- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: మామ ట్రీట్మెంట్ గురించి తెలుసుకొని షాకైన దివ్య.. భార్య మీద చెయ్యెత్తిన విక్రమ్!
Intinti Gruhalakshmi: మామ ట్రీట్మెంట్ గురించి తెలుసుకొని షాకైన దివ్య.. భార్య మీద చెయ్యెత్తిన విక్రమ్!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటికి గృహలక్ష్మి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. కూతురి కాపురం బాగోవటం కోసం కూతుర్నే దూరం చేసుకుంటున్న తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రాజ్యలక్ష్మి తులసికి ఫోన్ చేసి నేను మీకు ఎన్నిసార్లు హెచ్చరించిన మీరు పట్టించుకోవడం లేదు కూతుర్ని అచ్చోసిన ఆంబోతు లాగా వదిలేసారు అంటుంది. అలాంటిదేమీ లేదు వదినగారు మీరు చెప్పిన దగ్గర నుంచి తనని పుట్టింటికి రానివ్వడం లేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు అంటుంది తులసి. అయినా కూడా లెక్కచేయకుండా మీ ఇంటికి బయలుదేరుతుంది.
తన మొండితనం వల్లే ఇప్పటివరకు వాళ్లకి మొదటి రాత్రి కూడా జరగలేదు. శాంతి పూజ చేస్తే మంచిది అని చెప్తే వినిపించుకోవడం లేదు. మొగుడికి బాధ పూజ చేయకపోయినా కనీసం విలువ ఇవ్వాలి కదా అంటుంది రాజ్యలక్ష్మి. తను ఎప్పుడూ అలా చేయదు అంటుంది తులసి. అంటే నేను అబద్ధం చెపుతున్నానా అటు మా వాడిని ఇటు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.
ఇకనైనా మీ కూతురికి పద్ధతులు నేర్పించండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రాజ్యలక్ష్మి. ఇది జరిగింది అంటూ భర్తకి చెప్తుంది తులసి. తన మాటలు నమ్ముతున్నావా అంటాడు నందు. నిజం లేకపోవచ్చు కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది కదా అంటుంది తులసి. మరోవైపు కోపంతో రగిలిపోతున్న దివ్య నేను ఎంత ఎలా ఉన్నా నా కన్నా రెండు అడుగుల ముందే ఉంటున్నారు అత్తగారు అనుకుంటుంది.
ఆమె దగ్గరికి జ్యూస్ తీసుకువచ్చి కూల్ అవ్వు కోడలు పిల్లా.. నువ్వు ఎన్ని గంతులు వేసినా నా ముందు చెల్లవు. నాకు ఎంత ధైర్యం లేకపోతే శత్రువుని ఇంటి కోడలుగా చేసుకుంటాను. నా కాలి కింద చెప్పు లాగా పడి వుండు లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అంటుంది రాజ్యలక్ష్మి. అలా ఎప్పటికీ జరగదు నా భర్త కి నేను మీరంటే ఎంత ప్రేమ అంతకన్నా నేనంటే ఇంకా ఎక్కువ ప్రేమ అంటుంది దివ్య.
ఎంత నీ కొంగు పట్టుకుని తిరిగినా చివరికి వాడు చూసేది నా వైపే అంటుంది రాజ్యలక్ష్మి. మీది దొంగ ప్రేమ అని త్వరలోనే నా భర్తకి అర్థమయ్యేలాగా చేస్తాను ఈ ఇంటిలోంచి పారిపోయే పరిస్థితికి తీసుకు వస్తాను అని అత్తతో ఛాలెంజ్ చేస్తుంది దివ్య. ముందు నీ మొగుడు నువ్వు చెప్పింది నమ్మేలాగా చూసుకో తర్వాత చూద్దాం అంటూ దివ్యని రెచ్చగొట్టేలాగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజ్యలక్ష్మి.
మరోవైపు అందరూ భోజనాలు చేస్తూ ఉండగా రాములమ్మ వచ్చి ఈరోజు నా కూతురు పుట్టిన రోజు అందుకే గారెలు పులిహార తీసుకువచ్చాను అని చెప్పి తులసికి పరంధామయ్య దంపతులకు వడ్డిస్తుంది. అదేంటి మా ముగ్గురికే తీసుకొచ్చావా అంటుంది తులసి. అందరికీ తెచ్చానమ్మా కానీ లాస్యమ్మ గారు వాళ్ళు ఏమంటారు అని అంటుంది రాములమ్మ. మాకు కూడా వడ్డించు అంటుంది లాస్య.
గారెలు తిన్న పరంధామయ్య దంపతులు, నందు చిన్నగా నవ్వుకుంటారు. ఇదంతా తులసి పని తనే ప్రతిసారి నన్ను ఆదుకుంటుంది అని కడుపునిండా భోజనం చేస్తాడు నందు. తృప్తిగా నవ్వుకుంటుంది తులసి. సీన్ కట్ చేస్తే తులసిని కలిసిన విక్రమ్ ఎందుకు అత్తయ్య బయట కలవాలన్నారు అని తులసిని అడుగుతాడు. ఏమీ లేదు బాబు కోర్టు గొడవలు ఇన్నాళ్లు మిమ్మల్ని పట్టించుకోలేదు మీరు బాగానే ఉన్నారు కదా.
దివ్య వల్ల మీరేమీ ఇబ్బంది పడటం లేదు కదా అంటుంది తులసి. లేదు అత్తయ్య.. ఎంతైనా ఆడపిల్ల కథ తనకి కూడా పుట్టింటి మీద ఆశ ఉంటుంది మా అమ్మ కూడా తనకి బాగా సపోర్టు ఇస్తుంది అంటాడు విక్రమ్. ఈ హడావుడిలో ఒక్కడే మీ ఫస్ట్ నైట్ గురించి కూడా పట్టించుకోలేదు అంటుంది తులసి. ఇంకో రెండు నెలల వరకు ముహూర్తాలు లేవంట కదా అంటాడు విక్రమ్.
అదేదో శాంతి పూజ చేస్తే మీకు మంచి జరుగుతుందంట కదా అంటుంది తులసి. అలాంటిదేమీ లేదు అత్తయ్య అలా అయితే మామూలు నా చేత పూజ చేయించేది కదా అంటాడు విక్రమ్. అంటే రాజలక్ష్మి చెప్పింది అంతా అబద్ధం అన్నమాట అని మనసులోనే తిట్టుకుంటుంది తులసి. అల్లుడుతో నాలుగు మాటలు మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
తులసి ఏం మాట్లాడటానికి పిలిచిందో అర్థం కాదు విక్రమ్ కి తర్వాత తీరిగ్గా మాట్లాడాలి అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మామగారి రూమ్ నుంచి వస్తున్న సిస్టర్ ని ఏం చేస్తున్నావు ఆ టాబ్లెట్స్ ఏంటి అని అడుగుతుంది దివ్య. ఇవి రోజంతా మత్తు లో ఉంచే మాత్రలు ఇదంతా ఇంట్లో వాళ్ళకి తెలిసే జరుగుతుంది నా గురించి మాత్రం బయట పెట్టొద్దు అంటుంది సిస్టర్.
అత్తగారి రాక్షసత్వాన్ని అసహ్యించుకుంటుంది దివ్య.ఆ టాబ్లెట్స్ చూసి అవి స్లో పాయిజన్ టాబ్లెట్స్ అని తెలుసుకొని వాటిని కోపంతో బయటకు విసిరేస్తుంది. అది నేరుగా అప్పుడే ఇంట్లోకి వస్తున్న విక్రమ్ పాదాల మీద పడతాయి. ఏంటిది అని అడుగుతాడు విక్రమ్. తరువాయి భాగంలో తల్లి చెప్పిన చాడీలు నమ్మి భార్యని కొట్టడానికి చెయ్యెత్తుతాడు విక్రమ్.