చిరంజీవి పార్టీ కల్చర్‌పై విజయశాంతి క్రేజీ కామెంట్.. తాను అలాంటి రకం కాదు
చిరంజీవి అండ్ ఆయన 80, 90 బ్యాచ్ అంతా కలిసి ప్రతి ఏడాది పార్టీలు చేసుకుంటారు. ఒక్కో ఏడాది ఒక్కొక్కరు ఆతిథ్యం ఇస్తుంటారు. దీనిపై లేడీ సూపర్ స్టార్ హాట్ కామెంట్ చేసింది.

హిట్ కాంబినేషన్‌గా విజయశాంతి, చిరంజీవి
టాలీవుడ్ లో చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ ఒక బిగ్గెస్ట్ హిట్ కాంబోగా చెప్పొచ్చు. వీరిద్దరు ఆల్మోస్ట్ 18 సినిమాల వరకు చేశారు. మంచి జోడీగా నిరూపించుకున్నారు.
వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే అప్పట్లో యమ క్రేజ్ ఉండేది. డాన్సుల పరంగానూ మంచి పోటీ ఉండేది. చిరంజీవికి పోటీగా విజయశాంతి డాన్సులు చేసేది. అందుకే వెండితెరపై వీరిద్దరు ఉన్నారంటే రచ్చ రచ్చే అని చెప్పొచ్చు.
ఆ తర్వాత చిరంజీవికి దూరమైన విజయశాంతి
విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం స్టార్ట్ చేశాక.. చిరంజీవితో మూవీస్ తగ్గించారు. ఆయనతోనే కాదు బాలయ్యతో కూడా సినిమాలు తగ్గించారు.
ఆమె హీరోలకు సమానంగా పారితోషికం తీసుకోవడం, ఆమె సినిమాలు అదే స్థాయిలో కలెక్షన్లని వసూలు చేయడంతో తానే సినిమాలు చేసుకున్నారు. ఆ తర్వాత చాలా తక్కువగానే హీరోలకు జోడీగా చేసింది. మొత్తంగా లేడీ సూపర్ స్టార్‌గా రాణించింది.
80 బ్యాచ్‌తో చిరంజీవి పార్టీ
ఇదిలా ఉంటే చిరంజీవితోపాటు విజయశాంతి కూడా 80, 90 బ్యాచ్ స్టార్స్ లో ఒకరు. కానీ వారి పార్టీల్లో లేడీ సూపర్ స్టార్ ఎప్పుడూ కనిపించలేదు.
చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాధ, రాధిక, రమ్యకృష్ణ, మీనా, సుహాసిని, సుమలత, మోహన్ లాల్ ఇలా చాలా మంది స్టార్స్ కలిసి ప్రతి ఏడాది పార్టీ చేసుకుంటారు.
ఒక్కో ఏడాది ఒక్కొక్కరి ఇంట్లో ఈ పార్టీ ఉంటుంది. అయితే ఈ పార్టీలకు విజయశాంతి ఎప్పుడూ హాజరు కాలేదు. దీనిపై ఆమె స్పందించారు. హాట్ కామెంట్ చేశారు.
చిరంజీవి నన్ను పార్టీలకు పిలవలేదు
తనని చిరంజీవి ఎప్పుడూ పిలవలేదని చెప్పింది విజయశాంతి. ఆయా పార్టీలకు తనని పిలవరని వెల్లడించింది. అంతేకాదు, ఇలాంటి పార్టీలకు తాను దూరం అని స్పష్టం చేసింది.
తాను వెళితే షూటింగ్ లకు, లేదంటే ఇంట్లోనే ఉంటానని, ఫ్యామిలీతోనే గడుపుతానని చెప్పింది. రాజకీయ ఉద్యమాలు, లేదంటే ఇళ్లు, ఇలానే తన లైఫ్ ఉంటుందని, ఇలాంటి పార్టీలకు వెళ్లే రకాన్ని కాదు అని వెల్లడించింది.
నేను పార్టీలకు దూరం
ఇంకా ఆమె చెబుతూ, చిరంజీవి తనని పిలిచే ప్రయత్నం చేయలేదు, ఒకవేళ పిలిచినా తాను వెళ్లను అని చెప్పింది. ఈ పార్టీలకు తనకు నచ్చవు అని, అందుకే దూరంగా ఉంటానని, ఎప్పుడూ తనని ఆహ్వానించే ప్రయత్నం చేయరు అని వెల్లడించింది.
తనకు ఇలాంటివి ఇష్టం ఉండదని, షూటింగ్‌లు, ఇళ్లు తప్ప తనకు వేరే ప్రపంచం ఉండదని వెల్లడించింది. అందుకే ఆయా పార్టీల్లో తాను కనిపించనని చెప్పింది విజయశాంతి.
ఆమె ఇటీవల రీ ఎంట్రీ ఇస్తూ మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు`, కళ్యాణ్ రామ్ `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.