MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 15 ఏళ్లకే స్టార్ హీరోయిన్, చిరంజీవి,బాలకృష్ణ తో ఏకంగా 35 సినిమాలు చేసిన లేడీ సూపర్ స్టార్ ?

15 ఏళ్లకే స్టార్ హీరోయిన్, చిరంజీవి,బాలకృష్ణ తో ఏకంగా 35 సినిమాలు చేసిన లేడీ సూపర్ స్టార్ ?

15 ఏళ్లకే హీరోయిన్ గా స్టార్ డమ్ చూసింది, టాలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుసగా హిట్లు కొట్టింది, సినిమాలు మానేసి పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? 

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jun 27 2025, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image Credit : Asianet News

ఆమె ఒక స్టార్ హీరోయిన్, టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న స్టార్. ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోయిన తరువాత కూడా టాలీవుడ్ లో ఆమె మార్క్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. చిరంజీవితో 19 సినిమాలు, బాలకృష్ణతో 16 సినిమాలు చేసిన అరుదైన రికార్డ్ ఆమె సొంతం. 15 ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసిన తార ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు విజయశాంతి.

27
Image Credit : Facebook

తెలుగు సినిమా రంగంలో లేడీ అమితాబ్ గా ఇమేజ్ పొందిన ప్రముఖ నటి విజయశాంతి. ఆమె సినీ ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమైన ఆమె, తన అందం, నటనతో తెలుగు, తమిళం, హిందీ భాషలలో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

విజయశాంతి 1980లో తమిళ చిత్రం కల్లుక్కల్ తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సమయంలో ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. తొలి సినిమాతోనే తన నటనకు ప్రశంసలు పొందిన ఆమె, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఆమె రికార్డు స్థాయిలో అవకాశాలు అందుకున్నారు.

Related Articles

Related image1
40 లక్షలు ఖర్చుపెట్టి యాక్టర్ ను బ్రతికించిన చిరంజీవి, మరోసారి అస్వస్థతకు గురైన నటుడు
Related image2
60 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
37
Image Credit : our own

మెగాస్టార్ చిరంజీవితో కలిసి 19 సినిమాలు, నందమూరి బాలకృష్ణతో కలిసి 16 సినిమాల్లో విజయశాంతి నటించారు. కృష్ణ, సుమన్, రాజశేఖర్ వంటి తెలుగు స్టార్ హీరోలతో సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆమె నటించారు.

 అయితే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఆమె లేడీ ఓరియెంటెడ్, మాస్ యాక్షన్ సినిమాల్లో కూడా నటించి సక్సెస్ అయ్యారు. విమెన్ సెంట్రిక్ మూవీస్ తో ఎక్కువ హిట్లు కొట్టిన ఘనత విజయశాంతిదే. అందుకే ఆమెను లేడీ అమితాబచ్చ, లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు.

47
Image Credit : our own

1991లో విడుదలైన కర్తవ్యం సినిమా విజయశాంతి మూవీ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. ఇందులో ఆమె పోషించిన పాత్రకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో ఆమె పాత్రకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. హీరో వినోద్ కుమార్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా విజయశాంతికి భారీ గుర్తింపు తెచ్చింది.

57
Image Credit : Google

రీసెంట్ గా వినిపిస్తున్న లేడీ అమితాబ్, లేడీ పవర్ స్టార్, లేడీ సూపర్ స్టార్ బిరుదులు విజయశాంతికి అప్పట్లోనే ఇచ్చారు అభిమానులు. విజయ శాంతి యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆమె చేసిన సినిమాలు ఆడియన్స్ ను బాగా ఆకర్శించాయి. 

తన కెరీర్ లో నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు విజయశాంతి. సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా విజయశాంతికి వరుసగా అవకాశాలు వచ్చాయి. 1989లో అనిల్ కపూర్ నటించిన హిందీ చిత్రం ఈశ్వర్లో ఆమె లలిత పాత్రలో కనిపించారు. ఈ పాత్రకు కూడా ఆమె ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.

67
Image Credit : our own

రీసెంట్ గా వినిపిస్తున్న లేడీ అమితాబ్, లేడీ పవర్ స్టార్, లేడీ సూపర్ స్టార్ బిరుదులు విజయశాంతికి అప్పట్లోనే ఇచ్చారు అభిమానులు. విజయ శాంతి యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆమె చేసిన సినిమాలు ఆడియన్స్ ను బాగా ఆకర్శించాయి. తన కెరీర్ లో నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు విజయశాంతి.

 సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా విజయశాంతికి వరుసగా అవకాశాలు వచ్చాయి. 1989లో అనిల్ కపూర్ నటించిన హిందీ చిత్రం ఈశ్వర్లో ఆమె లలిత పాత్రలో కనిపించారు. ఈ పాత్రకు కూడా ఆమె ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.

77
Image Credit : our own

విజయశాంతి, సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన ఆమె, 2000ల దశకంలో పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించారు. ఈ విరామం అనంతరం, 2020లో మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె కీలకమైన పాత్రను ఆమె పోషించారు.

రీ ఎంట్రీలో చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తున్నారు విజయశాంతి. వచ్చిన ప్రతీ అవకాశానికి ఒకే చెప్పకుండా సెలక్టీవ్ గా వెళ్తున్నారు. రీసెంట్ గా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో ఐపీఎస్ వైజయంతిగా విజయశాంతి కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాతో మరోసారి ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Hey Balwanth 6 Days Collections: హే బలవంత్‌ 6 రోజుల కలెక్షన్లు.. సుహాస్‌ మూవీ నిజంగానే సేఫ్‌ అయ్యిందా?
Recommended image2
రూ. 100 కోట్ల సినిమా.. కట్ చేస్తే.. తెగింది మాత్రం 20 టికెట్లు మాత్రమే.. ఆ మూవీ ఏదంటే.?
Recommended image3
హీరోగా చిరంజీవి.. నిర్మాతగా శ్రీదేవి.. షూట్ స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటంటే.?
Related Stories
Recommended image1
40 లక్షలు ఖర్చుపెట్టి యాక్టర్ ను బ్రతికించిన చిరంజీవి, మరోసారి అస్వస్థతకు గురైన నటుడు
Recommended image2
60 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved