- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: బసవయ్య మీద రెచ్చిపోయిన విక్రమ్.. అత్తపై డైరెక్ట్ అటాక్ చేసిన దివ్య!
Intinti Gruhalakshmi: బసవయ్య మీద రెచ్చిపోయిన విక్రమ్.. అత్తపై డైరెక్ట్ అటాక్ చేసిన దివ్య!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కథ కథనాలతో మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. సవతి తల్లిని గుడ్డిగా నమ్ముతున్న ఒక అమాయకపు కొడుకు కదా ఈ సీరియల్. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మా అమ్మ వాళ్లు నాకోసం వచ్చారు.. మీరు బిజీగా ఉంటే మీ పని మీరు చేసుకోండి మేము మా గదిలోకి వెళ్లి కబుర్లు చెప్పుకుంటాము అంటుంది దివ్య. ఇక్కడ సమస్య కబుర్లు గురించి కాదు నువ్వు ఏదైనా చేసేటప్పుడు మీ అత్తగారికి చెప్పి చెయ్యు. ఆవిడ అవమానాలు భరిస్తుంది కానీ ఒక్క మాట అనదు మనమే అర్థం చేసుకోవాలి అంటాడు బసవయ్య.
అంతలోనే విక్రమ్ చెప్పులు కుట్టించి తీసుకువస్తాడు చెప్పులు మీద దుమ్ము ఉంది అని రాజ్యలక్ష్మి అంటే తన షర్టుతో తుడిచి మరీ స్వయంగా ఆమె కాళ్ళకి చెప్పులు వేస్తాడు. ఇదంతా చూస్తున్న తులసి వాళ్ళు బాధపడతారు. తల్లి గురించి నిజం ఎప్పుడు తెలుసుకుంటాడో అని భర్తని తలుచుకొని బాధపడుతుంది దివ్య. అది సరే కానీ అత్తయ్య వాళ్ళని ఇక్కడ ఎందుకు ఉంచేసావు అని అడుగుతాడు.
అత్తయ్య పర్మిషన్ లేకుండా మా అమ్మ వాళ్ళని పిలిచానని మీ మావయ్య రాద్ధాంతం చేస్తున్నారు. పాపం అత్తయ్య అసలు ఏమీ అనలేదు అంటుంది దివ్య. అసలు సమస్యలన్నీ నీవల్లే అయినా వాళ్ళు ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఏంటి? నీవల్లే అమ్మకి సగం చెడ్డ పేరు తమ్ముడు అని అభిమానంతో ఆమె ఊరుకోవచ్చు కానీ నేను ఊరుకోను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు విక్రమ్.
బసవయ్య తరపున తనే అత్తమామలకి క్షమాపణ చెప్తాడు. అత్తమామల్ని పైకి తీసుకు వెళ్ళమని దివ్యకి చెప్పి తను బయటికి వెళ్తాడు విక్రమ్. మరోవైపు కేఫ్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు లాస్య, భాగ్య. బావగారిని మరీ దెబ్బ మీద దెబ్బ కొడుతున్నావు కనీసం అబ్బా అనటానికి కూడా టైం ఇవ్వటం లేదు అతనితో కలిసి కాపురం చేయాలని ఉంటే పద్ధతి ఇది కాదేమో అంటుంది భాగ్య.
ముందు కలిసి కాపురం చేయటానికి ఒప్పుకుంటే చాలు తర్వాత అతన్ని ఎలా మలుచుకోవాలో నాకు బాగా తెలుసు అంటుంది లాస్య. ఇంతలో కెఫె మేనేజర్ వచ్చి సార్ మిమ్మల్ని మర్యాదగా బయటికి వెళ్ళమన్నారు అని చెప్తాడు. మీ సార్ తాళాలు ఎందుకు ఇవ్వరో నేను చూస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లాస్య. మరోవైపు మీ అత్తగారు నిన్ను బాగానే చూసుకుంటుందా అని అడుగుతారు నందు దంపతులు.
నిజం చెప్తే ఎక్కడ బాధపడతారో అని మా అత్తగారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్తుంది దివ్య. మీ అమ్మాయి గురించి మీరేమీ బాధపడకండి తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంటాడు విక్రమ్. పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా పర్వాలేదు కన్నీరు పెట్టుకోకుండా చూస్తే చాలు అంటాడు నందు. విక్రమ్ దంపతులు తులసి దంపతులకు బట్టలు పెడతారు.
ఇంతలో మీరు కెఫేకి కచ్చితంగా రావాలి సార్ లాస్య మేడం కొందరు ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారు నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అంటూ కేఫై మేనేజర్ ఫోన్ చేస్తాడు. కంగారుగా బయలుదేరి కెఫీకి వెళ్తారు నందు వాళ్లు. అక్కడ లాస్య అమాయకంగా మొహం పెట్టుకొని ఉంటుంది. ఇంట్లోంచి బయటికి పంపించేసింది చాలదా కేఫై కూడా లాక్కుంటే తను ఎలా బ్రతుకుతుంది అంటూ నిలదీస్తారు మహిళా మణులు.
ఆయననేమీ అనకండి ఆయన అమాయకుడు చాలా మంచివాడు అంటుంది లాస్య. అలాంటప్పుడు కేసు ఎందుకు పెట్టావు అతను కాళ్ల దగ్గరే పడుండవలసింది కదా అంటారు మహిళామణులు. ఆయన మీద కోపంతో పెట్టలేదు ఆయన మనసుని పాడు చేస్తున్న చుట్టూ ఉన్న వాళ్ళ మీద కోపంతో అలా చేశాను అంటూ తులసి గురించి లేనిపోనివన్నీ చెప్తుంది లాస్య. కోపాన్ని భరించలేక చాచి కొడతాడు నందు. ఏం చేస్తున్నారు అంటూ కోప్పడుతుంది తులసి.
చూశారా రోజు ఇంట్లో ఇదే పరిస్థితి. రెచ్చగొట్టినట్లు రెచ్చగొట్టి ఇప్పుడు మళ్లీ ఎలా మాట్లాడుతుందో చూడండి అంటూ ఆస్కార్ లెవెల్లో నటిస్తుంది లాస్య. ముందు తనని బయటికి పంపించేయండి అని మహిళా మణులతో చెప్తుంది లాస్య. వెళ్లవలసింది ఆమె కాదు నువ్వు అంటూ మెడ పట్టి బయటకి గెంటేస్తాడు నందు. నా మీద కోర్టులో కేసు వేసావు కదా అక్కడే చూసుకుందాము అంతవరకు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కోపంగా మాట్లాడుతాడు. ఇంకా అక్కడే ఉన్న మహిళా మణులతో మీకు మళ్ళీ విడిగా చెప్పాలా అంటూ కేకలు వేస్తాడు.
నీ సంగతి చూస్తాం అంటూ బయటికి వచ్చి లాస్యని ఓదారుస్తారు మహిళామణులు. తరువాయి భాగంలో పంట డబ్బులు తీసుకువచ్చి తల్లికి ఇస్తాడు విక్రమ్. ఇకనుంచి బాధ్యత అంతా పెద్ద కోడలిదే అంటూ తాళాలు దివ్యకి ఇవ్వబోతుంది రాజ్యలక్ష్మి. ఇప్పుడే కాదు ఎప్పుడూ మా అమ్మదే పై చేయి ఉండాలి అంటూ డబ్బు తాళాలు తల్లి చేతుల్లో పెట్టి వెళ్ళిపోతాడు విక్రమ్. తల్లిగా దొంగ ప్రేమ చూపిస్తూ మా ఆయన్ని గుప్పెట్లో పెట్టుకున్నావు అంటూ డైరెక్ట్ అటాక్ చేస్తుంది దివ్య.