- Home
- Entertainment
- పారితోషికం తగ్గించుకుని ఏఎన్నార్ తో అనుకున్న మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన శోభన్ బాబు.. ఆ సంచలనం ఏంటో తెలుసా?
పారితోషికం తగ్గించుకుని ఏఎన్నార్ తో అనుకున్న మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన శోభన్ బాబు.. ఆ సంచలనం ఏంటో తెలుసా?
శోభన్ బాబు తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో `బలిపీఠం` ఒకటి. అయితే ఏఎన్నార్ చేయాల్సిన చిత్రం తాను చేసి కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు సోగ్గాడు.

శోభన్ బాబుతో సినిమాతో సినిమాకి నిర్మాతలు క్యూ
శోభన్ బాబు.. సోగ్గాడిగా విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ చిత్రాలతో ఆయన ఎక్కువగా ఆకట్టుకున్నారు. మహిళా ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. శోభన్ బాబుతో సినిమా అంటే అప్పట్లో మినిమమ్ గ్యారంటీ అనేది ఉండేది. అందుకే ఆయనతో మూవీస్ చేసేందుకు బడా నిర్మాతలు సైతం క్యూ కట్టేవారు. పారితోషికం ఎక్కువైనా ఇచ్చి సినిమాలు చేసేవారు.
రామారావుని మించిన క్రేజ్ శోభన్‌బాబు సొంతం
ఓ సందర్భంలో ఎన్టీఆరే ఆయన్ని చూసి కుళ్లుకున్నారట. ఇప్పుడు శోభన్ బాబు టైమ్ నడుస్తుందని అన్నారట. ఆ సమయంలో రామారావు కాస్త డౌన్‌లో ఉన్నారు. అలా సోగ్గాడు తనకంటూ ఇండస్ట్రీలో సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. లెజెండరీ హీరోగా ఎదిగారు.
అయితే శోభన్ బాబు కెరీర్‌లో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. కమర్షియల్‌గా కాసుల వర్షం కురిపించాయి. వాటిలో `బలిపీఠం` మూవీ చాలా ప్రత్యేకం. అప్పట్లోనే ఇదొక ట్రెండ్ సెట్టర్.
పట్టుబట్టి `బలిపీఠం` మూవీ కలర్ చేయించిన శోభన్ బాబు
`బలిపీఠం` మూవీ దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందింది. శోభన్‌బాబు, దాసరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రమిది. ఇందులో శారద హీరోయిన్‌గా నటించింది. అప్పటికే సోగ్గాడు, శారద కాంబినేషన్‌లో రెండుమూడు సినిమాలు వచ్చాయి.
అయితే ఈ చిత్రాన్ని కలర్‌లో తీశారు. అప్పుడప్పుడే సినిమాల్లోకి కలర్ వచ్చింది. కృష్ణ అలాంటి చిత్రాలు చేస్తున్నారు. శోభన్ బాబు కూడా హీరోగా కలర్ సినిమాలు స్టార్ట్ చేశారు. అప్పటికే `డాక్టర్ బాబు` చేశారు.
దీంతో ఈ చిత్రాన్ని కూడా పట్టుబట్టి శోభన్ బాబు కలర్‌లో తీయించారు. ఈస్ట్ మన్ కలర్ అనేది అప్పట్లో యమ క్రేజ్ ఉండేది. ఈ కలర్‌లో సినిమా అంటే జనం థియేటర్లకి క్యూ కట్టేవారు. ఆ పల్స్ తెలుసుకున్న శోభన్ బాబు ఈ చిత్రాన్ని కూడా అలానే చేయించారు.
రెమ్యూనరేషన్ తగ్గించుకున్న శోభన్ బాబు
నిర్మాతలు, దర్శకుడు దాసరి వెనకాడారు. ఎందుకంటే కలర్‌లో మూవీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బడ్జెట్ పెరిగిపోతుంది. ఇది రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని భావించారు.
వాళ్లు వెనకడుగు వేయడంతో శోభన్ బాబు ఏకంగా తన పారితోషికం తగ్గించుకొని ఈ మూవీ చేశారట. సుమారు 25 శాతం పారితోషికంలో కోత పెట్టుకుని `బలిపీఠం` సినిమా చేశారు.
అయితే ఇందులో హీరోగా మొదట అక్కినేని నాగేశ్వరరావుని అనుకున్నారు. శోభన్ బాబు కూడా ఈ మూవీ తనకు రాదు అని భావించారట. అక్కినేని అనారోగ్యంతో ఉండటంతో శోభన్ బాబు వద్దకు వచ్చింది. అంతేకాదు వేరే ఇద్దరు ముగ్గురిని అనుకుని చివరికి సోగ్గాడితో చేశారు.
ఏఎన్నార్ చేయాల్సిన `బలిపీఠం`తో సోగ్గాడు సంచలనం
రంగనాయకమ్మ `బలిపీఠం` నవల ఆధారంగా రూపొందిన ఈ మూవీ 1975 జులై 17న విడుదలైంది. భారీ విజయాన్ని సాధించింది. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకి క్యూ కట్టారు. అదే సమయంలో అప్పటి సమాజంలోనూ ఈ మూవీ చర్చనీయాంశం అయ్యింది.
ఎందుకంటే ఇది కులాంతర వివాహం నేపథ్యంలో సాగే చిత్రం. అప్పట్లో ఈ కల్చర్ ఎక్కువగా ఉండేది. ఇప్పటికీ ఉంది. కానీ అప్పుడే ఈ మూవీలో కులాంతర వివాహం అనంతర పరిణామాలను చర్చించడం విశేషం.
యూత్‌ని కూడా బాగా ఆకట్టుకుంది. పాటల విశేషంగా ఆకట్టుకున్నారు. దీనికి కె చక్రవర్తి సంగీతం అందించారు. ఈ చిత్రం నాలుగైదు సెంటర్లలో వంద రోజులు ఆడింది. కమర్షియల్‌గా సోగ్గాడి చిత్రాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టింది.
అలా ఏఎన్నార్ చేయాల్సిన మూవీని పారితోషికం తగ్గించుకుని మరీ చేసి సోగ్గాడు బ్లాక్ బస్టర్ అందుకోవడం విశేషం.