్దు అంటుంది సరస్వతి.
అదే సమయంలో ఇన్నాళ్లు మనకి లాస్య తోనే సమస్యలు ఇప్పుడు రాజ్యలక్ష్మి కూడా తోడైంది. వాళ్లు వాళ్లు ఒకటయ్యే బలం పంచుకున్నారు కానీ తమ్ముడితో చెప్తుంది తులసి. ఇప్పుడు మనం చేయవలసింది కూడా అదే అక్క. లాస్యకి శత్రువులు ఎవరో కనుక్కోవాలి అంటాడు దీపక్. లాస్య మాజీ భర్తకి లాస్య అంటే పీకల వరకు కోపం ఉంది. హాస్య గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి అతనే అంటుంది తులసి.
కోర్టుకు వచ్చే సాక్ష్యం చెప్తాడా అతనిని ఒప్పించే అంత చనువు నీకు ఉందా అని అడుగుతాడు దీపక్. ఉంది అంటుంది తులసి. తరువాయి భాగంలో మెట్ల మీద నుంచి పడిపోబోతాడు విక్రమ్ తండ్రి. సమయానికి వచ్చి దివ్య సేవ్ చేస్తుంది. కానీ అదే సమయానికి బసవయ్య రాజ్యలక్ష్మి వచ్చి నా భర్తని మెట్లు మెయిన్స్ ని తోసే చేయాలని చూస్తావా దయచేసి నా బిడ్డని తండ్రి లేని బిడ్డని చేయొద్దు అంటూ ఓవరాక్షన్ చేస్తుంది. అది నిజమేనని నమ్మిన విక్రమ్ దివ్యని అసహ్యించుకుంటాడు.